Hin

6th dec 2024 soul sustenance telugu

December 6, 2024

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన సర్వోన్నతమైన తండ్రి, సర్వోన్నతమైన మార్గదర్శి. వారు మనందరికంటే ఉన్నతమైన వారు మరియు మనందరినీ చూసుకుంటారు. వారు మనల్ని పై నుండి చూస్తూ ప్రపంచం వివిధ మార్గాల్లో అభివృద్ధి చెందడాన్ని, దాదాపు ప్రతి మానవుడికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటాన్ని చూస్తున్నారు. అలాగే, గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం చాలా బాగా కనెక్ట్ అయ్యి ఉంటూ వేగంగా ముందుకు సాగుతోంది. కానీ నేడు, పెరుగుతున్న సంఘర్షణలు, ఆరోగ్య సమస్యలు, సంబంధ సమస్యలు మరియు జీవితంలోని అన్ని రంగాలలో పెరుగుతున్న ఒత్తిడి ఉన్న ప్రపంచంలో, అందరూ అలసిపోవడం ప్రారంభించారు.  మంచితనం గురించి తెలిసి దాని గురించి మనం మాట్లాడుతున్నప్పటికీ, మంచి కర్మలు ఎలా చేయాలో నేర్పించి అందరి జీవితాలలో లోపించే శాంతి, ప్రేమ, సంతోషాలను తీసుకురాగలిగే వారు ఎవరైనా కావాలని కూడా కొంతమందికి అనిపించడం మొదలయింది. జ్ఞానసాగరుడైన భగవంతుడు మాత్రమే ఈ పాత్రను పోషించగలరు.

భగవంతుడు వసుధైక కుటుంబానికి ఆధ్యాత్మిక తండ్రి. మనం ఆంతరిక ఆధ్యాత్మిక స్వయాన్ని తెలుసుకొని, భగవంతుడిని అర్థం చేసుకుని, వారితో కనెక్ట్ అయ్యి ప్రపంచంలో ఆధ్యాత్మిక సోదరభావాన్ని సృష్టించినప్పుడు మాత్రమే ప్రపంచం జీవించడానికి సరైన ప్రదేశంగా మారుతుందని వారికి తెలుసు. అటువంటి ప్రపంచంలో, ప్రతి మానవుడు జ్ఞానం, సుగుణాలు మరియు శక్తులతో నిండి ఉంటారు. దాని కారణంగా ప్రతి ఒక్కరూ కామం, కోపం, దురాశ, మొహం, అహం, అసూయ, ద్వేషం ఇంకా అనేక ఇతర రకాల అపవిత్రత, ప్రతికూలత వంటి వివిధ చెడుల నుండి విముక్తి పొందుతారు. ఇది ప్రపంచంలోని ప్రతి మానవుడికి భగవంతుడు ఇవ్వాలనుకుంటున్న స్వేచ్ఛ. ప్రతి మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశంగా మార్చుకుని, ఆ జ్ఞానం ఆధారంగా, భగవంతుని స్మృతితో ప్రతి చర్యను చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మనమందరం చేతులు కలిపి, సన్నిహితమైన వసుధైక కుటుంబంగా ఈ అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యం వైపు అడుగులు వేద్దాం. ఇది మన జీవితాలను మంచిగా మార్చుకోవటానికి సహాయపడుతుంది. అలాగే ప్రపంచాన్ని కూడా అందంగా, పూర్తిగా స్వేచ్ఛగా తయారుచేస్తుంది – అదే భగవంతుడు సృష్టించిన పరిపూర్ణమైన, స్వచ్ఛమైన, ఆనందకరమైన స్వర్గం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »