Hin

5th May 2025 Soul Sustenance Telugu

May 5, 2025

అహంకారాన్ని వదిలేయండి

మనమందరం అహాన్ని వదిలేయాలని కోరుకుంటాము, అయితే అహం అంటే ఏమిటి? మనం తప్పుగా, సంపాదించిన దానిని మన గుర్తింపుగా చేసుకోవటమే అహం. అది మన అర్హత, స్థానం, నైపుణ్యం, సంబంధం లేదా ఆస్తులు కావచ్చు. వాటిని అంటిపెట్టుకుని నేను ఇది లేదా నేను అది అనే భావంతో జీవిస్తాం. ఇతరులు కూడా మనల్ని అదే విధంగా గుర్తించాలని ఆశిస్తాము. ఆమె నా అహాన్ని దెబ్బతీసింది అని మనం అన్నప్పుడు, వాస్తవానికి ఆమె నా గురించి నాకున్న గుర్తింపుకు హాని చేసిందని అర్థం.

అహంకారాన్ని వదిలేయడానికి “నేను వాస్తవంగా ఎవరిని?” అనే భావంతో ఆలోచించండి. ఏదైనా కలిగి ఉండటం లేదా ఏమీ లేకుండా ఉండటం అనే అహంకారాన్ని ముగించడానికి ప్రతిరోజూ ఈ సంకల్పాన్ని రిపీట్ చేయండి. మీరు అహం నుండి వినయం వైపు మారినప్పుడు మీరు ప్రేమ మరియు గౌరవాన్ని కోరుకోవడం మానేస్తారు. మీరు ఇతరులకు మీ ప్రేమ మరియు అంగీకారాన్ని ప్రసరింపజేసే విధానానికి మారతారు.

సంకల్పం :

నేను స్వచ్ఛమైన ఆత్మను. నేనెవరో నాకు స్పష్టంగా తెలుసు… నా గుర్తింపును తెలుసుకొనే ఉంటాను… నేను ఆత్మను… నేను చాలా పాత్రలను పోషిస్తాను… ఈ జీవితకాలంలో నేను చాలా సంపాదించాను… కానీ నేను సంపాదించినవి నేను కాదు… అవి నావి….అవి నేను కాదు…  నేను ఆత్మను… స్వచ్ఛమైన, శక్తివంతమైన, ప్రేమగల, సంతోషకరమైన జీవిని ….అన్నింటినీ సంపాదించిన ఆ శక్తిని …నేను  నా పేరును కాదు … నా శరీరాన్ని కాదు  … నా సంబంధాలు కాదు  … నా డిగ్రీలు  కాదు  … నా హోదాను కాదు …. నేను… స్వచ్ఛమైన ఆత్మ అనే స్మృతిలో ఉంటాను… మరియు నేను కలిసే, సంభాషించే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛమైన ఆత్మయే. నేను ఏమీ కోల్పోతానని భయపడను. నా దగ్గర ఉన్నవాటికి నేను ట్రస్టీని…నేను వాటిని చూసుకుంటాను… కానీ అవి నేను కాదు. నేను నిరాడంబరంగా ఉంటాను… నేను తేలికగా మరియు స్వచ్ఛంగా ఉంటాను… నేను…పదవి లేదా ఆస్తుల.. అహం లేకుండా జీవిస్తాను. నాకంటే ఎవ్వరూ తక్కువ కాదు…ఎవరూ నాకంటే గొప్పవారు కాదు…అందరూ సమానమే…ప్రతీ ఒక్కరూ స్వచ్ఛమైన, శక్తిమంతమైన ఆత్మ… మనుషులు నాకు  కావాల్సిన విధంగా ఉండాల్సిన అవసరం లేదు… వారు వారి విధంగా ఉండ వచ్చు… నేను నాలా ఉంటాను…సరైన విధంగా ఉంటాను …  నేను .. నమ్రత మరియు శక్తితో ప్రతిస్పందిస్తాను … నేనెవరో నాకు తెలుసు… నేను ఇతరులతో పోల్చుకోను…నేను పోటీపడను…నేను నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తాను … నా భావాలు నావి…ఇతరులపై ఆధారపడవు…నాకు ఏమీ అవసరం లేదు … నేను కేవలం  … ప్రేమ మరియు ఆనందాన్ని ఇస్తాను. 

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »