Hin

20th may 2024 soul sustenance telugu

May 20, 2024

బహిరంగ ప్రసంగ(పబ్లిక్ స్పీకింగ్)భయాన్ని అధిగమించడం

మనలో చాలా మందికి బహిరంగంగా మాట్లాడాలని ఆలోచించటానికే  భయపడతాము, సిగ్గుపడతాము, చెమటలు పడుతూ ఉంటాయి . ప్రపంచంలోని అత్యంత భయంతో కూడిన పనులలో ఒకటిగా, బహిరంగంగా మాట్లాడటం అనేది ఉందని మీకు తెలుసా? మనలో కొందరు అది నా బలము కాదు అని, నన్ను జడ్జ్ చేస్తారేమో అని కొందరు భయపడతారు. పబ్లిక్ స్పీకింగ్ అనేది మనం తెలియజేయాలనుకునేది సమర్థవంతంగా తెలియపరచటానికి అవసరమైన నైపుణ్యం.

  1. మీ ఆలోచనలు, భావాలు, వ్యక్తిత్వం, విలువలు – అవన్నీ వైబ్రేషన్లు అని పిలువబడే మీ శక్తి. మీ మాటల కంటే ముందే ఈ వైబ్రేషన్లు వ్యక్తులకు చేరతాయి. ఇతరులతో మీ కమ్యూనికేషన్ లో అవి ముందుంటాయి. కాబట్టి వాటిని స్వచ్ఛంగా ఉంచండి.
  2. ప్రతిరోజూ ఉదయం ధ్యానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క రోజువారీ అధ్యయనం మీ ఆలోచనలను శుభ్రంగా మరియు తక్కువగా ఉంచుతుంది. మీరు సరిగ్గా, సానుకూలంగా ఆలోచించడం ప్రారంభించినప్పుడు, మీ మాటలతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం లేదు. మీరు అనుకున్నది మాట్లాడతారు, నమ్ముతారు మరియు జీవిస్తారు.
  3. మీరు చెప్పేది వినేవాళ్లను ఆకట్టుకోవడంపై కాకుండా సందేశాన్ని తెలియజేయడంపై దృష్టి పెట్టండి. ఇతరులతో పోల్చుకోవద్దు లేదా పోటీ చేయవద్దు. ఇతరుల అభిప్రాయాలకు తావులేకుండా సత్యం వైపు నిలబడండి.
  4. మీ అంతరంగ స్పృహలో ఉన్నవాటిని – మీ వివేకం, కళలు, నిస్వార్థంగా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్న అనుభవాలను మీరు గౌరవపూర్వకంగా పంచుకుంటున్నట్లుగా విజువలైజ్ చేసుకోండి. మీ సందేశాన్ని స్వీకరించే వ్యక్తులు సానుకూలంగా ప్రభావితులు అవుతున్నట్టుగా విజువలైజ్ చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

13th sep 2024 soul sustenance telugu

ఇతరుల స్క్రిప్ట్ను రాసే  ప్రతికూల అలవాటు

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »
11th sep 2024 soul sustenance telugu

సోషల్ మీడియాలో పనిలేని కబుర్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

వ్యక్తుల  ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి ప్రతికూల భావంతో మాట్లాడకూడదని, తీర్పు చెప్పేలా, విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను పేర్కొనకూడదని మనం అభ్యాసం చేస్తాము. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చదివే

Read More »