Hin

11th jan 2024 soul sustenance telugu

January 11, 2024

బంధాలలో తీర్పులు ఇవ్వకుండా ఉండటం

మనం కుటుంబ సభ్యులుగా, స్నేహితులుగా లేక సహోద్యోగులుగా, మన చుట్టూ ఉన్నవారు వారి ఆలోచనలను, భావాలను మనతో పంచుకోవాలని ఆశిస్తాం. కానీ ఎప్పుడైనా వారి మనసు బాగలేకపోయినా, వారు తప్పు చేసినా వారు మనతో పంచుకోరు. మనం వారి పనిని విమర్శిస్తామేమో అని, వారిని తిరస్కరిస్తామేమో అని, ఆవేశంగా స్పందిస్తామేమో అని భయపడతారు. అటువంటప్పుడు వారు తమవారితో మాట్లాడటంకన్నా తీర్పులు ఇవ్వని కౌన్సిలర్ల  ఆధారం తీసుకుంటున్నారు.

ఈ క్షణం, మీరు ఇతరులకు ఎలా సాంత్వన ఇవ్వగలరో ఆలోచించండి, విమర్శించకుండా, తీర్పులు చెప్పకుండా ఓదార్చాలి.

ధృవీకరణ

నేను ప్రేమ స్వరూపాన్ని. నేను అందరితో ప్రేమగా ఉంటాను. నేను సర్దుకుపోతాను… ఎవరు ఎలా ఉన్నారో అలా వారిని నేను అంగీకరిస్తాను… ఎవరు ఎలా ఉన్నా, ఎలా ప్రవర్తించినా కానీ నేను… ప్రేమ మరియు అంగీకారాన్ని బేషరుతుగా ప్రసరిస్తున్నాను… ఆశించకూడదు, అంగీకరించాలి అనేలా ఉండటం నాకు సహజమే… ఈరోజు నేను ఎవరితో అయితే కలుస్తానో వారు నాకు భిన్నంగా, వేరువేరు స్వభావ సంస్కారాలు ఉన్నవారని నేను అర్థం చేసుకున్నాను… కొందరు ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయ్యి ఉండవచ్చు… మరికొందరు తప్పు చేసి ఉండవచ్చు… పెద్ద తప్పే… కొందరు సందిగ్ధంలో ఉండవచ్చు… వారు నన్ను కుటుంబ సభ్యుడిగా లేక స్నేహితుడిగా లేక సహోద్యోగిగా భావించి నాతో పంచుకున్నప్పుడు… నేను నిర్లిప్తంగా ఉండి వారి పట్ల నాకు కలుగుతున్న భావాలను, ఆలోచనలను పరిశీలించుకుంటాను… వారితో చర్చించేటప్పుడు నాలోని భావాలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనిస్తాను… నేను నా భావాలను సానుకూలంగా పెట్టుకుంటాను… తీర్పులు ఇవ్వకుండా ఉంటాను… నేను కౌన్సిలర్‌గా వ్యవహరిస్తాను… వారిపట్ల  సహానుభూతిని వ్యక్తబరిచే దోహదకారిగా అవుతాను… నేను వారి భావాలను గౌరవిస్తాను… వారి ప్రవర్తనకు, మాటలకు నేను ప్రభావితమవ్వను… అవి నాకు భిన్నంగా ఉన్నాయి… నేను ఎవ్వరినీ తప్పు అనిగానీ, చెడు అనిగానీ పేరు పెట్టను. విమర్శించడంలో నేను నా సమయాన్ని వృధా చేసుకోను. వారు చెప్పేది, చేసేది నాకు సరైనదిగా అనిపించకపోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఇది వారికి సత్యం… ఇది వారికి సరైనదిగా తోచుతుంది… వారు తప్పు అని, చెడు అని నేను ఆలోచించను… వారు భిన్నమైనవారని నేను అర్థం చేసుకున్నాను… ఇలా అంగీకరించడం వలన నా నుండి పాజిటివిటీ ప్రసరిస్తుంది… నా అంగీకారం వలన వారు అంగీకరించగలుగుతారు… ఉపశమనం అవుతున్నట్లుగా వారికి అనిపిస్తుంది… నాతో మాట్లాడుతుంటే ఊరట కలిగినట్లుగా వారికనిపిస్తుంది… నేను వారు చెప్పేది శ్రద్ధగా, జాగ్రత్తగా వింటాను… నేను వారికి ప్రేమగా, గౌరవంగా నా సలహాలను, సూచనలను, శిక్షణలను ఇస్తాను…

 

ఈ విధమైన ఆలోచనలను పదే పదే రిపీట్ చేసుకుంటే వ్యక్తుల పట్ల తీర్పులు ఇవ్వకుండా ఉంటాము. వారు ఎలా ఉన్నారో అలాగే వారిని అంగీకరించడం వలన మీరు పటిష్టమైన బంధాలను ఏర్పరుస్తున్నారు… మీ భావోద్వేగాలకు మీరు వారిని బాధ్యులు చేయరు…

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »
16th june2024 soul sustenance telugu

 దేవీ దేవతల 36 దివ్య గుణాలు

నిన్నటి సందేశంలో, దేవీ దేవతలలో ఉన్న 36 దివ్య గుణాలను ప్రస్తావించాము. మనం పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరియు ప్రశంసనీయంగా తయారవ్వటానికి మనలో ప్రతి గుణం చెక్ చేసుకొని ధారణ చేద్దాము. ఈ గుణాలన్నింటినీ మనం

Read More »
15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »