Hin

5th june2024 soul sustenance telugu

June 5, 2024

ఆత్మను మరియు అది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం (పార్ట్ 3)

మీరు ఉదయం లేచినప్పుడల్లా, నేను భౌతిక శరీరానికి పూర్తిగా భిన్నంగా ఒక  ఆధ్యాత్మిక శక్తినని చెప్పుకోండి, అంటే అది 5 భౌతిక తత్వాలతో చేయబడనిది. భౌతిక శరీరం ఈ తత్వాలతో తయారుచేయబడింది. మానవాత్మ అనే పదానికి అక్షరార్థంగా మానవ+ఆత్మ అని అర్థం, ఇక్కడ మానవ అంటే హ్యూమస్ లేదా మట్టి అని అర్థం. ఇది నిర్జీవమైనది. ఆత్మ అంటే ఆధ్యాత్మిక శక్తి అని అర్థం. ఇది జీవిం కలిగినది. దీనినే ఆత్మ అవగాహన లేదా నిజమైన స్వీయ పరిచయం అంటారు. దీనిని ఆత్మిక స్థితి అని కూడా అంటారు, అంటే నేను దైనందిన పనులను చేసేటప్పుడు మరియు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా నేను ఆత్మను అన్న భావనలో ఉండటము. దీని అర్థం ఏ పని చేయకుండా, ఉద్యోగాన్ని, ఇతర బాధ్యతలను పట్టించుకోకుండా ఉండటం అని కాదు. కానీ ఆత్మిక స్థితిలో ఉంటూ, ఆత్మ యొక్క గుణాలను అనుభవం చేసుకుంటూ మన కర్తవ్యాలను నిర్వర్తించడం. ఆత్మ యొక్క రూపం భౌతిక రూపం కాదు, ఎందుకంటే ఆత్మ భౌతికేతర శక్తి లేదా కాంతి. ఇక్కడ కాంతి అంటే భౌతిక నేత్రాల ద్వారా చూడవచ్చని కాదు. అలాగే, ఇది ఒక కాంతి, ఇది చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. భూతద్దం లేదా మైక్రోస్కోప్ క్రింద కూడా చూడలేము, ఎందుకంటే ఇది భౌతికేతరమైనది.

విజువలైజేషన్‌ను సులభతరం చేయడానికి, బ్రహ్మా కుమారీల వద్ద మనం ఆత్మను ధ్యానంలో నుదిటి మధ్యలో, కనుబొమ్మల పైన, సూక్ష్మమైన కాంతి నక్షత్రంగా అనుభూతి చెందుతాము. నిన్నటి సందేశంలో వివరించినట్లుగా, ఆత్మ యొక్క అసలు స్థానం మెదడు లోపల ఉంటుంది. ఆత్మ బయటి ప్రపంచాన్ని, కళ్ళ ద్వారా చూస్తుంది, చెవుల ద్వారా వింటుంది మరియు నోటి ద్వారా మాట్లాడుతుంది, ఇవి ఆత్మ చేసే ప్రధాన చర్యలు. స్పర్శ, వాసన మరియు రుచి యొక్క ఇతర ఇంద్రియాలను కూడా ఆత్మ దాని స్థానంలో ఉంటూ నిర్వహిస్తుంది. చివరగా, ఆత్మ యొక్క గుణాలు శాంతి, సంతోషం, ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం, ఇవి ఆత్మ చేసే చర్యలపై ఆధారపడి మార్పు చెందుతాయి. ఆత్మ సానుకూల చర్యలను చేస్తే, ఈ గుణాలు పెరుగుతాయి  మరియు చేసే చర్యలు ప్రతికూలంగా ఉంటే, అవి తగ్గుతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »
19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »