Hin

16th April 2025 Soul Sustenance Telugu

April 16, 2025

అందమైన మరియు ఆనందకరమైన సంబంధాలను ఏర్పరచుకోండి

ఆత్మలమైన మనము, అనేక జన్మలలో, సంబంధాలను సృష్టిస్తాము మరియు కొన్నిసార్లు వాటికీ హాని కూడా చేస్తాము. మనం తరచుగా మర్చిపోయే విషయం ఏమిటంటే, సంబంధాలు మనకు లాభాన్ని కలిగిస్తాయి మరియు హాని కూడా చేస్తాయి. మనం చేసే పొరపాట్లు ఏమిటి? ఏదైనా సంబంధం దాని స్వంత వివిధ దశల గుండా వెళుతున్నప్పుడు, మనం అలలతో ముందుకు వెనుకకు ఊగుతూనే ఉంటాము, సుఖము మరియు దుఃఖము మధ్య తప్పుగా ముందుకు వెనుకకు బౌన్స్ అవుతాము. సంతోషకరమైన క్షణాలు చాలా త్వరగా గడిచినట్లు అనిపిస్తాయి, మరియు ప్రియమైన వ్యక్తి నుండి కలిగే నిరాశ ఆవిరైపోవడానికి ఎక్కువ సమయం తీసుకునట్లు అనిపింస్తుంది. ఈ ప్రతికూల చక్రం గురించి తెలుసుకున్నప్పటికీ, మనము సత్యమైన సంబంధాల కోసం ఆరాటపడతాము. మనం ప్రతికూలంగా చిక్కుకోకుండా, సానుకూలంగా ఉన్నామని భావించే అందమైన సంబంధాలను ఎలా నిర్మించగలం? మరొక ఆత్మతో అందమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో సరైన పునాదిని నిర్మించడానికి మన ఎమోషన్లను సృజనాత్మకంగా ఉపయోగించడం కీలకం. ప్రాథమిక అంశాలను ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇది స్వీయ సంతృప్తి కోసం చేస్తున్నామా లేదా జీవితంలోని సాధారణ ఆనందాలను పంచుకోవాలనుకోవడం మరియు వ్యక్తీకరించాలనుకోవడం వల్లనా?

 

మన జీవితంలో ఇతర ఆత్మను మరియు వారి వ్యక్తిత్వాన్ని బేషరతుగా అంగీకరించి, వారి ఆలోచనలను పట్టుకోకుండా, నిర్వహించకుండా సాధన చేసినప్పుడు సంబంధాలు సామరస్యంతో నిండి ఉంటాయి. సంబంధం తీసుకునే ప్రతి రంగును దాన్ని ఆ విధంగా అనుభూతి చేయవచ్చు మరియు ఆదరించవచ్చు. రెండు ఆత్మల మధ్య ఈ రకమైన అవగాహన ఉంటె, అభిప్రాయాలలో తేడాలు అంత ఆందోళనకరంగా కనిపించవు. సరళత మరియు నిర్లిప్తతను స్వీకరించడం ద్వారా మరియు మన స్వంత ఆధ్యాత్మిక మార్గాన్ని మెరుగుపరచడం ద్వారా, పూస పూస ద్వారా, కుట్టు కుట్టు ద్వారా, కొత్త మరియు అందమైన సంబంధాలు సహజంగా వాటంతటవే అల్లబడతాయి. మరీ ముఖ్యంగా, సంబంధం అనేది ఎల్లప్పుడూ ఒకరి గురించి ఆలోచించడం కాదు. ప్రేమ, శ్రద్ధ మరియు గౌరవం యొక్క భావాలు స్వయం గురించి కూడా ఉంటాయి. వ్యక్తిగతమైన లేదా వృత్తిపరమైన జీవితంలోని ఏ రంగంలోనైనా సంబంధాలు ఆత్మిక స్మృతిలో మళ్ళినప్పుడు, ఆ సంబంధంలో తిరిగి ఇవ్వడం మరియు తీసుకోవడం కాకుండా, ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఇవ్వడం ఉంటుంది. మంచితనంతో నిండిన స్వచ్ఛమైన ఆత్మలుగా మన వాస్తవికతను అనుభూతి చేయగలిగితే, సానుకూల శక్తి మార్పిడితో సంబంధాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మన జీవితంలోని అంశాలలో ఒకటి మాత్రమే అని, ఆ అంశంతో మనం తక్కువ అనుబంధం కలిగి ఉంటూ, దాని చుట్టూ మన జీవితాలను నిర్మించాల్సిన అవసరం లేదని మనము అర్థం చేసుకుంటాము. మనలోని అంతర్గత సామర్థ్యం, మన ఊహలకు కూడా అందని ఎన్నో విధాలుగా వ్యక్తమవుతుంది.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »