Hin

20th dec 2024 soul sustenance telugu

December 20, 2024

అందమైన సంబంధాలకు కీలకం – బేషరతు ప్రేమ (పార్ట్ 5)

ఏ సంబంధంలోనైనా విజయవంతం కావడానికి త్యాగం అనేది మనకు ఉండాల్సిన ఒక ముఖ్యమైన లక్షణం లేదా గుణము. ఒక సంబంధంలో మరొకరి అవసరాలను పట్టించుకోకుండా తనను తాను మాత్రమే ముందు ఉంచుకునే వ్యక్తి గౌరవం కోల్పోయే వ్యక్తి అని గుర్తుంచుకోండి. అలాగే వారు బుద్ధితో సంబంధాన్ని నడిపించగల వ్యక్తి కావొచ్చు కానీ హృదయం విషయానికి వస్తే వారు ఒక ఓడిపోయిన వ్యక్తి. ఏ ఇద్దరు వ్యక్తుల సంబంధం అయినా, ఏ రకమైన సంబంధం అయినా, అవతలి వ్యక్తి అవసరాలకు అనుగుణంగా అహంభావాన్ని వదులుకునే వ్యక్తి, ప్రేమపూర్వకమైన సంబంధంలో నిజమైన విజేత. కొందరు చాలా కష్టమైన సంబంధంగా భావించే జీవిత భాగస్వాముల మధ్య సంబంధాల గురించి మాత్రమే మనము మాట్లాడటం లేదు. కాబట్టి, ఎక్కడైనా సరె, ప్రతి వ్యవహారంలో “నేను” అని అనే వ్యక్తి హృదయ స్థాయిలో ఓడిపోతాడు. అంటే వారు అవతలి వ్యక్తి కంటే తెలివిగా, మరింత నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, అవతలి వ్యక్తి కూడా దానిని అంగీకరించినప్పటికీ, వారు ఆ వ్యక్తి యొక్క ఆశీర్వాదాలను కోల్పోతారు. కాబట్టి అహంభావ పాత్ర పోషించేవారు బాహ్యంగా గౌరవాన్ని పొందుతారు, కానీ అంతర్గతంగా ప్రేమ మరియు గౌరవం కోల్పోతారు.

భయపడటం అంటే గౌరవించడం కాదని మీరు కొంతకాలం క్రితం వినే ఉంటారు, ఇది అహంభావంగల వ్యక్తులకు జరుగుతుంది. అహంభావ వ్యక్తులు కొన్నిసార్లు భయం వల్ల గౌరవించబడతారు, ఎందుకంటే వారు అనేక విధాలుగా మరింత నైపుణ్యం కలిగి ఉంటారు, ప్రపంచంలో అనేక పనులు చేయడంలో, పనులు వారి ప్రకారంగా జరిగేలా చేసుకోవడంలో కూడా నైపుణ్యం గలవారు. కానీ వినయం మరియు వ్యక్తుల హృదయాలను గెలుచుకునే విధి వారికి లేదు. గుర్తుంచుకోండి, ప్రపంచంలో మరింత విజయవంతమైన వ్యక్తులు ఉన్నారు, ఎందుకంటే వారు దయగలవారు, మధుర స్వభావం గలవారు. వారు ప్రపంచ తీరుల్లో అత్యుత్తమంగా, నైపుణ్యంగా మరియు భౌతిక స్థాయిలో విజయాన్ని సాధించడంలో ఉత్తమంగా ఉండకపోవచ్చు. వినయపూర్వకమైన వ్యక్తులు అందరి హృదయాలకు నిజమైన నాయకులు. వారికి ఈ గుణం ఉన్న కారణంగా విజయం సాధించడానికి భగవంతుడు వారికి సహాయం చేస్తారు.

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »