Hin

14th july 2024 soul sustenance telugu

July 14, 2024

ఆలోచనా ప్రకంపనలు మరియు వాటి ప్రాముఖ్యత

వాతావరణం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మన చుట్టూ ఉన్న భౌతిక గాలిని సూచిస్తుంది, మరొకటి ఏదైనా ఒక ప్రదేశంలో ఆలోచనా ప్రకంపనలు సృష్టించే సూక్ష్మ ప్రభావాన్ని సూచిస్తుంది.  రద్దీగా ఉండే రెస్టారెంట్ యొక్క వాతావరణం ఆలయ వాతావరణానికి భిన్నంగా ఉంటుందని ఎవరూ కాదనలేరు. దీనికి ప్రధాన కారణం ఆ ప్రదేశంలో వివిధ రకాల ఆలోచనలు మరియు భావాల ప్రభావం. చూడలేని లేదా వినలేని ఎవరైనా కూడా వ్యత్యాసాన్ని గుర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆలోచన ప్రకంపనలను చూడలేము కానీ వాటి భౌతిక మరియు శారీరక ప్రభావం మరింత శక్తివంతమైనవి  మరియు ప్రభావవంతమైనవి. తొక్కిసలాట లేదా భూకంపం సమయంలో మనుష్యులు సృష్టించే భయం, నొప్పి మరియు క్రికెట్ ఆటలో విజయం సాధించిన అపారమైన ఆనందపు  ఆలోచనలు వాతావరణాన్ని ఎలా సృష్టిస్తాయో చెప్పడానికి ఉదాహరణలు.

 

సూక్ష్మమైన స్థాయిలో, మనలో చాలా మందికి టెలిపతి అనుభవం ఉంది-నేను మీ గురించి ఆలోచిస్తున్నాను మరియు మీరు కాల్ చేసారు లేదా మెసేజ్ పంపారు అని అంటారు. ఆలోచనలు చాలా దూరంగా వున్నా వ్యక్తులను కలుపుతాయి. భౌతిక శరీర అనారోగ్యాలలో 90% పైగా మానసిక మూలం ఉందని వైద్యులు మనకు తెలియజేస్తున్నారు. అంటే అది మన మానసిక స్థితి యొక్క ప్రత్యక్ష లేదా పరోక్ష ఫలితం. ఆలోచనలు పదార్థాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేదానికి మానవ శరీరాన్ని ప్రధాన ఉదాహరణగా చేస్తుంది.

 

ప్రపంచం వ్యక్తుల సమిష్టి, వ్యక్తిగత ప్రపంచాలతో రూపొందించబడినందున, ప్రపంచం యొక్క సూక్ష్మ వాతావరణం మన ఆలోచనల సమిష్టి ప్రభావాల కంటే మరేమీ కాదని తెలుస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »
12th jan 2025 soul sustenance telugu

మనం మంచితనపు వైబ్రేషన్లను కలిగి ఉన్నామని తెలిపే 5 గుర్తులు

  మనమందరం ప్రపంచంలో మంచి ఆత్మలం. ఈ ప్రపంచ నాటకంలో ప్రతి ఒక్కరికీ మంచితనాన్ని ప్రసరింపజేసే పాత్ర మనది. మంచితనపు వైబ్రేషన్ అంటే  మనం ఎక్కడికి వెళ్లినా, ఎవరితో సంభాషించినా ప్రతి ఒక్కరూ మన

Read More »
11th jan 2025 soul sustenance telugu

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి

మనమందరం గొప్ప వక్తలం కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణ సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను ఎవరైనా అర్థం చేసుకునేలా చేయడం మాత్రమే కాదు. ఇతరులు

Read More »