Hin

16th May 2024 Soul Sustenance Telugu

May 16, 2024

అంగీకారం మరియు అవగాహనతో సహించండి

సహన శక్తి అంటే పరిస్థితులు, వ్యక్తులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు ఆంతరికంగా ప్రభావితం కాకుండా ఉండగల సామర్ధ్యం. ఈ శక్తి దాపరికం లేకుండా ఉండటం, అంగీకరించడం మరియు అంతరికంగా ఏదైనా వివాదాన్ని సరైన అవగాహనతో పరిష్కరించడంతో కూడినది. జీవితంలోని సన్నివేశాలు అనుకూలంగా లేనప్పుడు మనం ప్రతిస్పందించే సాధారణ విధాలను మించి ఎదగడం. ప్రతి ఆత్మ మనకు భిన్నమైనదని తెలుసుకోవడంతో సహనం వస్తుంది. వారి ఆలోచనలు, భావాలు, దృష్టికోణాలు మనకు భిన్నంగా ఉంటాయి. వారి సంస్కారాలు మరియు కర్మల ఖాతాలు వివిధ వాతావరణాలలో వివిధ పరిస్థితులను ఎదుర్కొంటున్న  వివిధ జన్మల ప్రయాణంలో సృష్టించబడ్డాయి. కాబట్టి, మనం ఇతరుల ప్రవర్తనను లేదా సంస్కారాలను ప్రశ్నించలేము. ఈ అవగాహన వ్యక్తులను వారు ఎలా ఉన్నారో అలానే అంగీకరించడంలో మనకు సహాయపడుతుంది. మనం వివిధ సంస్కారాలను సులభంగా తట్టుకునే స్థితికి చేరుకుంటాము. సహించాలనే ఫీలింగ్ లేని దశకు చేరుకుంటాం.

సహన శక్తి అంటే అందరిలో విభిన్న సంస్కారాలు ఉండటం సహజం అనే అవగాహనతో జీవిస్తాము మరియు పని చేస్తాము. వారు ఎందుకు ఇలా ఉన్నారు, వారు ఇలా ఎలా ఉంటారు అని మనం మన శక్తిని వృధా చేసుకోము లేదా ఆందోళన చెందము. మనం వారిని నియంత్రించడానికి లేదా మార్చుకొమ్మని బలవంతం చేయడానికి ప్రయత్నించము. మనం వారికి స్పూర్తిని అందిస్తాము, శక్తిని అందిస్తాము. అప్పుడు వారు తమ గురించి అసౌకర్యంగా భావించే వాటిని మార్చుకోవడానికి ఎంచుకుంటారు. ఇప్పటివరకు మనం సహించలేని వ్యక్తుల సాధారణ అలవాట్ల జాబితాను తయారు చేద్దాం. ఇది మన మనస్సు యొక్క ప్రోగ్రామింగ్ మాత్రమే, ఎందుకంటే మనం ఏదో లేదా ఎవరినైనా సహించలేము అని ఎల్లప్పుడూ మనకు మనమే చెప్పుకున్నాము. ఈ రోజు మనం ఒక ఆలోచనను చేద్దాం – నేను వారి ఈ సంస్కారాన్ని అంగీకరిస్తున్నాను మరియు ఇక నుండి వారి సంస్కారం నా మనస్సులో ఎటువంటి భంగం కలిగించదు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

14th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఉదయం మనం రోజును ప్రారంభించినప్పుడు, వివిధ చర్యలను చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా లేదా మన ఆఫీసులో ఉన్నా

Read More »
13th May 2025 Soul Sustenance Telugu

తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మనది వినాలని లేదా మనమంటే ఆసక్తికరంగా అనిపించాలని అందరితో మాట్లాడుతూ ఉండాలి అని భావిస్తాము. ఈ ఆత్రుత

Read More »
12th May 2025 Soul Sustenance Telugu

సంఘర్షణల సమయంలో వ్యక్తులతో మాట్లాడండి … వారి గురించి మాట్లాడకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధంలో విభేదాలు ఏర్పడినప్పుడు, మనలోని నెగటివ్ భావోద్వేగాలు తరచుగా అవతలి వ్యక్తితో మన సంభాషణలో అవరోధంగా మారతాయి. అవతలి వ్యక్తి గురించి

Read More »