HI

16th dec 2023 soul sustenance telugu

December 16, 2023

బేషరతు ప్రేమలోని చక్కదనం

మనం అందరినీ బేషరతుగా ప్రేమించాలనే అనుకుంటాం, కానీ ఎదుటివారి నుండి కోపం, అహం లేక ద్వేషం వస్తే, అప్పుడు కూడా వారితో ప్రేమగా వ్యవహరించడం అసంభవంగా మనకు ఎందుకు అనిపిస్తుంది? అయితే ఈ పరిమితిని చేతన ప్రయాసతో అధిగమించాలన్న ఆలోచన మనకున్నాగానీ, ఇటువంటి పరిస్థితిలో వచ్చే ప్రతికూల ఎమోషన్లు ఇతరులపై మనకున్న ప్రేమను తగ్గించేస్తాయి. ఆధ్యాత్మిక ప్రేమ అనే ప్రకంపనాలలో లోతుగా మునిగిపోయినట్లయితే ఆ ప్రేమ అనేది ఒక సజీవ వాస్తవికతగా మారుతుంది, మీరు దానిని లోతుగా అనుభవం చేస్తారు, ఈ అనుభూతి ఇతర ఆత్మల పట్ల మనకు బేషరతు ప్రేమను ఉండేలా చేస్తుంది. అటువంటి ప్రేమను ముందుగా స్వయానికి ఇచ్చుకోవాలి. ఇతరులను ప్రేమించేముందు, మిమ్మల్ని మీరు ముందుగా ప్రేమించుకోవాలి. ఈ బేషరతు ప్రేమ అందరిలోనూ ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టడానికి, అనుభూతి చెందడానికి, వ్యక్తపరచడానికి ఆంతరిక ఆధ్యాత్మిక జాగృతి ముందుగా కావాలి. అది దానంతట అదే ఏమీ రాదు, దానిని ఆశీర్వాద రూపంలో అందుకోవాలి, ఇది పరమాత్మ ప్రాప్తి. ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయ్యి, స్వయంలో అనుభూతి అయ్యే ప్రేమ కారణంగా ఇతరులను ప్రేమించగలుగుతుంది. కొందరి కారణంగా మన జీవితంలో ఏర్పడిన గాయాలు, చేదు గతం మిగిల్చిన జ్ఞాపకాలను ఈ విధంగా మనం నయం చేసుకోవచ్చు.

ముందుగా ఆత్మ ఆధ్యాత్మిక సాధికారతను పొందాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాల క్రమేణా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ పరమాత్మతో కనెక్ట్ అవ్వడం వలన అది దానంతట అదే జరగవచ్చు. పరమాత్మ ప్రేమను పంచుకునే ఆత్మల సాంగత్యం వలన ఈ శక్తి మారకం జరుగుతుంది. ఇది మార్పును సులభంగా, వేగంగా తీసుకురావడంలో మనకు దోహదపడుతుంది. మనకు ప్రేమ కావాలంటే ముందుగా మనం దానిని ఇతరులకు పంచాలి. స్వ లాభం కోసం ప్రేమను నా కోసమే లోపల దాచుకోవడం కాదు. ఇలా చేస్తే ప్రేమ యొక్క గుణానికి విరుద్ధంగా వెళ్తున్నామని అర్థం. ఇతరులకు పంచే బేషరతు ప్రేమలో ఎనలేని శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తి మనకు ఎగరడానికి రెక్కలను ఇస్తుంది, మన గురించి సానుకూలంగా ఆలోచించేలా చేస్తుంది, మన మనసును ఆధ్యాత్మిక పరిపూర్ణతతో, సంతృప్తితో నింపుతుంది, జీవితంలో వచ్చే ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తినిస్తుంది. వర్షపు చినుకులు అందరికీ సమానంగా కురుసి, అన్ని భూ భాగాలకు సమానంగా పోషణను ఇచ్చినట్లుగా దైనందిన జీవితంలో మెడిటేషన్ చేయడం మరియు పరమాత్మ శక్తితో స్వయంలో దివ్య గుణాలను ధారణ చేయడం వలన మన హృదయం గాఢమైన ప్రేమకు ద్వారాలు తెరవబడతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th feb 2024 soul sustenance telugu

గతం నుండి నేర్చుకుందాం

మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా నిజాయితీగా గతంలో చేసిన పొరపాట్ల నుండి ఏమైనా నేర్చుకున్నారా లేక కేవలం గతంలోనే ఆగిపోతున్నారా? చివరకు గతాన్ని వృధాగా తలుచుకుంటూ చాలా తక్కువ నేర్చుకోవడం జరుగుతుందా?

Read More »
18th feb 2024 soul sustenance telugu

ఆపేక్షలను విడిచిపెట్టండి

మీ సహోద్యోగి సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మీరు ఎప్పుడూ సహాయం చేస్తూనే వచ్చారు, కానీ ఒక్కసారి మీరు అతడిని సహాయం అడిగితే అతను నిరాకరించాడు. మీరు ఇంటికి చేరుకునేసరికి బాగా అలసిపోయారు. మీ

Read More »
17th feb 2024 soul sustenance telugu

దూకుడు స్పందనలను సమర్థించవద్దు

కొన్ని సందర్భాలలో మన మాటలను, ప్రవర్తనను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, అలాంటప్పుడు మనం దూకుడుగా స్పందించేస్తుంటాం. అప్పుడు మన పొరపాటును అంగీకరించకపోగా, తరచూ మన స్పందనను సమర్థించుకుంటూ ఉంటాము. ఈరోజుల్లో మన పాత్రలు

Read More »