Hin

27th november 2024 soul sustenance telugu

November 27, 2024

అహంకరం దెబ్బతినడం (పార్ట్ 2)

నిన్నటి సందేశాన్ని కొనసాగిస్తూ, మనం సాధారణంగా నా అహం దెబ్బతింది లేదా మీ అహం దెబ్బతిందని నేను భావిస్తున్నాను అనే పదాలను ఉపయోగిస్తాము. మీరు నా అహంభావాన్ని గాయపరిచారు అంటే నేను ప్రతిరోజూ నాతో పాటు తీసుకువెళ్ళే ఇమేజ్ను మీరు బాధపెట్టి, హాని చేసారు. నేను దానిని అన్ని సమయాల్లో నాతో తీసుకెళ్లడం వల్ల, నేను దానికి బానిస అయ్యాను. ఉదా. ఒక నిర్దిష్ట రోజున, మీరు కార్యాలయం నుండి ఆలస్యంగా ఇంటికి చేరుకుంటే, మీపై కోపంగా ఉన్న మీ జీవిత భాగస్వామి (భర్త లేదా భార్య), మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోలేదని, కుటుంబానికి తగినంత సమయం ఇవ్వలేదని మిమ్మల్ని నిందించారు అనుకుందాం. ఇంటికి ఆలస్యంగా చేరుకోవడానికి మీ కారణాలు నిజమైనవి కావచ్చు లేదా కాకపోవచ్చు, మీ జీవిత భాగస్వామి మాట్లాడేది సరైనది కావచ్చు లేదా తప్పు కావచ్చు. ఏ సందర్భంలోనైనా, కుటుంబం ఏర్పడినప్పటి నుండి అన్ని విధాలుగా కుటుంబం యొక్క సర్వతోముఖాభివృద్ధి మరియు అభివృద్ధికి బాధ్యత వహించే చాలా ప్రేమ, శ్రద్ధలు గల జీవిత భాగస్వామిగా, తల్లిదండ్రులుగా మీరు ఎల్లప్పుడూ ఒక ఇమేజ్ను కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామి మాటలు ఆ అదృశ్య ఇమేజ్ను గుచ్చినట్లు చేస్తాయి, దీని ఫలితంగా మీరు అవమానానికి గురవుతూ బాధపడి కోపంగా స్పందిస్తారు. ఇలా మీ జీవిత భాగస్వామి ముందు మాత్రమే కాదు, వేరొకరి ముందు లేదా ఆంతరికంగా కూడా కావచ్చు. ఈ ప్రక్రియ చాలా సార్లు జరుగుతుంది, దాదాపు ప్రతిరోజూ వేర్వేరు వ్యక్తులతో వివిధ విభిన్న పరిస్థితులలో జరుగుతుంది.

 

మనమందరం తీసుకువెళ్ళే మన ఇమేజ్ వివిధ లక్షణాలతో రూపొందించబడింది, కానీ ప్రతి ఒక్కరి స్వీయ-సృష్టించిన ఇమేజ్ యొక్క లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఆ ఇమేజ్ యొక్క లక్షణాలు మన నిజమైన స్వభావం లోపల ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, కానీ ఎవరైనా ఈ లక్షణాలలో దేనినైనా సవాలు చేసినప్పుడు లేదా ఆ లక్షణాలలో ఒకటి మనది కాదని లేదా మన లోపల లేదని సూచించడానికి ప్రయత్నించినప్పుడల్లా, మనం ప్రతిస్పందిస్తాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »