Hin

22nd sep 2024 soul sustenance telugu

September 22, 2024

భగవంతుడిని మన మంచి స్నేహితుడిగా చేసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు

  1. కష్టతరమైన పరిస్థితుల భారం నుండి మనల్ని విడిపిస్తారు – ప్రతి చర్యలో మనం భగవంతుడి చేతిని ఎంత ఎక్కువగా పట్టుకొని, మనపై వారి ఆశీర్వాదాలను అనుభవం చేసుకుంటామో, ప్రపంచంలోనే అత్యున్నత శక్తి అయిన భగవంతుడు అంత ఎక్కువగా మన సన్నిహిత స్నేహితుడిగా అవుతారు. వారి మద్దతు మన జీవితంలోని ప్రతి రంగంలోకి ప్రవేశించినప్పుడు, మనం దైవిక సహాయానికి ఉన్నతమైన జోన్లో ఉంటాము మరియు మనం పూర్తిగా భారం నుండి విముక్తి పొందుతాము.
  2. తన తెలివైన మేధస్సుతో మన జీవితాన్ని నడిపిస్తారు – మంచి స్నేహితులు తరచుగా జీవిత ప్రయాణంలో కలిసి నడుస్తారు. కానీ భగవంతుడు మన మంచి స్నేహితుడిగా, మనతో మాత్రమే కాక మన ముందు కూడా ఉన్నారు . వారు అత్యంత తెలివైనవారు , అత్యున్నత మేధస్సు కలవారు . కాబట్టి మనం వారిని అనుసరిస్తున్నప్పుడు, వారు మన జీవితంలోని ప్రతి విభిన్న దృశ్యం యొక్క రహస్యాన్ని చెబుతారు కనుక మనం ప్రతి దృశ్యం నుండి నేర్చుకుని సరైన చర్యలను చేస్తాము.
  3. మనకున్న ప్రతి కలను నెరవేరుస్తారు – మనమందరం మంచి ఆరోగ్యాన్ని పొందడం, ధనవంతులు కావడం, అందమైన సంబంధాలను కలిగి ఉండటం మరియు మన పాత్రలలో విజయాన్ని పొందడం వంటి అందమైన కలలతో జీవిస్తాము. కలలను నెరవేర్చడానికి మనం చిన్న అడుగులు వేస్తున్నప్పుడు, భగవంతుడు పరిపూర్ణంగా మంచి స్నేహితుడి పాత్రను పోషించి మన విజయ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రతి దశలో మనకు సహాయం చేస్తారు.
  4. మన ఇళ్లలో మరియు కార్యాలయాలలో స్వర్గాన్ని స్థాపించడానికి సహాయపడతారు– భగవంతుడిని అనుభూతి చేసుకోవడంతో ప్రతి ఇల్లు మరియు కార్యాలయాలను ఆనందం, సద్భావన మరియు సాన్నిహిత్యంతో నిండిన స్వర్గంగా చేస్తుంది. భగవంతుడు మన ఇంటికి మరియు కార్య ప్రదేశానికి అధిపతి పాత్రను పోషిస్తారు, ప్రతి క్షణం మనకు అందుబాటులో ఉండి మనం వారిని అడగకుండానే ప్రతి అవసరాన్ని నెరవేరుస్తారు.
  5. మన లక్షణాలను మరియు శక్తులను నిరంతరం పెంచుతారు – మన రోజువారీ జీవితంలో అవసరమైన వివిధ లక్షణాలు మరియు శక్తుల యొక్క అత్యంత అందమైన ప్రకంపనలతో నిండిన అత్యంత అందమైన ఆధ్యాత్మిక శక్తి భగవంతుడు. వారు మన ఉత్తమ సహచరుడు అయి, వారి ప్రకంపనలతో ఆత్మను నింపి, ఎందుకు, ఎప్పుడు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు లేకుండా జీవితాన్ని సున్నితమైన ప్రయాణంగా మార్చుతారు..

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »