Hin

బేషరతు ప్రేమను అందరికీ ఇవ్వటం

January 21, 2024

బేషరతు  ప్రేమను అందరికీ ఇవ్వటం

ఈ జగన్నాటకంలో మనమందరం విశేషమైన ఆత్మలం. కోటాను కోట్ల ఆత్మలతో కూడిన దైవిక కుటుంబంలో భగవంతుని పిల్లలం. మనందరం పరస్పరం ఆత్మీక ప్రేమ కలవారం.  భగవంతుడు మన సర్వోన్నత తల్లి-తండ్రి. వారు  మన జీవితంలోని ప్రతి క్షణంలో మనపై  స్వచ్ఛమైన ప్రేమను కురిపించే ప్రేమ సాగరుడు. వారి పిల్లలుగా, మనం కూడా భగవంతుడిని ప్రేమించడంతో పాటు విశ్వంలో  ఉన్న ప్రతి ఆత్మను ప్రేమించాలి. మనం దీన్ని చేయగల కొన్ని మార్గాలను అన్వేషిద్దాం –

  1. మీరు కలిసే ప్రతి ఆత్మతో చిరునవ్వు మరియు శుభాకాంక్షలను పంచుకోండి – ప్రతి రోజు మనం  వివిధ రకాల వ్యక్తిత్వం ఉన్న  వ్యక్తులను కలుస్తాము, కొంతమంది సానుకూలంగా,  మరి కొంతమంది ప్రతికూలంగా ఉంటారు. ప్రతి ఒక్కరికీ  వినయపూర్వకమైన  స్వచ్ఛమైన చిరునవ్వు మరియు మీ మాటలతో శుభాకాంక్షలను బహుమతిగా ఇవ్వండి. ఇతరులను సద్భావనతో ఆశీర్వదించండి.
  1. ప్రతి ఒక్కరినీ ఒక సుందరమైన ఆత్మగా చూసి వారికి విజయం కలగాలని ఆశించండి – మనం ప్రతిరోజూ చేయగలిగే అత్యంత మంచి పని –  ప్రతి ఆత్మ యొక్క మంచిని చూడటం,  వారిని కలిసినప్పుడు వారికి ఒక శుభాకాంక్షను ఇవ్వటం. మనం ఇతరుల మంచిని కోరుకుంటే, వారు మన మంచిని కోరుకుంటారు తద్వారా మన స్వచ్ఛమైన ప్రేమ అపారంగా పెరుగుతుంది.
  1. ప్రతి ఆత్మకు ‘నా వారు’ అన్న అనుభూతిని కలిగించండి – ప్రతి ఆత్మ భగవంతుని సంతానం అయినప్పటికీ, నేడు ప్రపంచంలో పరమాత్మ మరియు మానవ ఆత్మల మధ్య సంబంధం అంత శక్తివంతంగా  లేదు. ప్రపంచంలోని ప్రతి ఆత్మకు ‘భగవంతునికి చెందిన వారము’ అన్న అనుభూతిని కలిగించడం మరియు వారికి దైవిక ప్రేమ, సంరక్షణ, ఆధారాన్ని అందించడం మన బాధ్యత.
  1. ప్రేమను ఇవ్వండి, ప్రేమను స్వీకరించండి మరియు సానుకూల బంధాన్ని ఏర్పరచుకోండి – కొన్నిసార్లు కొందరు మీకు ప్రేమ మరియు ఆనందాన్ని ఇవ్వరు, వారు మిమ్మల్ని ఇష్టపడరు. అలాంటి సమయాల్లో వారి ప్రతికూల వైబ్రేషన్స్ ను ఎప్పుడూ గ్రహించకండి, కానీ ప్రేమతో నిండిన మీ సానుకూల వైబ్రేషన్స్ తో వాటిని మార్చండి. ప్రతి ఆత్మతో గాఢమైన  సంబంధం ఏర్పరుచుకున్నట్లైతే అది వారిని కూడా ప్రేమగా మారుస్తుంది.
  2. భగవంతుని ఒక్క గుణాన్ని ప్రతిరోజు అందరికీ ఇవ్వండి – భగవంతుడు సుగుణాల సాగరుడు. వారు  ఇచ్చే జ్ఞానాన్ని వింటూ, వారిని నిరంతరం స్మరించుకుంటూ ఉండే మన ప్రయాణం వారి గుణాలతో మనల్ని   నింపుతుంది. భగవంతుని ఒకొక్క గుణాన్ని మీ కుటుంబ, సామాజిక మరియు వృత్తిపరమైన సర్కిల్స్ లో  ప్రతి రోజూ పంచుకోండి.

 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

10th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: – ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో

Read More »
9th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 2)

కేంద్రీకృత ఆలోచన యొక్క ఆరోగ్యకరమైన, సానుకూల అనుభవంలో ఉండనివ్వని ఒక ముఖ్యమైన అంశం మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకాల ప్రభావాలు. రెండు రకాలైన ప్రభావాలు ఉన్నాయి – బాహ్యమైనవి మరియు ఆంతరికమైనవి.

Read More »
8th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా

Read More »