Hin

16th dec 2024 soul sustenance telugu

December 16, 2024

అందమైన సంబంధాలకు కీలకం-బేషరతు ప్రేమ (పార్ట్ 1)

ప్రేమ ఒక అత్యంత విలువైన ధర్మంగా లేదా గుణంగా ఉన్న ప్రపంచంలో మనమందరం నివసిస్తున్నాము మరియు మనమందరం కూడా ప్రేమతో నిండిన ఆత్మలము. మన అంతర్గత ప్రేమ అనే నిధికి ప్రాప్యత కోల్పోయినప్పుడు మాత్రమే మనం ఇతరుల నుండి ప్రేమను ఆశించడం ప్రారంభించి, బయట ఇతరుల నుండి దానిని వెతకడం ప్రారంభిస్తాము. మనం సాధారణంగా వృక్షజాలం, జంతుజాలం అని పిలిచే భౌతిక ప్రపంచం నుండి కూడా ప్రేమను వెతుకుతాము. వృక్షజాలం మన చుట్టూ ఉన్న మొక్కలను సూచిస్తుంది మరియు జంతుజాలం జంతువులను సూచిస్తుంది. మానవులను, ప్రకృతిని ప్రేమించడం మరియు ప్రేమించబడటం తప్పు కాదు. దానిని ప్రేమ కోసం వెతకడం అనరు. సాధారణంగా మానవులకు మరియు జంతువులకు ప్రేమ ఇవ్వడం, వారి నుండి ప్రేమను పొందడం, మొక్కలని, ప్రకృతిని ప్రేమించడం అనేది ఈ ప్రపంచం ఒక అందమైన స్వర్గంగా ఉన్నప్పటి నుండే ఉంది. ఆ స్వర్గం ఆనందం, ప్రేమ మరియు స్వచ్ఛతతో నిండి ఉండేది. ఆ ప్రపంచాన్ని గార్డెన్ ఆఫ్ ఈడెన్ లేదా గార్డెన్ ఆఫ్ అల్లాహ్ లేదా హెవెన్ అని కూడా పిలుస్తారు లేదా సాధారణంగా స్వర్ణయుగం, స్వర్గం అని పిలుస్తారు.

ప్రేమను పొంది, దాని కారణంగా సంతోషపడటం మరియు ఇతరుల నుండి దాని కోసం వెతకడం మధ్య వ్యత్యాసం ఉంది. అలాగే, మనం సంతోషంగా ఉండటానికి ఈ ప్రేమపై ఆధారపడినప్పుడు, మనలో శూన్యత ఉందని అర్థం. మనల్ని నింపడానికి, ప్రసన్నత అనుభూతిని ఇవ్వడానికి బదులుగా మనల్ని ఖాళీగా చేసే ప్రేమ భౌతికమైన దానిపై ఆధారపడిన ప్రేమ. మరోవైపు, ఆత్మిక స్మృతిపై ఆధారపడిన ప్రేమ అనేది అవతలి వ్యక్తి పట్ల అంతగా మొహం ఏర్పడనివ్వదు. అవతలి వ్యక్తి నుండి ప్రేమను పొందనప్పుడు లేదా ఆ వ్యక్తి మనపై ఇక ప్రేమ చూపనప్పుడు మనకు దుఃఖాన్ని కలిగించే ప్రేమ మొహంతో కూడినది.   అవతలి వ్యక్తి మనల్ని విడిచిపెట్టినప్పుడు లేదా మనతో మాట్లాడటం మానేసినప్పుడు లేదా దూరంగా వెళ్ళిపోయినప్పుడు లేదా ఏదో ఒక కారణంతో మనల్ని ప్రేమించనప్పుడు ఇది జరుగుతుంది.   

(సశేషం…)

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »