Hin

18th dec 2024 soul sustenance telugu

December 18, 2024

అందమైన సంబంధాలకు కీలకం – బేషరతు ప్రేమ (పార్ట్ 3)

మీరు సంబంధాలలో ఆనందాన్ని అనుభూతి చేసుకోవాలని అనుకున్నపుడల్లా పెద్ద మనసుతో ప్రేమించడం నేర్చుకోండి. ఇది మనం సాధారణంగా వినే విషయం, కానీ దీని అర్థం ఏమిటంటే అవతలి వ్యక్తి నాతో ఎలా ఉండాలి అనేదానికి ఎటువంటి నిర్ణీత సరిహద్దులు లేకుండా ప్రేమించడం. మరో మాటలో చెప్పాలంటే, అవతలి వ్యక్తి యొక్క స్మృతి, వైఖరి, మాటలు మరియు చర్యలు ఎలా ఉండాలనే దాని గురించి మన మనస్సులో మనము చాలా ఖచ్చితమైన చిత్రాలను సృష్టించడానికి మొగ్గు చూపుతాము. దాని కారణంగా మనం అవతలి వ్యక్తిని తమని తాముగా ఉండనివ్వము. కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తి తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించడం ఆపే స్థాయి వరకు ఇది వెళుతుంది. అలాగే కొన్నిసార్లు వారి వ్యక్తిత్వం మనం సృష్టించిన కవచంలోకి వెళ్ళడం ప్రారంభిస్తుంది మరియు కొన్ని సందర్భాల్లో వారు జీవితాంతం ఆ కవచం నుండి బయటకు రారు. దాని అర్థం ఏమిటంటే, అవతలి వ్యక్తి మన చేతిలో తోలుబొమ్మ అవుతాడు మరియు వారు ఇకపై తాము కాదని ఎప్పుడూ ఆలోచించకుండా మనం డిమాండ్ చేసే ప్రతిదాన్ని అతను లేదా ఆమె చేస్తారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మనము. మన వ్యక్తిత్వం ఆధారంగా మనము ఒక వ్యక్తిని సృష్టిస్తాము. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఇది మనం బాధ్యలుగా అయ్యే  ప్రతికూల కర్మ. దీన్నే షరతులతో కూడిన ప్రేమ అంటారు.

మరోవైపు, బేషరతుగా ఉండే ప్రేమ, మీరు ప్రేమించే అవతలి వ్యక్తి, వారి స్వంత వ్యక్తిత్వంతో, వారి స్వంత ప్రత్యేక బలాలు, నైపుణ్యాలు మరియు లక్షణాలతో, తమంతట తాముగా మరియు వారి నుండి భిన్నమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటుంది. ఈ లక్షణాలు మరియు నైపుణ్యాలు మీ బలాన్ని సంపూర్ణంగా చేసే విధంగా అది చేస్తుంది మరియు మీరిద్దరూ ఒకరినొకరు ముందు ఉంచే అందమైన జోడిగా మారతారు. అలాగే, అదే సమయంలో మీరు మీ స్వంత సుగుణాలపై దృష్టి పెడుతూ వాటిని అమలులోకి తీసుకువస్తారు. ఇదే నిజమైన ప్రేమ. అటువంటి ప్రేమ, అమలులోకి వచ్చినప్పుడు, సంతోషంతో నిండిన సంబంధానికి మంచి పునాది అవుతుంది. అటువంటి సంబంధంలో, ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు వ్యక్తిగతమైన వాటిలో జోక్యం చేసుకోకుండా ఒకరికొకరు ప్రేమపూర్వక తోడుని ఆస్వాదిస్తారు.

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »