Hin

అడుగడుగులో నవీనత (పార్ట్ 1)

November 6, 2023

అడుగడుగులో  నవీనత  (పార్ట్ 1)

పాజిటివిటీ మరియు సృజనాత్మకతతో కూడిన జీవితం ఒక అందమైన ప్రయాణం. అలాంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా ఇష్టపడతారు మరియు పరిపూర్ణంగా ఆనందిస్తారు. కొత్తదనం మరియు ఉత్సాహంతో నిండిన విభిన్న ఆలోచనలు, మాటలు మరియు చర్యలు మన జీవితాన్ని నడిపించే శక్తి. ప్రతిరోజూ ఒకే రకమైన ఆలోచనలు, మాటలు మరియు చర్యలతో జీవితం రొటీన్ గా ఉండకూడదు. ప్రతిరోజూ ఒకే దృశ్యాలు మరియు పరిస్థితులతో కాకుండా జీవితం వివిధ రకాల సంఘటనలతో ఆనందం మరియు వైవిధ్యంతో నిండిన ప్రయాణంగా ఉండాలి. మనం ప్రతిరోజూ అదే వ్యక్తులను కలుసుకునే కన్నా వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించడం వల్ల జీవితానికి పాజిటివిటీ  మరియు విశ్రాంతి యొక్క కొత్తదనం లభిస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ కొత్త వ్యక్తులను కలుసుకోవడం, వివిధ రకాల సృజనాత్మక  కార్యకలాపాలను చేయడం ద్వారా జీవితానికి ఒక కొత్త అర్థాన్ని మరియు ఉద్దేశ్యాన్ని అందించడం ఒక అలవాటుగా చేసుకోండి. మీ ఉద్యోగంలో కూడ జీవితానికి కొత్త ప్రయోజనాన్ని అందించే వివిధ రకాల కార్యకలాపాల కోసం చూడండి. ఉద్యోగం లేదా ఇంటి పనిని అయినా బోరింగ్ ఎక్సర్‌సైజ్‌గా మార్చే రోజువారీ దినచర్యకు అలవాటు పడకండి. సృజనాత్మకంగా ఉండండి మరియు అడుగడుగునా కొత్తదనాన్ని తెచ్చుకోండి.

అలాగే, మీరు మీ రోజును ప్రారంభించినప్పుడల్లా, మీ మనస్సులో కొన్ని పాజిటివ్ సంకల్పాలను చేయండి. ఆ పాజిటివ్ సంకల్పాలు విజయం మరియు దృఢతతో నిండి ఉండనివ్వండి, ఇది రోజంతా మిమ్మల్ని పాజిటివ్ శక్తితో నింపుతుంది, తద్వారా అలసిపోకుండా చర్యలు చేయవచ్చు. ఆనందంగా జీవించడం అంటే ఇదే. అలాగే, రోజులో ప్రతి రెండు గంటల తర్వాత, మీ పనిని 3 నిమిషాలు ఆపి  మీ మనస్సులోని ఆలోచనలను చెక్ చేసుకోండి. అవి తప్పు దిశలో వెళుతున్నట్లయితే మెడిటేషన్ లో   శక్తివంతమైన, పాజిటివ్ ఆలోచనలను చేయడం ద్వారా వారికి కొత్త దిశను అందించండి లేదా శాంతి సాగరుడైన భగవంతునితో కనెక్ట్ అయి సైలెన్స్ యొక్క అనుభవాన్ని పొందండి. మొదటిది పాజిటివ్ ఆలోచనల విస్తరణ మరియు రెండవది ఆలోచనలను సమాప్తి చేయడం.  రెండూ మనస్సును శక్తివంతం చేసే ఆధ్యాత్మిక పద్ధతులు. ఈ రెండూ మనస్సును కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి, దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. పరిస్థితిని బట్టి ఏదో ఒకటి  ప్రయత్నించండి. అలాగే, మీ దగ్గరి బంధువు లేదా స్నేహితుడిని మీ జీవితంలో భాగంగా చేసుకున్నట్టే రోజంతా భగవంతునితో మాట్లాడుతూ వారిని మీ జీవితంలో భాగంగా  చేసుకోండి.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 2)

సానుకూల శక్తిని ఎప్పటికీ కోల్పోవద్దు వ్యక్తులు మన జీవితాల్లోకి వేర్వేరు, కొన్నిసార్లు వ్యతిరేక సంస్కారాలతో కూడా వస్తారు. తరచుగా, మన ప్రియమైనవారిలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు – భర్త లేదా భార్య, తల్లిదండ్రులు, పిల్లలు

Read More »
8th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం   మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు.

Read More »
7th feb 2025 soul sustenance telugu

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా

Read More »