Hin

31st jan 2024 soul sustenance telugu

January 31, 2024

అసహనాన్ని ఎదుర్కోవటం

ఇల్లు, కార్యాలయం, పిల్లల చదువు, షాపింగ్, స్నేహాలు మరియు ఇతర పనుల నిర్వహణ మధ్య మీ షెడ్యూల్ ప్రకారం సమయం గడవాలని కోరుకుంటున్నారా? మీరు దేని కోసమైనా వేచి ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? తక్షణ తృప్తిని ఆశించే ప్రపంచంలో జీవిస్తున్న మన సహనం నశిస్తున్నట్లు కనిపిస్తోంది. అసహనం అంటే కేవలం సమయం లేకపోవడమే కాదు  మనలో స్వీయ నియంత్రణ లేకపోవడం కూడా. అసహనం అంటే మనకు కావలసినది ఖచ్చితంగా కావాలి, అదీ వెంటనే కావాలి. ఒక ఆలోచన తరువాత మరొక ఆలోచన, ఒక పని నుండి మరొక పనికి అటూ ఇటూ పరుగెత్తడం – మనం ఒత్తిడి, దురుసుతనం మరియు బాధలనే పెంచుతున్నాము. నా లక్ష్యం వైపు పరుగెత్తడం కంటే సహనంగా ఉండటం విలువైనది. ప్రతిదీ సరిగ్గా ఉందని విశ్వసిస్తూ, అది ఉద్దేశించినప్పుడు ఖచ్చితంగా జరుగుతుందని వేచి ఉండటం నేర్చుకుందాం. స్వయంతో, వ్యక్తులు మరియు పరిస్థితులతో సహనం శాంతి, ప్రేమ, అంగీకారాన్ని తెస్తుంది. సన్నివేశాల్లో మనం అసహనాన్ని సృష్టించకుండా ఉంటే, జీవితంలోని సవాళ్లలో నిర్వహించగల శక్తిని కూడా సహనం ఇస్తుంది. సహనం మనల్ని నమ్మకస్థులుగా మరియు ఇష్టపడేలా చేస్తుంది. హఠాత్తుగా ప్రతిస్పందించకుండా వేచి ఉండటం కూడా రాయల్టీ మరియు గౌరవానికి సంకేతం. ఈరోజు ప్రతి సన్నివేశంలోనూ నేను ఓపికగా ఉంటాను. నేను నన్ను లేదా ఇతరులను తొందరపెట్టను. నేను ఆలస్యాలను తేలికగా నిర్వహిస్తాను అని మీకు మీరే గుర్తు చేసుకోండి, .

 

మీరు పెంపొందించుకునే చాలా విలువైన సుగుణాలలో సహనం ఒకటిగా ఉందా? ప్రతిరోజూ వ్యక్తులు మరియు పరిస్థితులతో ఓపికగా ఉండటం, ప్రత్యేకించి వారు మీకు అనుగుణంగా లేనప్పుడు మీకు ఎంత సులువుగా అనిపిస్తుంది? మనమందరం రకరకాలుగా సహనాన్ని ప్రదర్శిస్తాము, కానీ దానిని ఆచరించాలంటే, దాని దారిలో వచ్చే అడ్డంకులను మనం సమాప్తం చేయాలి – ఎక్కువగా చికాకు, కోపం, ఆందోళన, భయం, సందేహం లేదా విమర్శించడం. పోల్చటం మరియు పోటీ కూడా సహనాన్ని నశింపజేస్తుంది. మనం మామూలుగా అంటూ ఉంటాము – నేను బిజీగా ఉన్నాను, మీరు చెప్పేది వినడానికి నాకు ఓపిక లేదు…ఈ ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు నేను వేచి ఉండలేను… నేను ఆ సంగీతాన్ని తట్టుకోలేను… మనకి వినాలని లేకపోతే, వేచి ఉండాలి లేదా అంటిపెట్టుకొని ఉండాలి. కానీ సహన శక్తిని, ఇముడ్చుకునే లేదా అంగీకరించే శక్తిని విడిచిపెడ్తాము. మనస్సు చేతకాని వాటిని నియంత్రించడానికి ప్రయత్నించి చంచలంగా మారుతుంది. శరీరం మనస్సు నుండి అశాంతిని పొంది ఆరోగ్యం దెబ్బతింటుంది. సంబంధాలు పెళుసుగా మారతాయి. అందరూ తమ వంతు కృషి చేస్తున్నారు మరియు పరిస్థితులు ఉద్దేశించిన విధంగా ఉన్నాయి. ఈ అవగాహన ప్రేమ, దయ మరియు గౌరవాన్ని సృష్టిస్తుంది. ఈ రోజు నుండి, ఏది ఏమైనప్పటికీ ప్రతి సన్నివేశంలో ఓపికగా ఉండటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

4th october 2024 soul sustenance telugu

సంబంధాలలో వ్యంగ్యానికి దూరంగా ఉండటం

భావోద్వేగపరంగా(ఎమోషనల్ గా) గాయపడినప్పుడు, స్వయాన్ని మెరుగ్గా చూపించడానికి ఇతరులను నిందిస్తాము. ప్రశంసలు, విమర్శలు లేదా కోపంలో ఉపయోగించినా, వ్యంగ్యం అనేది ప్రతికూల శక్తి. హాస్యభరితంగా, చమత్కారంగా అనిపించాలనే సాకుతో, మీరు వ్యంగ్యంగా ఉన్నారా? వ్యంగ్యం 

Read More »
3rd october 2024 soul sustenance telugu

ఈ నవరాత్రులలో మీ ఆంతరిక శక్తులను అనుభవం చేసుకోండి

నవరాత్రి (అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 11 వరకు) ఆచారాలు మన దివ్యత్వాన్ని ఎలా నిలుపుకుంటామనే దానిపై చాలా చెబుతాయి. నవరాత్రి యొక్క ఆధ్యాత్మిక అర్ధాన్ని తెలుసుకొని మన ఆంతరిక శక్తులను అనుభవం చేసుకుందాము.

Read More »
2nd october 2024 soul sustenance telugu

సంతోషం కొరకు ప్రయాణమా లేక సంతోషకరమైన ప్రయాణమా (పార్ట్ 3)

జీవితం అందమైన సంబంధాల సంపదతో నిండినప్పుడు అన్ని స్థాయిలలో సంతోషాన్ని పొందవచ్చు. మీకు అత్యంత సన్నిహిత వ్యక్తి మీరే. మీ సంతోషానికి మూలం స్వయం యొక్క ఆధ్యాత్మిక గుర్తింపు యొక్క  స్పష్టమైన అవగాహన, మీ

Read More »