Hin

17th jan 2024 soul sustenance telugu

January 17, 2024

బంధాలలో సంకల్ప శక్తికి ఉన్న ప్రాముఖ్యత (పార్ట్ 1)

పైతట్టుగా సంబంధాల గురించి వివరించాలంటే, అది ఇద్దరు లేక అధిక వ్యక్తుల మధ్య ఉన్న బంధం అని చెప్పవచ్చు. మరింత లోతుగా నిర్వచిస్తే, ఇద్దరు వ్యక్తులు సంభాషించుకునే విధానం, ప్రవర్తించే పద్ధతి అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికత బంధాలను లోతైన దృష్టికోణంతో చూస్తుంది – సంబంధాలు కేవలం పరస్పరంలో చెప్పుకునేవి, చేసుకునేవి కావు, ఒకరి గురించి మరొకరు ఏమి అనుకుంటున్నారనేదే ఆధారం అవుతుంది. కావున, సంబంధాలు, ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, సంకల్పాలు మరియు భావాల స్థాయిలో శక్తిని ఇచ్చిపుచ్చుకోవడం, తర్వాత మాటలు తర్వాత కర్మలు.

సంబంధాలు మన జీవితంలో మనకు లభించిన అతి పెద్ద సంపద, అవి మనకు సంతోషాన్నిస్తాయి. సంబంధాలను విజయవంతంగా చేసుకోవాలంటే అనగా సానుకూల బంధాల సంపదను కావాలనుకుంటే, వాటి ద్వారా నిత్యం ఆనందాన్ని పొందాలనుకుంటే ఆ బంధాలను సరైన నమ్మకాలపై నిలపడం అవసరం. సంబంధాల గురించి మనలో ఉండే అతి పెద్ద తప్పుడు అభిప్రాయం ఏమిటంటే, సంబంధాలు అంటే సరైన విధంగా మాట్లాడటము, ప్రవర్తించడము అనే అనుకుంటాము. మనమెలా మాట్లాడుతామే దానిబట్టే సంబంధాలు నిలుస్తాయి అని మనం అనుకుంటాము కాబట్టి ఇతరులు కూడా మీ మాటలనే చూస్తారు, వింటారు, నిర్ణయిస్తారు అనుకుంటారు, అందుకే బంధాల మధ్య సంకల్పాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించడం లేదు. అయితే ఆలోచనలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, అధిక శక్తివంతమైనవి మరియు సూక్ష్మమైనవి కనుక అవి మాటలకన్నా త్వరగా ప్రయాణిస్తాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, సరైన వ్యవహారంతో పాటు సరైన ఆలోచనలు కూడా ఉండేలా శ్రద్ధ వహిద్దాం. ద్వేషం, అత్యాశ, అసూయ, స్వార్థం,  కోపం, అహం మొదలైన వేటితోటైనా మన ఆలోచనలు నెగెటివ్‌గా నిండి ఉండి, చేతలు మాత్రం మంచిగా ఉంటే మనమూ తృప్తిగా ఉండలేము, ఇతరులనూ తృప్తిపరచలేము. అన్ని సంబంధాలలో, మన భావం ముఖ్యం, వాటినే మనం సంకల్ప శక్తిగా, తరంగాలుగా ఇతరులకు చేరవేస్తాము, అవి చేతలకన్నా ముఖ్యమైనవి. సంబంధాలలో లోపలి భావాలకు ప్రాముఖ్యతను ఇవ్వడమే పారదర్శకత.

సంబంధాలలో సంకల్ప శక్తికి ఉన్న ప్రాముఖ్యతను మేము మరో రెండు రోజుల సందేశంలో ఉదాహరణలతో వివరిస్తాము.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »
11th sep 2024 soul sustenance telugu

సోషల్ మీడియాలో పనిలేని కబుర్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

వ్యక్తుల  ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి ప్రతికూల భావంతో మాట్లాడకూడదని, తీర్పు చెప్పేలా, విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను పేర్కొనకూడదని మనం అభ్యాసం చేస్తాము. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చదివే

Read More »
10th sep 2024 soul sustenance telugu

5 రకాల ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి

జీవించే కళ  ప్రధానంగా 5 రకాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. పరస్పరం అనుసంధానించబడి ఉండటం వలన, ఇవన్నీ మన

Read More »