
ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల
October 11, 2024
దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12
దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ. ఇది శ్రీరాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం రూపంలో చూపబడుతుంది. ఇందులో శ్రీరాముడు రావణుడిని ఓడించి అతని నాభిపై బాణం విసిరి చంపుతాడు. నాభి దేహాభిమానానికి ప్రతీక, ఇది 10 ప్రధాన వికారాలైన కామం, కోపం, దురాశ, మొహం, అహం, అసూయ, ద్వేషం, మోసం, మొండితనం మరియు సోమరితనం, వీటిని రావణుడి 10 తలలుగా చూపబడ్డాయి. రావణుడి 10 తలలలో దేనినైనా నరకటానికి శ్రీ రాముడు ప్రయత్నించినప్పుడు, అవి తిరిగి వచ్చాయని రామాయణ గ్రంథంలో చూపబడింది. శ్రీరాముడు రావణుడి నాభిని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మాత్రమే రావణుడు చంపబడ్డాడు. మనం ఆత్మిక స్మృతిలో ఉంటూ భగవంతుడిని లేదా పరమాత్మను స్మరించటం ద్వారా మన దేహాభిమానం అంతమయినప్పుడు మాత్రమే, మన దుర్గుణాలన్నీ తొలగిపోతాయి.
శ్రీ రాముడు భగవంతునికి చిహ్నం, రావణుడు ఈ రోజు ప్రపంచంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిత్వంలోని చెడుకు చిహ్నం. మన వ్యక్తిత్వంలో భగవంతుని మంచితనాన్ని మనం ధారణ చేసినప్పుడు, మన వ్యక్తిత్వంలోని 10 తలల రావణుడిని కాల్చివేస్తాము. ప్రతి సంవత్సరం రావణుడి దిష్టిబొమ్మను తగలబెట్టడం ఈ ప్రక్రియకు ప్రతీక. ఇది ఈ సమయంలో జరుగుతుంది. భగవంతుడు విశ్వ పరివర్తన చేసే కార్యాన్ని నిర్వహిస్తారు, రావణుడిని లేదా చెడును విశ్వం నుండి తొలగించి ప్రపంచంలోని ఆత్మలందరినీ శుద్ధి చేసి విశ్వంలో రామరాజ్యం లేదా స్వర్గాన్ని స్థాపిస్తారు. ప్రతి సంవత్సరం కాల్చేసే రావణుడి దిష్టిబొమ్మ మునుపటి సంవత్సరం కన్నా ఎత్తుగా ఉంటుంది. ఇది ప్రపంచంలోని దుర్గుణాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి అనడానికి ప్రతీక. వివిధ రూపాల్లోని అపవిత్రత, నెగిటివిటీ కాలక్రమేణా మానవులను మరింత ఎక్కువగా నియంత్రిస్తున్నాయి.
భగవంతుడు ప్రతి సృష్టి చక్రం యొక్క చివరిలో అంటే, కలియుగం లేదా ఇనుప యుగం అంతిమంలో, విశ్వ పరివర్తన యొక్క కార్యాన్ని చేస్తారు. ఈ సమయంలో ప్రతి ఆత్మ దుఃఖపడుతూ రావణుడి ప్రతికూల ప్రభావంతో బంధింపబడి ఉన్నారు. భగవంతుని సంతానమైన ప్రతి ఆత్మ ప్రియమైన వారు కూడా, వీరినే రామాయణంలో శ్రీ సీతగా సూచించారు.
(సశేషం…)
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై
Start your day with a breeze of positivity and stay motivated with these daily affirmations
After Clicking on Join, You will be redirected to Whatsapp Community to receive daily message. Your identitiy will be secured and no group member will know about another group member who have joined.