Hin

16th sep 2024 soul sustenance telugu

September 16, 2024

ఆంతరికంగా ఉన్న స్వయాన్ని గుర్తించి అనుభవం చేసుకోవటం (పార్ట్ 3)

మనం మన జీవితంలో ఎక్కువ భాగం మన ప్రత్యేకతలు, వ్యక్తిత్వం లేదా పాత్రతో అనుబంధం కొనసాగిస్తే, కాలక్రమేణా మనం గుర్తించబడటానికి వేచి ఉన్న నిజమైన స్వభావాన్ని మరచిపోతాము. పైన పేర్కొన్నవాటిలో నేను ఒకడిని, అని నేను భావించిన ప్రతిసారీ, నా నిజమైన స్వభావంతో నేను మరింత డిస్కనెక్ట్ అవుతాను. నా నిజమైన స్వభావం నాకు మరింత శాశ్వత ఆత్మగౌరవాన్ని ఇస్తుంది మరియు దానికి ఫలితంగా, శాశ్వత ఆనందం కలుగుతుంది. నా వ్యక్తిత్వ నైపుణ్యాలు, నా విద్యా విజయం మరియు నేను దుస్తులు ధరించే విధానం, ఇవన్నీ తాత్కాలికమైనవి. ఎందుకంటే జీవితం ఒక రోలర్ కోస్టర్ అని మర్చిపోకండి, ఇక్కడ విజయం తక్కువ వ్యవధిలో నన్ను సులభంగా వదిలివేయగలదు. కాబట్టి, సాధనలు అన్నిటిని ఆస్వాదించండి. సాధనలను ఆస్వాదించడం అనేది భౌతికమైనది లేదా ఆధ్యాత్మితకు వెతిరేకమైనది కాదు. కానీ మీ ఆనందం కోసం వాటిపై ఆధారపడకండి. మరోవైపు, అన్ని ప్రత్యేకతలు మరియు వ్యక్తిత్వానికి మూలమైన నిజం – నేను. నేను అనేది ఆత్మ యొక్క ప్రాథమిక లక్షణాలైన – శాంతి, ప్రేమ మరియు ఆనందాలతో కూడుకున్నది. లోపల ఉన్న మంచి అంతా శాశ్వతమైనది మరియు ఉన్నత మూలమైన భగవంతుడితో నాకు ఉన్న సంబంధం కూడా అక్షయమైనది (నాశనం చేయలేనిది). దానిపై నేను ఆధారపడాలి ఎందుకంటే అది నన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. మర్చిపోకండి, మన ప్రారంభ జన్మలలో, మనం చాలా నైపుణ్యం కలిగినవాళ్ళం, చాలా అందంగా మరియు చాలా ధనవంతులం, ఎంతగా అంటే ఒక మానవుడు శారీరకంగా కలిగి ఉండగల ప్రతిదీ మనతోనే ఉండేది. అయినప్పటికీ మనము ఈ సాధనలన్నింటి అనుభవిస్తూ కూడా వాటి నుండి పూర్తిగా నిర్లిప్తంగా ఉండేవారము. అది కూడా ఈ సాధనాలు నశించని సమయంలో, ఎందుకంటే అది అసలు ప్రపంచం, సంతోషకరమైన ప్రపంచం. కానీ, ఇప్పుడు మన జీవితంలో ఈ సాధనలన్నీ శాశ్వతమైనవి కావు మరియు ఎంతో సులభంగా కొద్దీ సెకండ్ల లోనే మన నుండి దూరంగా వెళ్ళవచ్చు ఎందుకంటే మనం అనూహ్యమైన మరియు అనేక హెచ్చు తగ్గులు ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాము.  ఏ నైపుణ్యం లేదా పాత్ర శాశ్వతంగా ఉంటాయని హామీ లేదు. మరోవైపు, శాశ్వతంగా మన పక్షాన నిలబడేది అక్షయమైన – నేను మాత్రమే . కాబట్టి, ఈ నేను అనే చేతిని మనం శాశ్వతంగా గట్టిగా పట్టుకోవాలి మరియు నేను అనేదానిని శాశ్వత మూలమైన పరమ ఆత్మతో అనుసంధానించాలి. ఫలితంగా జీవితంలోని ప్రతి క్షణాన్ని పూర్తి సురక్షితత, హామీ మరియు భద్రతతో ఆస్వాదించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »