Hin

8th-nov-2023-soul-sustenance-telugu

November 8, 2023

అడుగడుగులో  నవీనత  (పార్ట్ 3)

ఉన్నతమైన జీవితం ఆనందాన్ని నింపుతుంది. అలాగే, సంతోషకరమైన జీవనం యొక్క ఆధ్యాత్మిక దృక్పథం ఏమిటంటే అన్ని వేళలా మీతో మీరు మాట్లాడుకుంటూ జీవిత పరిస్థితులు ఎంత నెగిటివ్ గా ఉన్నప్పటికీ వాటిలో పాజిటివిటీ ని చూడటం. ప్రతి ఒక్కరినీ ప్రేమించడం మరియు మీ ప్రతి సంబంధంలో శుభాభావనల శక్తిని వ్యాప్తి చేయడం జీవితాన్ని అందంగా మరియు పాజిటివ్ గా చేస్తుంది. ప్రతిరోజూ ఇలా ఒక సారి చేయండి, మీ సన్నిహితులందరిని గుర్తు చేసుకొని ఇలా చెప్పుకోండి – మీరందరూ విశేష ఆత్మలు, మీ అందరితో నాకు ప్రేమపూర్వకమైన స్వచ్ఛమైన అనుబంధం ఉంది. మీరందరూ చాలా సంతోషంగా,  అన్ని గుణాలతో నిండి ఉండాలని, మీ జీవిత పరిస్థితులను సులభంగా అధిగమించి అడుగడుగునా విజయాన్ని పొందాలని నా శుభాభావన. ఇదే అందరికీ ఆశీస్సులు ఇచ్చే విధానం. ఇది కేవలం సిద్ధాంత స్థాయిలో, మన స్పృహలో మాత్రమే ఉండే పాజిటివిటీ కాదు ఇది కర్మలలో పాజిటివిటీ. వ్యక్తులు మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవారని గుర్తుంచుకోండి. కనుక,  వారితో పాజిటివిటీ మరియు ప్రేమతో నిండిన పరస్పర చర్యలు జీవితాన్ని ఆహ్లాదకరంగా మరియు కొత్తదనంతో నింపుతాయి.

భగవంతుడిని కూడా ప్రతిరోజు కొత్తగా ఆరాధించాలి మరియు ప్రేమించాలి. దాని వలన వారితో సంబంధం ప్రేమ మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది. అంతేకానీ వారి ఆరాధన ఎప్పుడూ రిపీట్ అయ్యే ఒక రొటీన్ మాత్రం కాదు. అలా రొటీన్ అయితే మాటిమాటికి వారిని మర్చిపోతాము. నిజానికి, భగవంతుడు మన తల్లి, తండ్రి, స్నేహితుడు, శిక్షకుడు, మరియు గురువు కూడా. ఈ విభిన్న సంబంధాల ద్వారా భగవంతుడిని స్మరించుకోవడం, వారి సద్గుణాలను స్మరించుకోవడం కూడా వారిని విభిన్నంగా ప్రేమించే మార్గం. ఉదా. మీరు భగవంతుడిని మీ స్నేహితుడు అని అంటారు, కానీ మీరు ఆ సంబంధం యొక్క అనుభూతిని పొందుతున్నారా? మీరు భగవంతుడిని సర్వశక్తివంతుడని  అంటారు, కానీ మీ రోజువారీ జీవితంలో ఆ శక్తిని ఫీల్ అవుతున్నారా? కాబట్టి, మీరు చేసే ప్రతి పని వైవిధ్యం మరియు సృజనాత్మకతతో నిండి ఉండాలి, అది జీవిత ప్రయాణాన్ని సాఫీగా మరియు ప్రతిరోజూ కొత్తదనం కోసం ఎదురుచూసేలా చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 2)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 శ్రీ సీతారాములు మరియు శ్రీ లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసంలో ఉండగా,  ఒక రోజు శ్రీ సీత తన ఆశ్రమానికి సమీపంలో వెండి చుక్కలతో ఉన్న అందమైన

Read More »
11th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 1)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ. ఇది శ్రీరాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం రూపంలో చూపబడుతుంది. ఇందులో శ్రీరాముడు రావణుడిని ఓడించి

Read More »
10th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: – ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో

Read More »