Hin

13th july 2024 soul sustenance telugu

July 13, 2024

ఆకర్షణ సిద్ధాంతం (లా ఆఫ్ అట్రాక్షన్) – మనమేమిటో మనం అదే పొందుతాము

కుటుంబం లేదా స్నేహితుల నుండి అంగీకారం పొందడానికి చాలా కష్టపడి ప్రయత్నించినప్పటికీ, ప్రేమ మరియు ఆప్యాయతను అందని కొంతమంది వ్యక్తులను (లేదా మనల్ని కూడా) మనం చూస్తూ ఉంటాము. వారు అందరినీ చూసుకుంటారు కానీ వారిని ఎవ్వరూ పట్టించుకోరు. కొన్నిసార్లు ఇది కేవలం పట్టించు కోవడం గురించి మాత్రమే కాదు, వారు కోపం, ద్వేషం, తిరస్కరణ, ఎగతాళి లేదా అసమ్మతి వంటి వ్యతిరేక గుణాలను కూడా ఆకర్షిస్తారు. మనకు స్వయం పట్ల ప్రేమ అసలు లేకపోవడం లేదా ఆత్మనూన్యత భావంతో బాధపడుతున్నప్పుడు ఇది జరుగుతుంది. అటువంటి ప్రకంపనలను ప్రసరింపచేయడం ద్వారా, మనం ఇతరుల నుండి కూడా ప్రేమ మరియు గౌరవం లేకపోవడాన్ని ఆహ్వానిస్తాము లేదా ఆకర్షిస్తాము, ఎందుకంటే మనం ఇచ్చేదే  మనం పొందుతాము. అది ప్రేమ, శాంతి , ఆనందం ఏదైనా , మనం మనకు ఇచ్చుకోలేకపోతే, మరెవరూ మనకు ఇవ్వలేరు. ఇదంతా మన నుండి ప్రారంభమై లోపలి నుండి బయటికి వెళుతుంది. ఎవరైనా విజయం కోసం చాలా కష్టపడి పనిచేసినప్పటికీ పదేపదే వైఫల్యాన్ని ఆకర్షించినప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇది మన సూక్ష్మ శక్తి యొక్క నాణ్యతతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత, భయం లేదా సందేహం వంటి ప్రతికూలతను సృష్టించకుండా మనం దాని వైపు ప్రయాణించాలి. విజయవంతం కావడానికి అవసరమైనది లేకపోవడం కంటే, వైఫల్య భయం వల్ల మనం తరచుగా విఫలమవుతాము. ఎదో ఒక సందర్భంలో  విఫలమైనప్పటికీ, లక్ష్యం వైపు సానుకూలంగా పురోగమించడానికి మనస్సుకు శిక్షణ ఇవ్వాలి. మన ప్రకంపనలు సానుకూలంగా ఉన్నప్పుడు, మరిన్ని అవకాశాలు తెరుచుకుంటాయి.

 

మనలో ప్రతి ఒక్కరికి ఎనిమిది ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. మెడిటేషన్ మరియు నిరంతర  ఆధ్యాత్మిక అధ్యయనాలతో, మనం స్వయాన్ని అంగీకరించే శక్తిని పెంచుకోవాలి. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. మన గురించి మనం ఏమనుకుంటున్నాము అనేది ముఖ్యమైనది. విజయాలు లేదా ఇతరుల అంగీకారం ఆధారంగా కాకుండా, మన మూల విలువలపై మన ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుందాం. అదేవిధంగా మనం ఎదుర్కొనే శక్తిని పెంచుకుంటే మన శక్తులు భయం మరియు స్వయం పట్ల  సందేహానికి అతీతంగా ప్రవహిస్తాయి. ఈ శక్తి మనస్సును ధైర్యం వైపు తిరిగి నిర్దేశిస్తుంది, అందువల్ల మనం జీవితంలోని ఏ రంగంలోనైనా విజయం సాధిస్తాము. ఆకర్షణ సిద్ధాంతం (Law of Attraction) ఇలాంటి సందర్భాలలోనే అమలవుతుంది. అంటే మనం ఏమి కోరుకుంటే అది లభిస్తుందని ఈ సిద్ధాంతం అర్థం కాదు, మనమేమిటో అదే మనకు లభిస్తుంది అని అర్థం. మనము అంటే మన ఆలోచనలు మరియు మాటలు, ఇవే ఈ విశ్వంలోకి తరంగాల రూపంలో వెళ్ళి తిరిగి మనకు చేరుకుంటాయి. మనలోని సంస్కారాలు, మన కర్మ లెక్కలు కూడా మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి, కనుక వీటి ఆధారంగా కూడా మనం పొందుతాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »
2nd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 1)

మనం అనూహ్యమైన జీవితాన్ని గడుపుతున్నాము. మన జీవితంలో తరచూ ఊహించని పరిస్థితులు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఏమిటి? ఈ రోజు మన జీవితాలలో క్లిష్ట పరిస్థితులు ఎందుకు పెరుగుతున్నాయి? భగవంతుడు వెల్లడించిన ప్రపంచ నాటకం

Read More »
1st dec 2024 soul sustenance telugu

దివ్యమైన ఆత్మ యొక్క 12 లక్షణాలు (పార్ట్  2)

స్వయంలోని బలహీనతలను, లోపాలను సులభంగా పరిశీలించుకోగలిగే అద్దం లాంటి వారు దివ్యమైన ఆత్మ. వారిలో భగవంతుని మంచితనాన్ని, శక్తులను చూడగలుగుతాము. వారు భగవంతునితో స్వచ్ఛంగా, సత్యంగా ఉంటారు. వారు ప్రతిదీ ఎలా ఆచరణలోకి తీసుకురావాలనే

Read More »