Hin

14th May 2025 Soul Sustenance Telugu

May 14, 2025

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 1)

ప్రతి ఉదయం మనం రోజును ప్రారంభించినప్పుడు, వివిధ చర్యలను చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా లేదా మన ఆఫీసులో ఉన్నా లేదా మరెక్కడైనా ఉన్నా, రోజంతా ఒకదాని తర్వాత ఒకటి ఏమి చేయాలనేది ఎల్లప్పుడూ మన మనస్సులో ఉంటుంది. అదే సమయంలో, మన జీవితాన్ని ఒక వేరే దృష్టికోణం నుండి, అంటే భగవంతుడు మన జీవితాన్ని ఎలా చూస్తారో అలా చూసినప్పుడు, వారు మనం రోజును జీవించడమే కాకుండా, చర్యలను చేస్తూ, వారిని మనతో దగ్గరగా అనుభవం చేసుకోవాలని కోరుకుంటారని మనకు అర్థం అవుతుంది. మనం అలా చేయాలని వారు ఎందుకు కోరుకుంటారు? ఈ సందేశంలో మనం ఈ క్రింది 5 లాభాలను తెలుసుకుందాం.

 

భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మనకు తేలికగా అనిపిస్తుంది 

 

నేడు, మన వేగవంతమైన జీవితంలో, ఒత్తిడితో కూడిన పరిస్థితులు మళ్లీ మళ్లీ తలెత్తుతాయి. మనం దృఢంగా ఉండకపోతే, మనం ఒంటరిగా ఉన్నామని భావిస్తే, త్వరగా కష్టపడుతున్నట్లుగా, మానసికంగా భారంగా అనిపించవచ్చు మరియు దృష్టి పెట్టలేకపోతాం కూడా. ఎందుకంటే మనం భగవంతుడితో అనుసంధానమయ్యి ఉండము. మన ఆలోచనల్లో ఏదైనా కష్టాన్ని అనుభవించిన వెంటనే వారికి మన భారాలను అప్పగించే అలవాటు మనకు లేదు. మన సంస్కారాలను నిర్వహించడం, వాటిని మార్చడం, మన శరీరాన్ని మరియు దాని ఆరోగ్యాన్ని నిర్వహించడం, మన సంబంధాలను నిర్వహించడం మరియు వాటి నాణ్యత మరియు సానుకూలతను పరిరక్షించడం, మన పని లో విజయవంతం కావడం మరియు మన ఇంటిని నిర్వహించడం వంటి అనేక విషయాల్లో కూడా ఇది వర్తిస్తుంది. మన జీవిత సమస్యలను మన విధానంలో మరియు మనకు సరైనది అనిపించిన దాని ప్రకారం నిర్వహించడం మనకు అలవాటు ఉందని భగవంతుడు మనకు గుర్తు చేస్తారు. ఇప్పుడు అలవాటును మార్చుకోండి. మన జీవితంలోని ప్రతిదానికీ పరిష్కారం ఇచ్చే భగవంతుడిని అనుభవం చేసుకోవటం ప్రారంభించండి. మీ చైతన్యంలో భగవంతునితో మాట్లాడటం ప్రారంభించి మీరు వారిని అడిగే ప్రతిదానికీ వివిధ అద్భుతమైన   సమాధానాలు పొందడం ప్రారంభించండి. అలాగే, ప్రతి ఉదయం ధ్యానంలో వారి మార్గదర్శకత్వాన్ని తీసుకొని మీ రోజును ప్రారంభించండి. ఈ విధంగా మీరు చాలా తేలికగా అనుభూతి చెందుతారు మరియు మనం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు రోజంతా మన మనస్సులలో మళ్లీ మళ్లీ తలెత్తే సాధారణ ప్రశ్నలు, ఎందుకు, ఏమి, ఎప్పుడు, ఎలా అనే భయం, ఆందోళన లేకుండా మీరు చేసే ప్రతిదాన్ని మీరు ఆనందిస్తారు.

మనం ఆ విధంగా భగవంతునితో అనుసంధానించబడినప్పుడు, మన ఆలోచనలు తక్కువ అవుతూ సానుకూలంగా మారుతాయి, సమస్యల పరిష్కారాలను సులభంగా చేరుకుంటామని తెలుస్తుంది. అలాగే, ఈ వాస్తవికతపై లోతైన విశ్వాసంతో భగవంతుడు మనకు సహాయం చేస్తున్నారనే భావన నిరంతరం ఉంటుంది.

(సశేషం…)

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »