Hin

14th october 2024 soul sustenance telugu

October 14, 2024

అహంకారం లేకుండా నొక్కిచెప్పడం

కుటుంబంలో మరియు కార్యాలయంలో మన వేర్వేరు పాత్రలలో, కావాల్సిన ఫలితాలను పొందేందుకు వ్యక్తులను ప్రభావితం చేయడానికి మనం దృఢంగా ఉండాలి. మన అభిప్రాయాలను మర్యాదగా చెప్పడానికి, ఇతరులను గౌరవించడానికి, ఖచ్చితంగా ఉంటూ మార్పుకు అనువుగా ఉండటానికి దృఢత్వం మనకు సహాయపడుతుంది. కానీ మనం శ్రద్ధ పెట్టకపోతే, మనం అహంకారిగా మారి మనమే మెరుగైన వారమని అనిపించడానికి ఇతరులను తక్కువగా చూడవచ్చు. మన వివిధ పాత్రలలో, మనం అందరిపై ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది, తద్వారా మనం కావాల్సిన ఫలితాలను సాధించవచ్చు. మనమందరం వినయంగానే  నొక్కిచెప్పడం ప్రారంభిస్తాము, కానీ కొన్నిసార్లు మనం మొండిగా లేదా అహంకారంగా మారుతాము.

  1. దృఢమైన కమ్యూనికేషన్ అనేది మీరు అభ్యాసంతో ప్రావీణ్యం పొందగల నైపుణ్యం. స్పష్టంగా ఆలోచించి, వినయంగా మాట్లాడండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి తక్కువ మరియు సరైన పదాలను ఎంచుకోండి. నమ్మకంగా మరియు మర్యాదపూర్వకంగా ఉండండి. సంభాషణలో గెలవడం కంటే లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి పెట్టండి.
  2. మీరు మరొక స్వచ్ఛమైన వ్యక్తితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి, ఒక పాత్ర లేదా పదవితో కాదు. అవతలి వ్యక్తి మీ అభిప్రాయాలను ప్రతిఘటించవచ్చు, వ్యతిరేకించవచ్చు లేదా ప్రశ్నించవచ్చు. వారు మొరటుగా కూడా ఉండవచ్చు. వారి ప్రవర్తన పట్ల సానుభూతి కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ ఓపికగా వినండి.
  3. వారి దృక్పథాన్ని అర్ధం చేసుకోవటానికి మీ దృక్పథం నుండి వేరవ్వండి. వారి ఆందోళనలను గుర్తించి వాటిని పరిష్కరించండి. వారికి విలువను ఇస్తున్నామని అనిపించినప్పుడు, వారు మిమ్మల్ని గౌరవిస్తారు, మరింత స్వీకరిస్తారు.
  4. ప్రతి ఒక్కరూ అంగీకరించిన తర్వాత, ప్రశాంతంగా బాధ్యతలను తెలియజేయండి, కాలపరిమితిని నిర్ణయించండి, నియమాలను ఏర్పాటు చేయండి. అందరినీ గౌరవంగా క్రమశిక్షణ చేయండి.
  5. మీ విలువలతో రాజీపడకండి. పర్యవసానాలకు భయపడకుండా విలువలపై దృఢంగా నిలబడండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »