Hin

19th dec 2024 soul sustenance telugu

December 19, 2024

అందమైన సంబంధాలకు కీలకం – బేషరతు ప్రేమ (పార్ట్ 4)

భగవంతుడిని సరైన పద్ధతిలో ప్రేమించడం కూడా మన జీవితంలో ఒక ముఖ్యమైన అంశం, దీనిలో భగవంతుడు కూడా మన ఇతర సంబంధాల వలే ఉన్నా కానీ చాలా ముఖ్యమైనవారు. భగవంతునికి బిడ్డలా లేదా స్నేహితుడిలా పాత్రను పోషించడానికి కూడా వారి పట్ల ప్రేమతో కూడిన ఆలోచనలను సృష్టించడానికి కొన్ని విధానాలు అవసరం. ఉదా. ఎల్లప్పుడూ భగవంతుని నుండి మరింత ఎక్కువగా అడగడం మరియు వారికి తగినంతగా తిరిగి ఇవ్వడం గురించి ఆలోచించకపోవడం కూడా భగవంతుని సన్నిహితుడిగా ఉండటానికి తప్పుడు విధానం. అలాగే, భగవంతుడిలా మారడానికి, తనను తాను మార్చుకోవడమే భగవంతునికి నిజమైన ప్రియమైన వ్యక్తిగా ఉండటం. మీరు జీవిత ప్రయాణంలో కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ప్రేమ, ఆనందం, సంతృప్తి వంటి లక్షణాలు, స్వచ్ఛమైన హృదయం, నిజాయితీ, మనల్ని భగవంతుని ఉన్నతమైన పాలన మరియు సహాయాన్ని పొందటానికి అర్హులుగా చేస్తాయి. ఈ సమయాల్లో, మీకు భగవంతుని సహాయం అవసరం, అది లేకుండా మీరు వాటి నుండి బయటపడలేరు.

భగవంతునితో మరొక ముఖ్యమైన సంబంధం గురువు మరియు విద్యార్థిది, దీనిలో ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు అనేక దివ్యమైన సుగుణాలతో నిండి ఉండటానికి భగవంతుడు మనకు సహాయం చేస్తారు. ఈ సంబంధంలో, భగవంతుడు పరమ గురువుగా చేసిన కృషి యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించాలి. మనల్ని పరిపూర్ణ మానవులుగా మార్చడానికి, మన ఆధ్యాత్మిక మేధస్సును ఉన్నత స్థాయికి పెంచడానికి వారు మనపై ఖర్చు చేసే శక్తి, సమయమంతటికీ మనం వారికి ఎలా తిరిగి ఇవ్వాలో కూడా మనం గ్రహించాలి, ఇది స్వచ్ఛంగా మారడానికి మరియు మంచి చర్యలు చేయడానికి అవసరం. భగవంతునితో మనం కొన్నిసార్లు మర్చిపోయే మరొక సంబంధం ఏమిటంటే, భగవంతుడు మనల్ని ఎన్నో విధాలుగా చూసుకునే పిల్లవాడిలా ఉంటారు. వారు మనపై నిరంతర ఆధ్యాత్మిక శక్తి యొక్క పందిరి లా ఉన్నందున మనం వారిపై కురిపించే ప్రేమకు, వారికి ఇచ్చే గౌరవమంతటికీ వారు ఇలా చేస్తారు. వారి కళ్ళు మన వైపు చూడటం, మనం ఎదుర్కొనే అన్ని ఇబ్బందుల నుండి మనల్ని రక్షించడం ఎప్పుడూ ఆపవు. అలాగే, మీరు భగవంతుడిని పరమ గురువుగా గుర్తుంచుకున్నప్పుడల్లా, వారు ఇచ్చే అన్ని సూచనలను పాటిస్తున్నట్లు అర్థం. ఇతరులతో సంబంధంలోకి వచ్చినప్పుడు భగవంతుని వలె స్వచ్ఛమైన స్థితిని కలిగి ఉండటం అని  కూడా దీని అర్థం. ఇది మిమ్మల్ని వారి నిరంతర ఆశీర్వాదాలకు అర్హులుగా చేస్తుంది. ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని తేలికగా మరియు సంతోషంగా ఉంచుతాయి.

(సశేషం…)

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »