Hin

3rd june2024 soul sustenance telugu

June 3, 2024

ఆత్మను మరియు అది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం  (పార్ట్ 1)

మీ గతం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?  అంటే జీవితం శాశ్వతమైనదని లేదా మరో మాటలో చెప్పాలంటే జీవితం ఒక్క జన్మ వాస్తవం కాదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఆత్మ అంటే ఏమిటో మనందరికీ తెలుసు, దాని గురించి వింటాము కాని మనం విన్న జ్ఞానాన్ని మన వ్యక్తిగత జీవితంలో ఉపయోగిస్తున్నామా? భౌతిక శరీరం ద్వారా మనం చేసే ప్రతి పని వాస్తవానికి ఆధ్యాత్మిక శక్తి లేదా ఆత్మ చేస్తుంది. కానీ, ఆత్మను చూడలేనందున, అది నేనే, భౌతిక స్వరూపమే ప్రతీది చేస్తోంది అని అనుకుంటాము. ఈ రోజు సైన్స్ కూడా తన అమరత్వాన్ని పరిగణించడం ప్రారంభించింది. అలాగే, శాంతి, ప్రేమ మరియు ఆనందం యొక్క అదృశ్య, భౌతికేతర మూలం అయిన స్వయాన్ని అంటే ఆత్మను నమ్మడం ప్రారంభించారు. ఆత్మ ఆలోచించే మనస్సును కలిగి ఉంటుంది. మరోవైపు, మెదడు కేవలం భౌతిక మాధ్యమం, దీని ద్వారా ఆత్మ పనిచేస్తుంది. ఇది మనస్సు యొక్క మొత్తం ఆలోచించే పనికి అనుగుణంగా రసాయన, విద్యుత్ కార్యకలాపాలను కలిగి ఉన్న మాధ్యమం. ఆలోచనా ప్రక్రియ మనస్సులో ఉంటుంది, భౌతికేతరమైనది మరియు ఆలోచనా ప్రక్రియ వల్ల కలిగే రసాయన, విద్యుత్ కార్యకలాపాలు మెదడులో భౌతికంగా ఉంటాయి. మీరు మీ మనస్సులో ఒక ఆలోచనను సృష్టించిన ప్రతిసారీ, మీ మెదడు ఆ నిర్దిష్ట ఆలోచనకు అనుగుణంగా స్పష్టమైన విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేస్తుందని మీకు తెలుసా? ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్లను రికార్డ్ చేసే, అర్థం చేసుకునే పద్ధతిని EEG (ఎలెక్ట్రోఎన్సెఫలోగ్రఫీ) అని అంటారు, ఇది మనస్సులో ఉన్న ఆలోచనా ప్రక్రియ గురించి కూడా మనకు ఒక అవగాహనను ఇస్తుంది. ఇది గుండె యొక్క విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేసే ECG (ఎలక్ట్రో కార్డియోగ్రఫీ) పద్ధతిని పోలి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన గౌరవనీయ వ్యక్తుల సమూహం కూడా ఉంది. ఇంజినీరింగ్, మెడిసిన్, బిజినెస్, ఎడ్యుకేషన్ ఇలా వివిధ రంగాల నుండి అందరి ఆధ్యాత్మిక అభ్యున్నతికి తమ జీవితాలను అంకితం చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఆధ్యాత్మిక సేవతో పాటు తమ తమ రంగాల్లో సేవలందిస్తున్నారు. వివిధ నేపథ్యాల నుండి వచ్చిన ఈ వ్యక్తులందరూ తమ భౌతిక శరీరాలను నడుపుతున్న స్పృహ యొక్క శక్తులని లేదా ఆత్మలని గుర్తించారు మరియు అనుభవం చేసుకున్నారు, ఇది ఆధ్యాత్మికత యొక్క అత్యంత ప్రాథమిక సూత్రం. అలాగే, ధ్యానంలో తమ భౌతిక శరీరం మరియు మెదడు నుండి వేరుగా ఉన్నట్లు, మరణానికి సమీపంలో మరియు శరీరానికి వెలుపల అనుభవాలను అనుభవం చేసుకున్న వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు. 

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th june2024 soul sustenance telugu

పోటీ పడకుండా సహకరించుకుందాం

నిజమైన సహకారం అంటే సర్వులకు ఎల్లవేళలా తన వారనే భావన మరియు సాధికారత ఉద్దేశ్యంతో షరతులు లేని సహాయాన్ని అందించడం. ఇది వినయం, ప్రేమ, కరుణ మరియు తాదాత్మ్యం వంటి మన నిజ గుణాలను

Read More »
23rd june2024 soul sustenance telugu

నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలు

నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన శారీరక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని అపారంగా ప్రభావితం చేస్తుంది. నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలను చూద్దాం –

Read More »
22nd june2024 soul sustenance telugu

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ

Read More »