Hin

10th june2024 soul sustenance telugu

June 10, 2024

అవసరమైనప్పుడు మాత్రమే ఇతర వ్యక్తుల గురించి ఆలోచించండి

మనం ఎవరి గురించి తరచుగా ఆలోచిస్తున్నామో, మానసికంగా వారితో కనెక్ట్ అవుతాము అనేది సైన్స్ యొక్క నియమం. బాధపడే వ్యక్తిని తలచుకుంటే మనకు బాధ కలుగుతుంది. భగవంతుడిని నిరంతరం స్మరించుకోవాలని ఆధ్యాత్మిక జ్ఞానం చెబుతుంది. మనం ఎవరినైనా గుర్తు చేసుకున్నప్పుడు, వారి మానసిక స్థితికి మనం కనెక్ట్ అవుతాము. వారు అనుభూతి చెందుతున్న అదే భావోద్వేగాన్ని మనం అనుభవించడం ప్రారంభిస్తాము – ఒత్తిడి, భయం లేదా కోపం కావచ్చు.

  1. మీ మనసులోకి ఎవరైనా గుర్తుకు వస్తూ-పోతూ ఉన్నారేమోనని చెక్ చేసుకోండి.  అది మీరు మానసికంగా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు లేదా మీరు ఇష్టపడని వ్యక్తి కావచ్చు. దీని అర్థం మీ ఆలోచనలు వారిని చేరుకుంటాయి, వారి మనస్సులో ఒక ఆలోచనను ప్రేరేపిస్తాయి మరియు వారి ఆలోచనలు మిమ్మల్ని తిరిగి చేరుకుంటాయి. అంటే మీరు ఆలోచనలతో కనెక్ట్ అయ్యారు.
  2. దేనికో తెలియకుండానే మీకు అకస్మాత్తుగా అసౌకర్యంగా అనిపించిన సందర్భాలను గుర్తు చేసుకోండి. ఆ క్షణంలో ఆందోళనతో లేదా దుఃఖంగా ఉన్న వ్యక్తిని మీరు గుర్తుచేసుకుని ఉండవచ్చు.
  3. వ్యక్తులను విమర్శించడం, ద్వేషించడం లేదా భయపడడం మీ శక్తిని తగ్గిస్తుంది. మీ ఆఫీసు సహోద్యోగి పనితీరు బాగా లేదని అనుకుందాం. గౌరవంగా వారికి మెరుగుదలలను సూచించండి. ఆ తర్వాత మీరు వారి గురించి ఆలోచించినప్పుడు లేదా వారిని కలిసినప్పుడు ప్రతికూలంగా ఆలోచించవద్దు.
  4. ధ్యానం సమయంలో మాత్రమే కాకుండా రోజంతా, మీరు అన్ని రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ, వారి ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వడానికి భగవంతుడిని స్మరించుకోండి. వారు శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి సాగరులు. కాబట్టి మీరు వారి వైబ్రేషన్ల ద్వారా ప్రభావితమవుతారు మరియు అదే అనుభూతి చెందుతారు

 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 2)

సానుకూల శక్తిని ఎప్పటికీ కోల్పోవద్దు వ్యక్తులు మన జీవితాల్లోకి వేర్వేరు, కొన్నిసార్లు వ్యతిరేక సంస్కారాలతో కూడా వస్తారు. తరచుగా, మన ప్రియమైనవారిలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు – భర్త లేదా భార్య, తల్లిదండ్రులు, పిల్లలు

Read More »
8th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం   మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు.

Read More »
7th feb 2025 soul sustenance telugu

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా

Read More »