Hin

15th sep 2024 soul sustenance telugu

September 15, 2024

ఆంతరికంగా ఉన్న స్వయాన్ని గుర్తించి అనుభవం చేసుకోవటం (పార్ట్ 2)

ఇతరుల దృష్టికోణాల కళ్ళజోళ్ళతో మనల్ని మనం చూసుకోవటానికి అలవాటు పడ్డాము. అవి భౌతిక వైఖరులపై ఆధారపడి ప్రాపంచిక దృష్టితో మసక బారాయి. ఈ రోజు, మనలోని మంచి అని భావించే దానంతటికీ మరియు ఇతరులు మన గురించి మనకు ఏం చెప్తున్నారనే దానికి మనల్ని మనం చాలా గౌరవంగా చూసుకుంటాం. ఇక అకస్మాత్తుగా ఎవరైనా మనల్ని విమర్శిస్తే మనం నిరాశకు గురవుతాము. అవతలి వ్యక్తి యొక్క దృష్టికోణం వల్ల మన మానసిక స్థితిని కోల్పోతాము. ఇదంతా ఎందుకంటే మనం నిజమైన నేను కాకుండా ఇతర విషయాలతో గుర్తించడం నేర్చుకున్నాము. ఉదా – నేను నా విశేషతలతో  స్వయాన్ని గుర్తించానని అనుకుందాం. నేను మంచి డిబేటర్ (స్పీకర్) మరియు ఈ ప్రత్యేకత నా విద్యా వృత్తిలో నా చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి నాకు చాలా ప్రశంసలను తెచ్చిపెట్టింది. కాలక్రమేణా ఆందరూ మిమ్మల్ని తరచూ ప్రశంసించడం ప్రారంభించడంతో గుర్తింపు బలంగా మారుతుంది. గుర్తింపు అంటే మీకు మోహం ఉన్న దానిలో మీరు ఎంతగా నిమగ్నమవుతారంటే ఇది నిజమైన మీరు కాదని పూర్తిగా మర్చిపోతారు. ఈ సందర్భంలో, ఆత్మవిశ్వాసంతో చర్చించే (మాట్లాడే) నైపుణ్యం నాకు ఉన్న ఒక విశేషత, నేను పెద్దయ్యాక లేదా పాఠశాల లేదా కళాశాల నుండి బయటకు వచ్చినప్పుడు దానిని వ్యక్తీకరించే అవకాశం నాకు లభించకపోతే దాని ప్రాముఖ్యత సహజంగానే పోతుంది. కాబట్టి, మోహంతో నన్ను నేను గుర్తించుకున్న దానికి ఏమి జరిగింది? అకస్మాత్తుగా అది నా వైపు తిరిగి వస్తుంది మరియు దాని కారణంగా నాకు లభించే ప్రశంసలు ఇక లేనందున అదే నాకు బాధ కలిగించడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితిలో, నేను మొదట ఈ విశేషతతో నన్ను నేను అంతగా ముడిపెట్టుకోకపోవడం మంచిది. ఎంత ఎక్కువ గుర్తింపు వాటితో ఉంటే, అంత ఎక్కువ బాధ అనుభవిస్తారు.

కాబట్టి, పైన పేర్కొన్న సందర్భంలో బాధను అనుభవించకుండా ఉండటానికి ఒక సరళమైన మార్గం సంతోషంగా ఉంటూ మన వద్ద ఉన్నదానికి అదృష్టంగా భావించడం. అదే సమయంలో బాగా మాట్లాడే విశేషతకు నిర్లిప్తంగా ఉండండి. అనగా మన మాటల ద్వారా మనల్ని మనం ఎలా వ్యక్తీకరించుకుంటాము, మన ఆలోచనలను ఎలా అందిస్తామనే విశేషత. నిర్లిప్తత యొక్క సంబంధం అంటే విశేషతలో నన్ను నేను మరవకుండా, దానితో నా పాత్రను పోషించడం, నేను విశేషతను కలిగి ఉన్న స్వచ్ఛమైన గర్వాన్ని కూడా ఉంచుకోవడం. దీనిని ఆత్మగౌరవం అని కూడా అంటారు, కానీ అదే సమయంలో విశేషతతో అతిగా భయపడవద్దు లేదా స్వ ఆకర్షితులవ్వకూడదు. అది నా ప్రాప్తితో ఆరోగ్యకరమైన సంబంధానికి దారి తీస్తుంది. ఒకవేళ అది తగ్గినా లేదా ఇంతకు ముందు వలె ప్రశంసించబడక పోయినా అది నా ఆత్మగౌరవానికి హాని చేయదు మరియు ఏ సమయంలోనైనా నాకు అసంతృప్తిని కలిగించదు.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »
17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »