HI

అహంకారం కంటే దృఢత్వాన్ని ఎంచుకోవడం

April 6, 2024

అహంకారం కంటే దృఢత్వాన్ని ఎంచుకోవడం

రోజువారీ జీవితంలో మన వివిధ పాత్రలలో, కావాల్సిన ఫలితాలను సాధించడానికి మనం అందరిని ప్రభావితం చేయాలి. దానికోసం మనకు మనం వినయంగా నచ్చ చెప్పుకోవడం ప్రారంభిస్తాము, కానీ కొన్ని సమయాల్లో మనకు మనం ఒత్తిడిని ఇస్తాం లేదా అహంకారిగా మారుతాము.

  1. దృఢమైన కమ్యూనికేషన్ అనేది మీరు అభ్యాసంతో నైపుణ్యం సాధించగల కళ. స్పష్టంగా ఆలోచించి వినయంగా మాట్లాడండి. మీ అభిప్రాయం, అవసరాలు లేదా భావాలను తెలియజేయడానికి తక్కువ మరియు సరైన పదాలను ఎంచుకోండి. నమ్మకంగా మరియు గౌరవంగా ఉండండి. సంభాషణలో విజయం సాధించడం కంటే లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి పెట్టండి.
  2. మీరు స్వచ్ఛమైన వారితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి. అవతలి వ్యక్తి మీ అభిప్రాయాలను ప్రతిఘటించవచ్చు, వ్యతిరేకించవచ్చు లేదా ప్రశ్నించవచ్చు. వారు మొరటుగా కూడా ఉండవచ్చు. వారి ప్రవర్తన పట్ల జాలి చూపండి. ప్రేమ స్వరూపంగా ఉంటూ ఓపికగా వినండి.
  3. వారి దృక్కోణాన్ని చూడటానికి మీ దృక్కోణం నుండి వేరు అవ్వండి. వారి ఆందోళనలను గుర్తించి వాటిని పరిష్కరించండి. వారికి విలువను ఇస్తున్నారు అని వారు భావించినప్పుడు, వారు మీ దృక్కోణాన్ని గౌరవిస్తారు మరియు మరింత స్వీకరించగలరు.
  4. ప్రతి ఒక్కరూ ఏకీభవించిన తర్వాత, ప్రశాంతంగా బాధ్యతలను తెలియజేయండి, సమయపాలనలను సెట్ చేయండి, నియమాలను ఏర్పాటు చేయండి మరియు వ్యక్తులను గౌరవంగా క్రమశిక్షణలో పెట్టండి.
  5. మీ విలువల విషయంలో రాజీ పడకండి. పర్యావసనాలకు భయపడకుండా వాటిపై దృఢంగా నిలబడండి.

అహంకారం కంటే దృఢత్వాన్ని ఎంచుకోవడంతో, అందరూ మీతో కలిసి ఉండటానికి మరియు మీతో పని చేయడానికి సౌకర్యంగా ఉంటారు. మీరు వారిని గౌరవిస్తారు కాబట్టి, వారు మిమ్మల్ని గౌరవిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd may 2024 soul sustenance telugu

మీకు భగవంతునితో బలమైన సన్నిహిత సంబంధం ఉందా?

భగవంతుడు శాంతి, ప్రేమ మరియు ఆనంద సాగరులు. ఈ అసలైన సుగుణాలు కలిగి ఉన్న ఆత్మలమైన మనం వారి పిల్లలం. మనం భగవంతునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, వారి నుండి ఈ సుగుణాలతో

Read More »
22nd may 2024 soul sustenance telugu

భిన్నంగా ఉన్న వారి పట్ల దయకలిగి ఉండటం

మీరు ప్రపంచాన్ని ఇతరులకు భిన్నంగా ఎలా చూస్తున్నారో గుర్తించడం ద్వారా మాత్రమే మీకు భిన్నంగా ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండాలనే అవగాహనను పెంపొందించుకోవచ్చు. భిన్నంగా ఉన్న వారు అంటే మీరు కలిసే

Read More »
21st may 2024 soul sustenance telugu

మిమ్మల్ని మీరు మార్చుకోవాలని లోతుగా అనుకుంటున్నారా?

చాలా సార్లు, మనం మన స్వపరివర్తన లక్ష్యాలపై ముందుకు వెనుకకు ఊగిసలాడుతూ ఉంటాము . ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం పైపై మార్పులు చేస్తూ ఉత్సాహంగా మొదలుపెడతాము. చాలా వరకు మన దృష్టి ఏమి

Read More »