Hin

15th May 2025 Soul Sustenance Telugu

May 15, 2025

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 2)

భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది 

నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన విధిని సానుకూలంగా మరియు మంచిగా మార్చుకోవటం. విధి అంటే ఏమిటి? విధి అంటే రెండు స్థాయిల్లో మంచి ప్రాప్తులతో నిండిన జీవితం –

1.మన చైతన్యంలో మన ఆలోచనలు మంచిగా ఉండాలి, మన భావాలు మనకూ, ఇతరులకూ శుభకరంగా ఉండాలి. సానుకూల చర్యలు తీసుకోవడానికి ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేసే దివ్యమైన మరియు స్పష్టమైన బుద్ధి మనకు ఉండాలి, మన సంస్కారాలు మంచి సుగుణాలు మరియు శక్తులతో నిండి ఉండాలి మరియు మనం అనేక విభిన్న ప్రత్యేకతలతో నిండి ఉండాలి; మరియు

2.మన చైతన్యానికి వెలుపల అంటే చాలా మంచి ఆరోగ్యం మరియు మంచి శారీరక వ్యక్తిత్వం, ప్రతి దశలో మనకు ఆనందాన్ని ఇచ్చే సమృద్ధిగా ఉన్న సంపద, ప్రేమ, సామరస్యం మరియు సంతృప్తితో నిండిన సానుకూల సంబంధాలు మరియు మన విద్య, కుటుంబం లేదా ఉద్యోగంలో మనం చేసే ప్రతి పనిలో చాలా విజయాలు.

పైన పేర్కొన్న విషయాలన్నీ మనమందరం చాలా కోరుకునే సానుకూల విధిని రూపొందిస్తాయి. ఈ విషయాలన్నింటినీ మనం ఎలా సాధించగలం? సాధారణంగా, మనం వాటన్నింటికీ విడిగా కృషి చేస్తాము. కానీ భగవంతుడు చెప్తున్నారు, ఆధ్యాత్మికత సహాయంతో మనం మన చైతన్యాన్ని శక్తివంతం చేసుకొని జీవితం గురించి మన నమ్మకాలను మార్చుకుంటే, మన మొత్తం విధి మరింత అందంగా మారుతుంది మరియు పైన పేర్కొన్న మన అంతర్గత మరియు బాహ్య ప్రాప్తులు పెరుగుతాయి. మనం ఇలా చేయకపోతే మన విధి కొన్నిసార్లు మంచిగా మరియు కొన్నిసార్లు మంచిగా ఉండకుండా లేదా మన విధి యొక్క కొన్ని అంశాలు మంచివిగా మరియు కొన్ని ఉండవు. ఈ అంశాలన్నింటి కోసం మనం కష్టపడి పనిచేస్తూనే ఉంటాము, కానీ మనం పూర్తిగా సంతృప్తి చెందము. కానీ భగవంతుడు తాను ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటూ, ధ్యానంలో వారితో అనుసంధానమవుతూ రోజును ప్రారంభించటం,  రోజులో వారితో అనుసంధానం కావడం మరియు జీవితమంతా వారి సూచనలను అనుసరించడం ద్వారా మన విధి బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మనం విశ్వానికి సానుకూల శక్తిని ప్రసరింపజేసి, మన గత ప్రతికూల కర్మలను తొలగిస్తాము, ఈ రెండూ మన విధిని సానుకూలంగా ప్రభావితం చేస్తాయి.

(సశేషం…)

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »