Hin

26th dec 2023 soul sustenance telugu

December 26, 2023

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల మీద దృష్టిని సారించాలి. కానీ మీరు ఒకే అంశం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారా? బహుశా కఠినమైన లక్ష్యాల వల్ల స్వయాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ పనిలో మునిగిపోయారా? లేదా ఇంట్లో సమస్య వల్ల చంచలమై ఉద్యోగంలో సరిగ్గా పని చేయలేకపోతున్నారా? వర్క్-లైఫ్ బ్యాలన్స్ అంటే ప్రాధాన్యమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఏది ఏమైనా సరె, దానికి కట్టుబడి ఉండటం. చేతిలో ఉన్న పనిపై దృష్టి కేంద్రీకరించడం, మిగతా వాటిని పూర్తిగా పక్కన పెట్టడం వల్ల మనకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సమయం మరియు శక్తి లభిస్తాయి. ముందుగా స్వయానికి, తరువాత కుటుంబానికి, ఇక ఆ తర్వాత ఉద్యోగానికి ప్రాధాన్యతను ఇద్దాము. మనసుకు పోషణను ఇచ్చేందుకు సమయాన్ని కేటాయించడం, శరీరానికి వ్యాయామం చేయడం,  కుటుంబంతో సంతోషకరమైన వైబ్రేషన్స్ ను అనుభవం చేసుకోవడంలో మనకు సహాయపడతాయి. అప్పుడు మనం మన కార్యాలయంలోకి ఉత్సాహంతో అడుగు పెట్టగలం. మరియు మనం ఉద్యోగంలో సంతోషంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లడం సులభం అవుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే , అవసరమైనది చేసి స్విచ్ ఆఫ్ చేద్దాం. కుటుంబంతో ఉన్నప్పుడు ఆఫీస్ కాల్స్ చేయ వద్దు, భోజనం చేసేటప్పుడు పరధ్యానంగా ఉండొద్దు, నిద్రించే సమయం పై రాజీపడవద్దు. ఈ క్రమశిక్షణ జీవితంలో ఆరోగ్యకరమైన సమతుల్యతను తీసుకువస్తుంది. వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ సమయం, ఉద్యోగం మరియు స్నేహాలను సమతుల్యం చేసుకునే కళ నాకు ఉంది అని మీకు మీరే గుర్తు చేసుకోండి.

 

జీవితంలోని విభిన్న కోణాలను సమతుల్యం చేసే కళకు కొంచెం అభ్యాసం మరియు పట్టుదల అవసరం.  ఒక కోణం ప్రధానం అనిపించినప్పుడు ఇంకొకటి పూర్తిగా వదిలేయకూడదనే దృఢ సంకల్పం కూడా అవసరం. ఈ త్రైమాసికంలో నా ప్రాజెక్ట్‌లు తప్పనిసరి లక్ష్యాలతో  ఉన్నాయి, కాబట్టి నా దృష్టి అంతా పనిపైనే ఉండాలి అని మనం అంటాము. దీని అర్థం 3 నెలలు – 90 రోజులు – మనము తొందరపాటు, ఆందోళన మరియు అల్లకల్లోలం యొక్క శక్తిని కలిగి ఉంటాము. మనం ఆరోగ్యం, కుటుంబ సమయం లేదా సామాజిక జీవితంపై కూడా తగినంత దృష్టి పెట్టలేకపోవచ్చు. ఆపై 3 నెలల తర్వాత, తదుపరి త్రైమాసికంలో ప్రాజెక్ట్‌లు కూడా ఎక్కువ కాకపోయినా వాటి సమానమైన సవాళ్లతో ఉండవచ్చు. కాబట్టి, ఇది అసమతుల్యతను సృష్టిస్తుంది, సమయం మరియు శక్తి కెరీర్ వైపే ఎక్కువగా ఉంటుంది. ప్రాధాన్యత ఇవ్వడం చాలా కీలకం, అయితే జీవితంలోని ప్రతి అంశానికి సమానమైన శ్రద్ధ వహించేలా చూసుకుందాం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th june2024 soul sustenance telugu

విజయం కోసం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తయారుచేసుకోవడం (పార్ట్ 1)

జీవితంలో వివిధ రకాల పరిస్థితులు ఎదురుకోవడం, వివిధ రకాల వ్యక్తులను కలవడం, మీకు ఎన్నో సవాళ్లను తీసుకొస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అలాగే, మన వ్యక్తిత్వం  స్థాయిలో మన శక్తులు

Read More »
24th june2024 soul sustenance telugu

పోటీ పడకుండా సహకరించుకుందాం

నిజమైన సహకారం అంటే సర్వులకు ఎల్లవేళలా తన వారనే భావన మరియు సాధికారత ఉద్దేశ్యంతో షరతులు లేని సహాయాన్ని అందించడం. ఇది వినయం, ప్రేమ, కరుణ మరియు తాదాత్మ్యం వంటి మన నిజ గుణాలను

Read More »
23rd june2024 soul sustenance telugu

నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలు

నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన శారీరక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని అపారంగా ప్రభావితం చేస్తుంది. నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలను చూద్దాం –

Read More »