Hin

7th feb 2025 soul sustenance telugu

February 7, 2025

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా చార్జ్ చేసుకోవాలని అనుకున్నప్పుడల్లా ఇంట్లో కూర్చోవడానికి అలాంటి పవిత్రమైన స్థలాన్ని ఏర్పర్చుకోవచ్చు.

 

  1. ఉన్నతమైన వైబ్రేషన్ల స్థలాన్ని ఏర్పర్చుకోవడానికి ఇంట్లో ప్రత్యేకమైన స్థలాన్ని గుర్తించండి. బలహీనమైన శక్తిని నివారించడానికి టెలివిజన్ లేదా పడకగదికి దూరంగా నిశ్శబ్దమైన స్థలాన్ని ఎంచుకోండి. ఇంటి పరిమాణం పట్టింపు కాదు, గది లోపల శుభ్రమైన తెల్లటి కర్టెన్లతో చుట్టబడిన ఒక చిన్న మూల కూడా సరిపోతుంది.

 

  1. ఆ ప్రదేశంలోకి ప్రవేశించే ముందు పరధ్యానాల నుండి వైదొలిగి, ఉద్దేశపూర్వకంగా స్వీయ-పరిశీలన మరియు ధ్యానంపై దృష్టి పెట్టండి. ఇతర ఆలోచనలను సృష్టించవద్దు. మీ స్వచ్ఛమైన ఆలోచనలు ఆ ప్రదేశానికి ప్రసరిస్తాయి మరియు దాని సానుకూల శక్తిని పెంచుతాయి.

 

  1. రోజుకు కనీసం రెండుసార్లు అక్కడ కొన్ని నిమిషాలు గడపండి. ప్రతి రోజు, అక్కడి శక్తి క్షేత్రం అక్కడ మీ కూర్చున్న అనుభవాన్ని బలపరుస్తూ మెరుగుపరుస్తుంది. ఆ స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచండి. కొంత కాలానికి మీరు అక్కడ సృష్టించే శక్తి అంతా  అవసరమైనప్పుడు మీకు సహాయపడుతుంది.

 

  1. మీకు లేదా మీ కుటుంబ సభ్యునికి సమాధానం కావాలనప్పుడు, స్పష్టత అవసరమైనప్పుడు, నిర్ణయం తీసుకోవలసిన అవసరం వచ్చినప్పుడు, ఏదైనా తప్పుడు ఆలోచనలను తొలగించాల్సిన అవసరం వచ్చినప్పుడు లేదా మనస్సును నిశ్శబ్దం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, కాసేపు అక్కడే కూర్చోండి. మీరు గది యొక్క తరంగాలను అనుభవం చేసుకున్నప్పుడు, మీ మనస్సు ప్రశాంతమవుతుంది. మీ అంతర్గత చైతన్యం మరియు పరమాత్మతో మీ దైవిక సంబంధం మీకు అన్ని సమాధానాలను ఇస్తుంది.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »