Hin

4th june2024 soul sustenance telugu

June 4, 2024

ఆత్మను మరియు అది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం (పార్ట్ 2)

ఆత్మ ఒక భౌతికేతర శక్తి, ఇది భౌతిక శరీరాన్ని నడుపుతుంది. విద్యుత్ శక్తి టెలివిజన్ సెట్‌ను ఎలా నడుపుతుందో ఆత్మను దానితో పోల్చవచ్చు. కరెంటు లేకుంటే, టెలివిజన్ సెట్ మరియు దాని అన్ని భాగాలు ఉన్నా, అది మనకు ప్రపంచ చిత్రాలను చూపించదు, ప్రపంచంలోని సంఘటనల గురించి మనకు తెలియ చేయదు. అదే విధంగా, వివిధ భాగాలు, వివిధ వ్యవస్థలతో ఉన్న భౌతిక శరీరం దాని లోపల ఆత్మ లేకుండా పనిచేయదు. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే, గుండె మరియు ఇతర అవయవాలు పనిచేయడం మానేస్తాయి, మెదడు కూడా పనిచేయదు. ఆత్మ శరీరాన్ని కదలించే ప్రధాన శక్తి  . ఆత్మ మెదడులోని భాగాలైన హైపోథాలమస్ మరియు పిట్యూటరీ గ్రంధికి సమీపంలో మెదడు లోపల ఉంటుంది. ఇది మెదడు ద్వారా నాడీ మరియు హార్మోన్ల వ్యవస్థల సహాయంతో ఐదు ఇంద్రియ అవయవాలను – కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక మరియు చేతులను నియంత్రిస్తుంది. మెదడు ఆత్మ మరియు వివిధ శరీర భాగాల మధ్య వారధిగా పనిచేస్తుంది. 

సైన్స్ అందించిన వివిధ సాధనాల ద్వారా కనుగొనబడిన మెదడు కార్యకలాపాలు ఆత్మ యొక్క ఉనికి కారణంగా సంభవిస్తాయి. నిజానికి శరీరం లోపల ఆలోచించే భౌతికేతర ఆత్మ లేకుంటే, భౌతిక మెదడు లోపల ఎలాంటి కార్యకలాపాలు గుర్తించబడవు అంటే మెదడు నిశ్శబ్దంగా ఉంటుంది. నిజానికి ఆలోచించేది మనస్సు, మెదడు కాదు. మనస్సు భౌతికం కానిది మరియు భౌతికేతర ఆత్మలో ఒక భాగం. ఆత్మ మరియు భౌతిక శరీర సంబంధాన్ని మనం కంప్యూటర్‌తో పోల్చవచ్చు. మెదడు కంప్యూటర్ యొక్క CPU లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది, అయితే ఆత్మ కంప్యూటర్ యొక్క ప్రోగ్రామర్ లాంటిది. మెదడు ఆత్మ నుండి స్వీకరించబడిన అన్ని ఆలోచనలు, మాటలు మరియు చర్యలను శరీరం ద్వారా వ్యక్తపరుస్తుంది. శరీరం కంప్యూటర్ యొక్క మానిటర్ లాంటిది, ఇది మెదడు ద్వారా ప్రాసెస్ చేయబడిన దాని యొక్క తుది వర్షన్ ను ప్రదర్శిస్తుంది. మనం ఆలోచించగానే, శరీరం యొక్క భౌతిక అవయవం అయిన మెదడు, భౌతికేతర ఆత్మ నుండి ఈ సంకేతాలను తీసుకుంటుంది. మెదడు గుర్తించిన సంకేతాలు లేదా ఆదేశాలు శరీరంచే నిర్వహించబడే వివిధ చర్యలుగా మార్చబడతాయి. ఆత్మ యొక్క భౌతికేతర సూచనలు మెదడు ద్వారా భౌతిక రూపం ఇవ్వబడి చర్యలోకి తీసుకురాబడతాయి.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »
25th march 2025 soul sustenance telugu

ఆధ్యాత్మిక అవగాహనతో తోబుట్టువుల మధ్య వైరాన్ని అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు తోబుట్టువులు అనగా మీ సోదర సోదరీల మధ్య విభేదాలు ఉండటం సాధారణం, కానీ యుక్త వయసులో కూడా తోబుట్టువుల పట్ల అభద్రత

Read More »
24th march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రాక్టికల్ మెడిటేషన్ అనేది కేవలం ఉదయం రోజును ప్రారంభించే ముందు లేదా రాత్రి నిద్రురించే ముందు చేసేటువంటిది మాత్రమే కాదు, మీరు 

Read More »