Hin

1st April 2025 Soul Sustenance Telugu

April 1, 2025

ఆత్మగౌరవం యొక్క 5 పాయింట్లను జీవితంలో అలవరచుకుందాం (పార్ట్ 1)

జీవితంలోని ఏ పరిస్థితిలోనైనా, ఏ రంగంలోనైనా విజయానికి అత్యంత ముఖ్యమైన శక్తులలో ఒకటి, చాలా శక్తివంతమైన మరియు పాజిటివ్ మానసిక స్థితి. ఆత్మ గౌరవం పాజిటివిటీ కి మొదటి మెట్టు. ఆత్మ పరిశీలనతో ఆత్మ గౌరవం వస్తుంది. భౌతికమైన గుర్తింపుతో మనం తరచుగా సమాజంలో మన విభిన్న పాత్రలను పోషిస్తాము – భౌతిక శరీరం, భౌతిక పాత్ర, సంబంధాలు, సంపద, విద్య మరియు ఉద్యోగం వంటివి. మనము ఈ రకమైన గుర్తింపులను వాస్తవికత గా పరిగణిస్తాము, కానీ చాలాసార్లు ఈ అన్ని రంగాలలో మరియు జీవితంలోని అంశాలలో మార్పు సహజంగా ఉన్న కారణంగా, మనం  ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నాం. అందువలన మానసిక బలం ఉండటం లేదు. మనల్ని ఆంతరికంగా  బలపరిచే ఆత్మ పరిశీలన ఆధారంగా ఆత్మ గౌరవం యొక్క విభిన్న ఆధ్యాత్మిక అంశాలను ఈ సందేశంలో చూద్దాం. 

  1. నేను ఒక విజయీ ఆత్మను, నా విజయం గ్యారంటీ – ప్రతి ఉదయం, జీవితంలోని ప్రతి రంగంలో మీ విజయం గ్యారెంటీ అనే ఆత్మ గౌరవము యొక్క మొదటి సంకల్పాన్ని చెయ్యండి. ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ సంకల్పాన్ని రోజులో చాలాసార్లు రిపీట్ చేసుకోండి. ఇది మీ ప్రతి ఆలోచన, మాట మరియు కర్మలలో పాజిటివిటీ ని ఇంజెక్ట్ చేస్తుంది మరియు మీ పాత్రలో పాజిటివిటీ కనిపిస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, సంపదను సంపాదించడంలో మరియు జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని సాధించడంలో కూడా మీకు వివిధ రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. మీ అంతఃచేతన మనస్సులో ఈ పాజిటివ్ ఆలోచనను మీరు ఎంత ఎక్కువగా అనుభవం చేసుకుంటూ ఉంటె, మీరు తేలికగా మరియు సంతోషంగా ఉంటారు. అలాగే, ఈ ఆంతరిక శక్తి మెరుగైన వ్యక్తిగత సంబంధాలలో మరియు జీవితంలోని వివిధ సాధనలలో అందమైన ఫలితాలను చూపుతుంది. మీ మనస్సులో విజయం యొక్క పాజిటివ్ భావన ప్రతి చర్యలో గ్యారంటీ గా విజయాన్ని ఇస్తుంది. జీవితం ఎలాంటి ప్రశాంతమైన ప్రయాణంగా మారుతుంది అంటే ఇక ఏదైనా తప్పు చాలా అరుదుగా జరుగుతుంది, ఒకవేళ జరిగినప్పటికీ, దానంతట అదే చాలా తక్కువ వ్యవధిలో సరిదిద్దుకుంటుంది.

(సశేషం…)

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »