Hin

16th jan 2024 soul sustenance telugu

January 16, 2024

అపరాధ భావం నుండి విముక్తి

తరచూ, ఇతరులు చేసిన పొరపాటుకు మనం వారిని సులభంగానే క్షమించేస్తుంటాము. కానీ అదే తప్పు మనం చేస్తే మనం అపరాధ భావంలో ఉంటూ మనతో మనం పరుషంగా ప్రవర్తిస్తుంటాము. అపరాధ భావము నిరంతరం గాయం చేసేదిగా మిగిలిపోతుంది. మనల్ని మనం పదేపదే నిందించుకుంటూ ఉంటే అది మన శక్తిని హరిస్తుంది. చింతనకు, సరిదిద్దుకోవడానికి, ముందుకు సాగడానికి శక్తి మిగలదు.

ఈ క్షణం, స్వయాన్ని అంగీకరిస్తూ మార్పు దిశగా ముందుకు సాగడానికి అపరాధ భావాన్ని అధిగమించండి.

ధృవీకరణ:

నేను ప్రేమ స్వరూపాన్ని… నాతో నేను మంచిగా ఉన్నాను… నేను ఎల్లప్పుడూ నా మనసుకు మరియు శరీరానికి సంతోషాన్ని పంచుతాను… నేను తప్పు చేసినాగానీ లేక అనారోగ్యకర అలవాటు ఉన్నాగానీ, నేను అంగీకరిస్తాను… నేను ఆ అలవాటుతో ఉన్నాను అని నా గురించి అర్థం చేసుకుంటాను… జరిగిన పొరపాటును నేను అర్థం చేసుకుంటాను… ఇది కర్మల లెక్క… ఇదిలా జరగాలని ఉంది… అంగీకరిస్తాను… ఎవరెవరికి దీనివలన ఇబ్బంది కలిగిందో వారికి క్షమాపణ చెప్తాను… ఇకమీదట నేనేమి చేయాలో దానిపై శ్రద్ధ పెడ్తాను… నేను అపరాధ భావంలో కూరుకుపోను… ఆ క్షణంలో నాకు మంచిగా అనిపించిందే చేసాను… నా అలవాట్లు, అనుభవాలు మరియు పరిస్థితి ప్రకారంగానే నేను పని చేసాను…  నన్ను నేను ప్రేమించుకోవడాన్ని కొనసాగిస్తాను… నన్ను నేను సమ్మతించుకుంటున్నాను… స్వయాన్ని సరిదిద్దుకునే శక్తి నాలో ఉందని నేను నమ్ముతున్నాను… నా తప్పును నేను గుర్తించి మార్పు దిశగా అడుగులు వేస్తాను…గతం గతః… అది అయిపోయింది… నన్ను నేను నిందించుకుంటూ సమయాన్ని వృధా చేయను… నేను ఎప్పుడూ నాతో పరుషంగా ఉండను, నెగెటివ్‌గా ప్రవర్తించను… నేను జాగ్రత్తగా, జాగరూకతగా ఉంటాను… ఇప్పుడు ఏమి చేయాలో దానిపై నా సమయాన్ని, శక్తిని ఉపయోగిస్తాను… నా శక్తిని కాపాడుకుని నా మార్పుకు నన్ను నేను శక్తివంతం చేసుకుంటాను… స్వయాన్ని లేక పరిస్థితిని చక్కబెట్టడానికి నేను మార్గాలను ఆలోచిస్తాను… నేను సవరణ తెస్తాను… మరోసారి ఇది రిపీట్ అవ్వకూడదన్న దృఢ సంకల్పం నాలో ఉంది… నేను సానుకూల మార్గంలో ముందుకు సాగుతాను…

 

సిగ్గు మరియు అపరాధ భావాలలో చిక్కుకుపోకుండా ఈ దృవీకరణను కొన్ని సార్లు రిపీట్ చేయండి. స్వయాన్ని లేదా పరిస్థితిని చక్కబెట్టడానికి తప్పులను అవకాశంగా ఉపయోగించడం ప్రారంభించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »