Hin

21th dec 2024 soul sustenance telugu

December 21, 2024

అందమైన సంబంధాలకు కీలకం – బేషరతు ప్రేమ (పార్ట్ 6)

మీ సంబంధాలను సరైన పద్ధతిలో ఎలా జీవించాలనే దానిపై ఈ సందేశంలో ఇది చివరి భాగం. ఈ చివరి భాగంలో, మంచి సంబంధ నిర్వాహకుడిగా మారే పద్ధతిని వివరిస్తున్నాము. మరో మాటలో చెప్పాలంటే, మన సంబంధాలన్నింటిలో అవతలి వ్యక్తి ఎల్లప్పుడూ వారి హృదయంలో మన పట్ల ప్రేమ, ఆశీర్వాదాలతో నిండి ఉండే విధంగా మన సంబంధాలను ఎలా నిర్వహిస్తాము? అలాగే మనల్ని ఆధ్యాత్మిక స్థాయిలో నింపే విధంగా మన వద్దకు చేరుకునే ఆశీర్వాదాల రూపంలో ఆ ప్రేమను వారి నుండి అనుభవం చేసుకుంటూనే ఉంటాము.  

ఆత్మిక స్మృతి అనేది సంబంధాలను ఆధ్యాత్మికంగా జీవించే ఒక మార్గం. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఒక ఆత్మ అని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది, దాని అసలైన సుగుణాలు శాంతి, ప్రేమ మరియు ఆనందం. అలాగే, పైన ఉన్న పరంధామం నుండి భౌతిక ప్రపంచంలో తమ పాత్రలను పోషించడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మొదట ఈ సుగుణాలతో నిండి ఉంటారు. మన యొక్క ఈ ప్రారంభ దశను ఆత్మిక స్మృతి దశ అని పిలుస్తారు, దీనిలో ఆత్మ యొక్క సుగుణాలు సుగంధం గల పుష్పం లాగా ఉంటాయి. అలాగే, ప్రతి ఒక్కరూ ఈ సుగుణాలను మన నుండి, అన్ని సంబంధాలలో అనుభూతి చేసుకుంటారు. మనము వివిధ రూపాల ప్రతికూలత ప్రభావంలోకి రావడం ప్రారంభించినప్పుడు ఆత్మ దాని సుగుణాలను, సువాసనను కోల్పోవడం ప్రారంభించింది తద్వారా ఈ లక్షణాల అవసరం కోసం అది బయటికి చూడటం ప్రారంభించింది. సంబంధాలలో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, మనము మన ప్రేమ, ఆనందం కోసం ఇతరులపై ఆధారపడటం ప్రారంభించాము. ఇది కస్తూరి జింక యొక్క ప్రసిద్ధ కథ లాంటిది, అది వెతుకుతున్న సువాసన దాని సొంత నాభి నుండి వచ్చిందని గ్రహించలేదు. కస్తూరి జింక మాదిరిగానే, మన అంతరాత్మతో సంబంధాన్ని మరియు ఆత్మిక స్మృతితో శాంతి, ప్రేమ, ఆనందాలను పొందే పద్ధతిని కోల్పోయాము. మనము మన తల్లి, తండ్రి, బిడ్డ, సోదరుడు లేదా సోదరి, జీవిత భాగస్వామి, స్నేహితుడు మొదలైన వారి నుండి వాటి కోసం వెతకడం ప్రారంభించాము. సమతుల్యతను పునరుద్ధరించడానికి సరైన మార్గం ఆధ్యాత్మికత యొక్క త్రిభుజాన్ని పూర్తి చేయడం, భగవంతుడిని నాకు శాంతి, ప్రేమ, ఆనందాన్ని ఇచ్చే వ్యక్తిగా చేర్చడం. నేను కూడా ఆత్మిక స్మృతితో ఉండి, ఈ సుగుణాలను నా లోపల కనుగొని వాటిని పెంచుకుంటాను. అప్పుడు నేను ఇతరులు నాకు శాంతి, ప్రేమ మరియు ఆనందం యొక్క సుగుణాలను ఇస్తారని ఆశించే బదులుగా ఈ సుగుణాలన్నింటినీ వారితో పంచుకుంటాను.

రికార్డు

9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »
8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »
7th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై

Read More »