Hin

18th feb 2024 soul sustenance telugu

February 18, 2024

ఆపేక్షలను విడిచిపెట్టండి

మీ సహోద్యోగి సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మీరు ఎప్పుడూ సహాయం చేస్తూనే వచ్చారు, కానీ ఒక్కసారి మీరు అతడిని సహాయం అడిగితే అతను నిరాకరించాడు. మీరు ఇంటికి చేరుకునేసరికి బాగా అలసిపోయారు. మీ చిన్న కొడుకు మంచిగా ఉండాలని మీరు ఆశించారు, కానీ అతడు మాత్రం ఆ సాయంత్రమంతా విసుకు, చికాకును ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఇటువంటి సందర్భాలను మనం ఎదుర్కున్నాం కదా, ఇలాంటివి చూసి మనకు ఆశ్చర్యం వేస్తుంది – ఎందుకు వ్యక్తులు చిన్న చిన్న ఆపేక్షలను కూడా తీర్చలేకపోతున్నారు? నాకు తగిన విధంగా వీరెందుకు ఉండటం లేదు? మన అలవాట్లు, దృష్టికోణాలు, ఎంపికలు, ప్రాధాన్యతలు వేరు. మన అధికారము, పాత్రలు, బాధ్యతలు ఎలా ఉన్నాగానీ మనం ఇతరులవలె ప్రవర్తించము. నేను ఆశించేది ఎంత చిన్నది, ఎంత సింపుల్ అయినది అని కూడా అనలేరు. కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు, సమాజం… అందరినుండి మీకున్న ఆపేక్షలను విడిచిపెట్టండి. మనం మనలా ఉందాం, ఇతరులను వారిలా ఉండనిద్దాం. మనం అంగీకరిస్తూ, సలహా ఇస్తూ, శిక్షణ ఇస్తూ, అభిప్రాయాన్ని గౌరవంగా పంచుకుందాం, కానీ వ్యక్తులు మన అంచనాలకు, ఆపేక్షలకు తగ్గట్లుగా లేకపోతే కలత చెందవద్దు. ఈ మాత్రం ఆశించడం సహజమే కదా అన్న నమ్మకాన్ని విడిచిపెట్టండి, వైవిధ్యాలను అంగీకరించడం సహజమే అన్న మాటను ప్రయోగించండి. ఇది మనల్ని భావోద్వేగంగా స్థిరంగా ఉండటంలో సహాయపడి ప్రతి పరిస్థితిలో సంబంధాలు సామరస్యంగా ఉండేలా చూస్తుంది.

ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు, మాట్లాడరు, ప్రవర్తించరు. అయిప్పటికీ మనం ఆశ్చర్యపోతూనే ఉంటాం – వీరు ఇలా ఎలా ఉంటున్నారు? వీరిలా ఎందుకు అన్నారు? ఇటువంటి నిరర్థకమైన ఆలోచనలు మరియు ఆపేక్షల భారం మనలోని ప్రేమ మరియు శాంతి శక్తులకు అడ్డుగా ఉంటుంది. మన మనసు యొక్క స్థితికి బాహ్య పరిస్థితులతో సంబంధం లేదని గుర్తుంచుకోండి. ప్రశాంతంగా కూర్చుని, మీ ఆలోచనలను ప్రోగ్రమ్ చేసుకుని ఇతరులపట్ల మీకున్న భావాలను సరి చేసుకోండి. లొంగిపోవద్దు, తిరిగి కొట్టవద్దు, ఆశించవద్దు, నిందించవద్దు, ఫిర్యాదు చేయవద్దు. మీ ఆంతరిక స్థితికి మీరే బాధ్యతను వహించండి మరియు మీ స్పందనను మీరే ఎంచుకోండి. వ్యక్తుల ప్రవర్తనలకు దూకుడుగా, అకస్మాత్తుగా స్పందించకండి. వ్యక్తులు  వైవిధ్యంగా ఉంటారు అని మీరు అంగీకరిస్తే మీకు సంతోషం స్థిరంగా ఉంటుంది మరియు వారిపై పాజిటివ్‌గా ప్రభావం పడుతుంది. 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »