Hin

18th jan 2024 soul sustenance telugu

January 18, 2024

బంధాలలో సంకల్ప శక్తికి ఉన్న ప్రాముఖ్యత (పార్ట్ 2)

భార్యాభర్తల సంబంధం, ఒక్కోసారి ఇసుక కోట వంటిది. చూడటానికి బహు ముచ్చటగా ఉంటుంది కానీ బలహీనమైన పునాదిపై నిలిచి ఉన్న కారణంగా ఏ క్షణమైనా కూలిపోవచ్చు. అభిప్రాయాలు, వ్యక్తిత్వం మరియు జీవనశైలిలో భేధాలు అనే పెద్ద ప్రతికూల అలలు సవాలు విసిరినప్పుడు కూలిపోవచ్చు. అటువంటి బంధాలలో, కోటలు కనిపించడానికి అందంగా ఉంటాయి, అంగీకరించడం, నమ్మకం, అర్థం చేసుకోవడం, వదిలేయడం వంటి సుగుణాలు ఉపరితలంలో ఉన్నాయి కనుక. ఈ మంచి గుణాలను భాగస్వాములు ఇరువురు ఒకరికొకరు మాటలు మరియు చేతల రూపంలో ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు.  కానీ ఈ కోటల పునాది బలహీనంగా ఉన్న కారణంగా ఇవి సులభంగా కూలిపోవచ్చు. భాగస్వాములు ఇరువురూ తమ మనసులో పెట్టుకున్న భావాలు, ఆలోచనలే పునాది అవుతాయి – ఆపేక్షలు, తిరస్కారాలు, అపనమ్మకం, అపార్థం, అసూయ, అనుమానం. మంచి భావాలతో పాటు ఇవి కూడా ఉండి కర్మలలో కనిపిస్తూ ఉంటాయి. నేను చేయవలసినది చేసాను, అటు వైపు నుండి వారు చేయాల్సింది చేయాలి కదా అనుకుంటారు, కానీ ఒక్కోసారి అది నెరవేరకపోగా మరింత ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. వారి లోపల కదలాడుతున్న ప్రతికూల భావాల గురించి ఇరువురు భాగస్వాములకు తెలియదు, వారు ఎంత సానుకూల సహాయం చేసినా కానీ లోపల ఉన్న ప్రతికూల భావాలు సానుకూలతకు విరుద్ధంగా వెళ్తుంటాయి.  ఈ ప్రతికూల భావాలు, కనబడకుండా క్రింద పునాది నుండి పని చేస్తూ, అవకాశం దొరికితే కోటను కూల్చే పనిలో ఉంటాయి.

మరో ఉదాహరణ:- కార్పొరేట్ సంస్థలలో, లాభాలు, ఆదాయం, ఉద్యోగాలతో పాటు, వారి ఆంతరిక లక్ష్యం మరొకటి ఉంటుంది –  సంస్థలో, ప్రశాంతత, ప్రేమ మరియు సంతోషం నిండిన, ఆటంకాలు లేని వాతావరణాన్ని సృష్టించడం. ఇది బాహ్య లక్ష్యానికి దోహదపడుతుంది. మొదటి ఆధ్యాత్మిక సిద్ధాంతం ప్రకారం – సంస్థకు CEO లేక MD లేక లీడరు సంస్థకు  బీజము వంటివాడు. అతని ప్రతి ఆలోచన సంస్థలోని ప్రతి ఒక్కరికీ చేరుతుంది, తద్వారా పూర్తి సంస్థను ప్రభావితం చేస్తుంది. రెండవ ఆధ్యాత్మిక సిద్ధాంతం – ఒక సంస్థలోని నాయకుడి అంతర్గత పాలన మరియు నియంత్రణ శక్తి నాయకుడి నిర్వహణ (సంస్థలోని వ్యక్తుల) శక్తికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. నాయకుడి మనస్సు యొక్క అంతర్గత సరిహద్దులలో వ్యర్థాలు మరియు ప్రతికూల ఆలోచనలు ఉంటే, అంటే నాయకుడి మనస్సు యొక్క అంతర్గత వాతావరణం శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉండకపోతే, మొదటి ఆధ్యాత్మిక సూత్రం ప్రకారం, ఇది అతనితో పని చేసే వ్యక్తులకు ప్రసారం చేయబడుతుంది. అలాగే, రెండవ ఆధ్యాత్మిక సూత్రం ప్రకారం, మనస్సును పాలించే మరియు నియంత్రించే శక్తి లేని అటువంటి నాయకుడు తనతో పనిచేసే వ్యక్తులను నిర్వహించడంలో ఆటోమేటిక్‌గా లోపిస్తాడు. అటువంటి నాయకుడు, ఈ రెండు సూత్రాల అన్వయం కారణంగా, సంస్థలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో అసమర్థంగా ఉంటాడు.

 (సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th june2024 soul sustenance telugu

విజయం కోసం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తయారుచేసుకోవడం (పార్ట్ 1)

జీవితంలో వివిధ రకాల పరిస్థితులు ఎదురుకోవడం, వివిధ రకాల వ్యక్తులను కలవడం, మీకు ఎన్నో సవాళ్లను తీసుకొస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అలాగే, మన వ్యక్తిత్వం  స్థాయిలో మన శక్తులు

Read More »
24th june2024 soul sustenance telugu

పోటీ పడకుండా సహకరించుకుందాం

నిజమైన సహకారం అంటే సర్వులకు ఎల్లవేళలా తన వారనే భావన మరియు సాధికారత ఉద్దేశ్యంతో షరతులు లేని సహాయాన్ని అందించడం. ఇది వినయం, ప్రేమ, కరుణ మరియు తాదాత్మ్యం వంటి మన నిజ గుణాలను

Read More »
23rd june2024 soul sustenance telugu

నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలు

నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన శారీరక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని అపారంగా ప్రభావితం చేస్తుంది. నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలను చూద్దాం –

Read More »