అడుగడుగులో నవీనత (పార్ట్ 2)

November 7, 2023

అడుగడుగులో  నవీనత  (పార్ట్ 2)

మన జీవితంలో కొత్తదనానికి చాలా ముఖ్యమైనది జీవిత పరిస్థితుల పట్ల భిన్నమైన దృక్పథం. పాజిటివ్ దృక్పథం జీవిత అనుభవాలను మరింత అందంగా మారుస్తుంది. పాజిటివ్ దృక్పథం కలిగిన వ్యక్తి జీవితాన్ని కొంత నెగెటివ్ మనస్తత్వం ఉన్న వ్యక్తి కంటే భిన్నంగా చూస్తాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన పనిలో సవాలును ఎదుర్కొంటున్నాడని మరియు దానిని అధిగమించడానికి ఒక పరిష్కారానికి రాలేకపోతున్నాడని అనుకుందాం. అతను తన జీవితంలోని ప్రస్తుత పరిస్థితిని  భిన్నమైన దృక్కోణంతో చూస్తే, అతను చాలా కాలంగా ఉన్న పాత దృక్పథంతో ఉండటం కంటే చాలా వేగంగా మరియు సులభంగా పరిష్కారానికి చేరుకుంటాడు. విభిన్న దృక్పథం మరియు దృక్కోణంతో సమస్యలకు పరిష్కారాలు కొన్నిసార్లు అద్భుతంగా రావచ్చు. కానీ జీవితాన్ని కొత్త ఆలోచనలతో నింపడానికి, ప్రపంచం గురించి మాత్రమే కాకుండా ఆత్మ మరియు భగవంతుని గురించి ఎక్కువగా చెప్పే ఆధ్యాత్మికతో కూడా మనస్సును జ్ఞానంతో నింపాలి. మీకు మీ గురించి మరియు పరమాత్మ గురించి ఎంత ఎక్కువ తెలిస్తే అంత వివేక వంతులై జీవితాన్ని సరికొత్త దృక్పథంతో చూస్తారని గుర్తుంచుకోండి. దే విజయానికి మూలం.

అలాగే, వ్యక్తుల ప్రత్యేకతలను చూడటం, వాస్తవానికి వివిధ పరిస్థితులలో విభిన్న ప్రత్యేకతలు చూడటం, జీవితాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది, అదే వ్యక్తులు భిన్నంగా మరియు చక్కగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరిలో మనకు తెలిసిన వివిధ ప్రత్యేకతలు ఉంటాయి అని మర్చిపోవద్దు. మీరు ఒక వ్యక్తితో మంచి సంబంధాలు కలిగి లేరనుకోండి మరియు మీరు ఆ వ్యక్తి నుండి ఎప్పుడూ నెగెటివ్ ఎనర్జీ పొందుతారనుకోండి. కొన్ని రోజుల పాటు ఆ వ్యక్తి యొక్క విభిన్న ప్రత్యేకతలను చూస్తే వారి ప్రమేయం ఉన్న పరిస్థితుల వలన మీరు ఎప్పటికీ అలసిపోరు. ఇదే ప్రాక్టికల్ పాజిటివ్ థింకింగ్  మరియు కొత్త ఆలోచనా విధానం.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

10th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

ప్రశంసలు మరియు విమర్శలలో స్థిరత్వం

ప్రశంసలు మన అహాన్ని పెంచితే, విమర్శలు వచ్చినపుడు మనం కలత చెందడం ఖాయం. ప్రశంసలు లేదా విమర్శల ద్వారా ప్రభావితం కాకుండా మన చర్యలపై దృష్టి పెట్టాలని ఆధ్యాత్మిక జ్ఞానం మనకు బోధిస్తుంది. ఏదైనా

Read More »
9th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

టీం మీటింగ్స్ లో ఎలా భాగం కావాలి

టీం మీటింగ్ ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పని చేయడానికి, నేర్చుకోవడానికి, అభిప్రాయాలు పంచుకొని భాగస్వామ్యం కావడానికి అవకాశాన్ని అందిస్తుంది. తరచుగా, మనం మన అహం మరియు అసహనాన్ని మనతో పాటు మీటింగ్ కు

Read More »
8th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మీ వాస్తవికతలో మీకు ఏమి కావాలో అది మాత్రమే ఆలోచించండి

మన ఆలోచనలు మన వాస్తవికతను సృష్టిస్తాయని మనందరికీ తెలుసు. మన వాస్తవికతలో ఏదైనా మారాలంటే, మన ఆలోచనలను మార్చుకోవాలి. మన ప్రస్తుత వాస్తవికత గురించి ఆలోచిస్తూ ఉంటే, మన ఆలోచనల శక్తి మన వర్తమానానికి

Read More »