Hin

2nd April 2025 Soul Sustenance Telugu

April 2, 2025

ఆత్మగౌరవం యొక్క 5 పాయింట్లను జీవితంలో అలవరచుకుందాం (పార్ట్ 2)

  1. సంతోషం నా ఆంతరిక నిధి, అది నా స్వంతం – నా సంతోషానికి నేనే సృష్టికర్తనని మరియు నా జీవితంలోని ప్రతి పరిస్థితిలో ఈ సంతోషాన్ని నింపాలని, దానిని అందంగా మరియు సానుకూలంగా మార్చుకోవాలని ఎల్లప్పుడూ మీకు మీరు గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు జీవితం మన ముందు దుఃఖకరమైన దృశ్యాలను ఉంచుతుంది, అది మనస్సును నెగెటివ్ గా ప్రభావితం చేసి మన ఆనందాన్ని తగ్గిస్తుంది. కానీ సంతోషం అనేది నా స్వంత నిర్ణయం, అది సంఘటనలపై ఆధారపడదని మనం గుర్తుచేసుకున్నప్పుడు, జీవితంలోని ఏ సన్నివేశంలోనైనా మనం స్థిరంగా మరియు తేలికగా ఉంటాము. అలాగే, స్థిరమైన ఆనందానికి ఆధారం నేను ఆధ్యాత్మిక జ్ఞానం, గుణాలు, శక్తులు, బలాలు, ప్రతిభ మరియు ప్రత్యేకతలు అనే సంపదల యజమానిని అని అర్థం చేసుకోవడం. నేను వాటిని నా ప్రయోజనం కోసం మరియు ఇతరుల ప్రయోజనం కోసం వివిధ మార్గాల్లో ఉపయోగించాలి. నేను ఈ పనిలో ఎంత బిజీగా ఉంటానో, ఆధ్యాత్మికంగా నేను మరింత సుసంపన్నంగా మరియు నిండుగా ఉంటాను మరియు అది నన్ను ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతుంది.
  2. నేను శక్తివంతమైన ఆత్మను, నేను పాజిటివ్ విజయాన్ని నా స్వంతం చేసుకుంటాను – విజయాన్ని పొందడం అనేది ఆంతరిక శక్తి మరియు దృఢ సంకల్పంతో వస్తుంది. మన ముందు ఏదైనా సవాలుతో కూడిన పని ఉన్నప్పుడు, అది మన సంకల్ప శక్తిని పరీక్షించి, దానిని తగ్గించి సవాలును మరింత విపరీతంగా మారుస్తుంది. నెగెటివ్ మరియు అనవసరమైన ఆలోచనల లీకేజీలు లేకుండా ఉన్న మనస్సు చాలా దృఢమైనది  మరియు శక్తివంతమైనది. శక్తివంతమైన మనస్సుతో కూడిన ఆత్మ, అది చేసే ప్రతి పనిలో అందమైన విజయాన్ని పొందుతుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు సర్వ శక్తివంతుడైన భగవంతునితో కనెక్ట్ అవడం అనగా మెడిటేషన్, మన చేతన మరియు అంతః చేతన మనస్సును శుభ్రంగా మరియు స్వచ్ఛంగా చేస్తుంది, ఫలితంగా మన విల్ పవర్ ను పెంచుతుంది. అలాగే, ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదివి మననం చేయడం, మన పాజిటివ్ ఆలోచనల శాతాన్ని పెంచుతుంది. మనము మరింత దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం మరియు పాజిటివిటీ తో నిండి ఉంటాము.

(సశేషం…)

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »