Hin

24th august 2024 soul sustenance telugu

August 24, 2024

అంగీకారం బలం, బలహీనత కాదు

మనం ఒక కష్టమైన జీవిత పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, అందరూ దానిని ఉన్నది ఉన్నట్టుగానే అంగీకరించమని సలహా ఇస్తారు. అంగీకారం అనేది బలహీనత, అణచివేయటం లేదా ఒక రకంగా వదులుకోవటం అని మనం భావిస్తున్నాము. ఏ పరిస్థితిలోనైనా, మనకు రెండు ఎంపికలు ఉన్నాయి: దానిని అంగీకరించటం లేదా ప్రతిఘటించటం. ప్రతిఘటన అంటే మన మనస్సు జీవిత దృశ్యాలను ప్రశ్నిస్తుంది. అంగీకారం అంటే ఈ క్షణం ఎలా ఉందో అలాగే ఉంటుంది, మనం దానితో ముందుకు సాగుతూ తదుపరి సన్నివేశంపై పని చేయడం ప్రారంభిస్తాము.

  1. మీరు మీ సొంత ఆంతరిక స్థితికి సృష్టికర్త. ప్రతి ఉదయం ధ్యానం చేసి, మీ మనస్సును జ్ఞానంతో నింపుకోండి. ఇది మీరు రోజంతా ప్రశాంతంగా మరియు తేలికగా ఉండటానికి సహాయపడుతుంది, ఇది అంగీకరించడాన్ని సులభతరం చేస్తుంది.
  2. మిమ్మల్ని మీరు అంగీకరించుకోవడంతో ప్రారంభించండి-మీరు ఎవరో మరియు జీవితంలో మీకు ఏమి ఉన్నాయనే దాని గురించి ఎటువంటి తీర్పులు, అపరాధ భావన, విమర్శలు ఉండకూడదు. మీ ప్రస్తుత స్వభావంతో హాయిగా ఉంటూ పరివర్తనకు సిద్ధంగా ఉండండి.
  3. అందరినీ వారు ఎలా ఉన్నారో అలాగే అంగీకరించడానికి మొదటి అడుగుగా, మీకు మీరే గుర్తు చేసుకోండి – నేను మరొక స్వచ్ఛమైన వ్యక్తితో సంభాషించే స్వచ్ఛమైన వ్యక్తిని. కాబట్టి, లింగం, సంబంధం, స్థానం, వయస్సు మరియు విజయం యొక్క అహం అంతం అవుతుంది. రెండవ దశ ఏమిటంటే, ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటాడని, వారు వారి విధంగా ఉంటారని మరియు ఒక నిర్దిష్ట స్థాయికి మించి నేను వారిని మార్చలేను అని తెలుసుకోవడం. నేను వారిని సానుకూలంగా ప్రభావితం మాత్రమే చేయగలను.
  4. పరిస్థితులను అంగీకరించడం అంటే, మనసుకు ఇలా అనడం నేర్పండి- ఇది ఎందుకు? అని ప్రశ్నించే బదులు, ఇది ఇంతే, ఇక తరువాత ఏమిటి అని అనేలా నేర్పండి. లేకపోతే, మీరు ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా అని ఆలోచిస్తే, అప్పుడు మనస్సు వ్యర్థ ఆలోచనలను సృష్టిస్తూనే ఉంటుంది. ఫుల్ స్టాపులు పెట్టడం వల్ల పరిస్థితిని ఎదుర్కోనెందుకు మీ శక్తి ఆదా అవుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »