Hin

19th jan 2024 soul sustenance telugu

January 19, 2024

బంధాలలో సంకల్ప శక్తికి ఉన్న ప్రాముఖ్యత (పార్ట్ 3)

మన పూర్తి జీవితానికి  పిల్లలు-తల్లిదండ్రుల బంధమే పునాది. పిల్లలు తమ చిన్నతనంలో అలవర్చుకునే అలవాట్లు వారి తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు. తరచుగా, తల్లిదండ్రులు పిల్లలపై సానుకూల అలవాట్లను రుద్దుతుంటారు. పిల్లలు కోపం తెచ్చుకున్నా, అబద్ధాలు చెప్పినా, టి.వి, ఇంటర్‌నెట్‌ వంటి సైన్సు మాధ్యమాలలో తప్పుడు సమచారాన్ని చూసినా లేక చిన్న వయసులో తప్పుడు స్నేహం చేసినా, తాగుడు, ప్రొగ తాగడం వంటి అలవాట్లు ఉన్నా తల్లిదండ్రులు పిల్లలను తిడతారు. తల్లిదండ్రులు ఏర్పరచిన నియమాలను పాటిస్తూ పిల్లలు తీసుకువచ్చే మార్పుకు తల్లిదండ్రులు చాలాసార్లు సంతృప్తి చెందరు. ఇది పిల్లలు-తల్లిదండ్రుల బంధాన్ని ఇబ్బందిపాలు చేస్తుంది. తల్లిదండ్రులు తమ బాగు కోసమే చెప్తున్నారన్న విషయం తెలిసినాగానీ ఎందుకు వారి మాట వినరు? మాటలకన్నా శక్తివంతమైనవి, పిల్లల భౌతిక స్థాయికి చేరుకునేవి- తల్లిదండ్రుల వ్యక్తిత్వం – ఇది పిల్లలపై అదృశ్యంగా ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రుల మాటలకన్నా వారి వ్యక్తిత్వమే పిల్లలకు త్వరగా చేరుకుంటుంది. తల్లిదండ్రులు మార్పును చెప్తారు గానీ మార్పును అవలంబించరు. ఏ చెడు అలవాట్లనైతే పిల్లలలో వద్దు అని తల్లిదండ్రులు చెప్తున్నారో అవి వారిలో ఉంటున్నాయి – కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము మొదలైనవి… ఇవి పిల్లల సూక్ష్మ స్థాయికి చేరుకుంటూ ఉంటాయి. ఈ ప్రతికూల శక్తులు పిల్లల మనసులను తల్లిదండ్రులిచ్చే సూచనలు, శిక్షణలకన్నా ఎక్కువగా  ప్రభావితం చేసి, మాటలవలన ప్రయోజనం శూన్యంగా చేస్తున్నాయి.

పిల్లలకు ఉండే మరో ముఖ్యమైన బంధం గురించి ఆలోచిస్తే, వారికి వారి స్కూలు టీచరుతో ఉన్న బంధం. పిల్లలపై ఉపాధ్యాయులకున్న ఆపేక్షలు, మంచిగానీ చెడుగానీ, అవి పిల్లల విద్యా సామర్థ్యాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అనేక పరిశోధనలు చెప్తున్నాయి. ఈ విద్యార్థులలో తక్కువ సమర్థత ఉంది అని అనుకునేకన్నా, ఒకవేళ టీచర్లు పిల్లలలో మంచి సమర్థత ఉంది, మంచి ఫలితాలను తీసుకువస్తారన్న నమ్మకాన్ని కనబరిచినప్పుడు పిల్లలు కూడా తమ సమర్థతకు ఏ మాత్రం తగ్గకుండా పని చేసి మంచి ఫలితాలను పొందుతారు. తరచుగా, పాఠశాలలో, పిల్లల సమర్థత గురించి ఉపాధ్యాయుల మాటలకు, ఆలోచనలకు పొంతన ఉండటం లేదు. ఉపాధ్యాయుల మాటలు చూస్తే వారికి విద్యార్థులపై పూర్తి నమ్మకము, ఆశ ఉన్నట్లుగా మాట్లాడుతారు, కానీ ఆలోచనలలో మాత్రం అంతటి సానుకూలత ఉండటం లేదు. పిల్లలు ఫెయిల్ అవుతారేమో అన్న భయంతో కూడిన ప్రతికూల ఆలోచన ఉపాధ్యాయులలో ఉన్నప్పుడు వారు మాటలతో ఎంత ప్రోత్సాహకరంగా మాట్లాడినా కానీ పిల్లల మనసుపై ప్రతికూలత యొక్క ప్రభావమే పడుతుంది. దీని కారణంగా పరీక్షలలో పిల్లలు తక్కువ సమర్థంగా ఉంటారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »