Hin

19th mar 2024 soul sustenance telugu 1

March 19, 2024

ఆనందంగా సహించండి, బాధతో కాదు

నిత్యం మారుతూ ఉండే ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. ఇక్కడ ఒత్తిడి పెరుగుతుంది, అనేక వ్యక్తులతో, అనేక రకాల వ్యక్తిత్వాలతో మనం పని చేయాల్సి ఉంటుంది, జీవితంలో అనేక రకాల సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. ఇటువంటి ప్రపంచంలో, కోపం రావడం సహజమే, మూడ్ ఆఫ్ అవ్వడం సహజమే. అటువంటి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, బాధ లేకుండా ఎలా సహనం వహించాలి? ఇందుకు 5 అడుగులను చూద్దాం –

  1. మీ మనసును ఇతరుల పట్ల ఆత్మిక ప్రేమతో నింపుకోండి: మనల్ని ఎవరైనా విమర్శించినా, అవమానించినా లేక నిందించినా వెంటనే వారిని ఆత్మగా చూడండి. సుగుణాలు నిండిన అందమైన ఆత్మను చూడండి, వారిలో ఉన్న కోపము లేదా అహంకారము అల్పకాలికమైన అపవిత్రత అని గుర్తించండి, అది వారి నిజ గుణము కాదు, పవిత్ర గుణము కాదు అని గుర్తుంచుకోండి.
  2. పరిస్థితిని భగవంతుడికి అర్పించి అతిగా నిర్ణయించడం లేక విశ్లేషించడం చేయకండి: ఇతరుల నెగిటివ్ ప్రవర్తనను మీరు ఎదుర్కున్నప్పుడు, మీరు మీ సర్వ సంబంధాలను భగవంతుడికి అర్పించారని మీతో మీరు మాట్లాడుకోండి. వ్యక్తి గురించిగానీ, పరిస్థితి గురించిగానీ మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం భగవంతునితో కనెక్ట్ అయి ఉండండి, వారి ప్రేమ మరియు శక్తిని అనుభూతి చేస్తూ ఉండండి. ఆ వ్యక్తి లేక పరిస్థితి గురించి భగవంతుని శక్తితో మంచిగా ఉండాలని ఆకాంక్షించండి.
  3. ఏదైనా ఒక జ్ఞాన పాయింట్‌ను గుర్తు పెట్టుకుని దానిలోని శక్తిని అనుభూతి చేయండి: ఆత్మ గౌరవంలో నిలిపే అనేక పాయింట్లు భగవంతుని జ్ఞానములో ఉన్నాయి, వీటిని మనం రోజూ వింటూ ఉంటాము, చదువుకుంటూ ఉంటాం. అందులో ఏదైనా ఒక పాయింటును గుర్తు పెట్టుకోండి, మీ మనసులో ఇతరుల నెగిటివ్ మాటలను, చేతలను గుర్తు తెచ్చుకోకండి.
  4. ఇతరులకు మీరు ఆధారాన్ని, సహకారాన్ని అందించండి: ఇతరుల ప్రేమ, ఆధారము మరియు సహకారాన్ని పొందడానికి చక్కని మార్గము – అది ముందుగా మీరు వారికి మీ ఆలోచనలు, మాటలు మరియు చేతలతో ఇవ్వడమే. ఇలా కొంతకాలం చేయండి, ఇతర వ్యక్తి కూడా పూర్తిగా నెగిటివ్ నుండి పాజిటివ్‌లోకి మారుతాడు.
  5. ఆ వ్యక్తికి మెడిటేషన్‌లో తరంగాలను ఇవ్వండి: ప్రతిరోజూ, కొన్ని క్షణాలు, ఆ వ్యక్తిని ఊహించుకుని మెడిటేషన్లో భగవంతుని ముందు చూడండి. మీరు భగవంతుడి నుండి తీసుకునే మంచి మరియు పాజిటివ్ శక్తులను వారికి ఇవ్వండి. ఇది వారి ఆలోచనలను మారుస్తుంది, మీకు దగ్గర చేస్తుంది, మీ పట్ల వారికున్న చెడు భావనను తీసేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »