Hin

12th october 2024 soul sustenance telugu

October 12, 2024

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 2)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12

శ్రీ సీతారాములు మరియు శ్రీ లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసంలో ఉండగా,  ఒక రోజు శ్రీ సీత తన ఆశ్రమానికి సమీపంలో వెండి చుక్కలతో ఉన్న అందమైన బంగారు జింకను చూస్తుందని రామాయణంలో చూపబడింది. బంగారు జింక వాస్తవానికి మారిచుడు  అనే రాక్షసుడు, శ్రీ సీతను మోసగించడానికి రావణుడు మారిచుడ్ని ఆకర్షణీయమైన జింక రూపంలో పంపాడు. జింకను చూసి, శ్రీ సీత దాని పట్ల ఆకర్షితురాలై, దానిని వెతకడానికి శ్రీరాముడిని పంపుతుంది. కాసేపు అయ్యాక, శ్రీ సీతకు మరియు

శ్రీ లక్ష్మణుడుకీ సహాయం కోరుతున్న శ్రీ రాముడి అరుపులు వినిపించగా  శ్రీ రాముడ్ని రక్షించడానికి

శ్రీ లక్ష్మణుడను పంపుతుంది. ఈ ఏడుపు వాస్తవానికి మారిచుడుది. ఆశ్రమం నుండి దూరంగా అడవిలో శ్రీ రాముడు తన బాణంతో జింకను కాల్చిన తరువాత మారిచుడు తన రూపాన్ని జింక నుండి రాక్షసుడిగా మార్చుకొని శ్రీ రాముడి స్వరాన్ని అనుకరిస్తాడు. శ్రీ లక్ష్మణుడు ఆశ్రమాన్ని విడిచిపెట్టి శ్రీ రాముడను రక్షించడానికి వస్తాడని అతను ఇలా చేస్తాడు. మారిచుడు శ్రీరాముడి బాణంతో చంపబడతాడు. ఆశ్రమాన్ని విడిచిపెట్టడానికి ముందు, శ్రీ లక్ష్మణుడు శ్రీ సీత రక్షణ కోసం ఆశ్రమం చుట్టూ ఒక లక్ష్మణ రేఖను గీస్తాడు. ఆ లక్ష్మణ రేఖను దాటి ఎవరూ లోపలకు రాలేరు అంతేకాక దానిని దాటవద్దని శ్రీ సీతను ఆదేశిస్తాడు. శ్రీ లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాక, శ్రీ సీత తన ఆశ్రమంలో ఒంటరిగా ఉన్నప్పుడు, రావణుడు సన్యాసిగా మారువేషంలో ఆమె ఆశ్రమానికి వచ్చి, భిక్ష అడుగుతాడు. శ్రీ సీత మారువేషంలో ఉన్న రావణుడిని గుర్తించదు. రావణుడు లక్ష్మణ రేఖను దాటి లోపలకు రావడానికి ప్రయత్నిస్తాడు కానీ లోనికి వెళ్ళ లేకపోతాడు . అలాగే, మొదట శ్రీ సీత తన కోసం శ్రీ లక్ష్మణుడు గీసిన లక్ష్మణ రేఖను దాటి వెళ్ళలేదు. ఆమె అలా చేయకుండా రావణుడికి సేవ చేయడం ప్రారంభిస్తుంది. కానీ రావణుడు సీతను తెలివిగా మోసం చేస్తాడు, అతను తనకు మరింత గౌరవంతో సేవ చేయమని ఆమెను ఒప్పిస్తాడు. అందుకోసం, సీత అతనికి సేవ చేయడానికి లక్ష్మణ రేఖను దాటుతుంది, ఆమెను రావణుడు కిడ్నాప్ చేసి తన రాజ్యానికి తీసుకువెళతాడు.

వాస్తవానికి, ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే, మనం దేహ భానం వైపు ఆకర్షించబడినప్పుడు (శ్రీ సీత బంగారు జింక వైపు ఆకర్షించబడుతున్నట్లు చూపబడింది) మనం భగవంతుడి నుండి డిస్కనెక్ట్ అయ్యి ఒంటరి అయిపోతాము. (శ్రీ రాముడు ఆశ్రమం వదిలి వెళ్ళినట్లుగా చూపబడింది). మనం భగవంతుడిని మరచిపోయినప్పుడు, మనం వివిధ రకాల చెడులను గుర్తించకుండా (రావణుడిని గుర్తించని శ్రీ సీతగా చూపబడింది) మనం దైవిక స్వచ్ఛత, ప్రవర్తన యొక్క సరిహద్దులను దాటి (శ్రీ సీత లక్ష్మణ రేఖను దాటుతున్నట్లు చూపబడింది) ప్రతికూల చర్యలు చేస్తాము. అప్పుడు చెడు మనల్ని ఖైదు చేస్తుంది, మనం దుఃఖపడతాము (రావణుడు శ్రీ సీతను కిడ్నాప్ చేసినట్లు చూపబడింది). భగవంతుడు సీతలు లేదా ఆత్మలందరినీ దుష్ట పాలన మరియు నియంత్రణ నుండి రక్షించి, వారికి స్వర్ణయుగాన్ని బహుమతిగా ఇస్తారు. స్వర్ణ యుగంలో వారు శాంతి, ప్రేమ, స్వచ్ఛత, ఆరోగ్యం మరియు సంపదతో సంతోషంగా జీవిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »
25th march 2025 soul sustenance telugu

ఆధ్యాత్మిక అవగాహనతో తోబుట్టువుల మధ్య వైరాన్ని అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు తోబుట్టువులు అనగా మీ సోదర సోదరీల మధ్య విభేదాలు ఉండటం సాధారణం, కానీ యుక్త వయసులో కూడా తోబుట్టువుల పట్ల అభద్రత

Read More »
24th march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రాక్టికల్ మెడిటేషన్ అనేది కేవలం ఉదయం రోజును ప్రారంభించే ముందు లేదా రాత్రి నిద్రురించే ముందు చేసేటువంటిది మాత్రమే కాదు, మీరు 

Read More »