Hin

17th May 2025 Soul Sustenance Telugu

May 17, 2025

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 4)

భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన అంతర్గత శక్తులు పెరుగుతాయి

మానవ ఆత్మలకు ఒక సార్వత్రిక అవసరం ఆధ్యాత్మిక శక్తి, ఇది నేడు ప్రపంచంలో లేదు. దాదాపు ప్రతిరోజూ వేర్వేరు విషయాల వల్ల మనం కలత చెంది, కలవర పడి, చిరాకు పడి, ఆందోళన చెంది నెగటివ్ గా ప్రభావితమవుతున్నాము. ఇవన్నీ ఆధ్యాత్మిక శక్తి లోపానికి సంకేతాలు మరియు ఇవి మన వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజూ పెరగడం మాత్రమే మనం చూస్తాము. అలాగే, జీవితంలోని ఎత్తుపల్లాల వల్ల మనం లోతుగా ప్రభావితమవుతున్నాము. జీవిత పరిస్థితులు మన దారిలో నడుస్తున్నప్పుడు ఉత్సాహంగా, అతి సంతోషంగా ఉండటం మరియు అవి లేనప్పుడు నిరుత్సాహపడటం, విచారంగా ఉండటం చూస్తున్నాము. అలాగే, ఇతరులు మన పట్ల మంచిగా ఉంటే మరియు వారిలో కొన్ని ప్రత్యేకతలు కనిపించినప్పుడు వారితో సులభంగా అనుబంధం కలిగి ఉండటం మరియు ఇతరులు మంచిగా లేకుంటే లేదా కొన్ని బలహీనతలు ఉంటే వారిని సులభంగా ద్వేషించడం చేస్తున్నాము. చివరగా, ఆధునిక ప్రపంచంలో మనతో ఉన్న అందమైన శారీరక సాధనలతో ముడిపడి ఉండటానికి మరియు మన మనస్సును వాటి గురించి ఆలోచించడానికి నిరంతరం అనుమతిస్తున్నాము. ఇవన్నీ ఆత్మ శక్తి తగ్గడానికి సంకేతాలు. ప్రపంచానికి దాని సానుకూలతలు మరియు ప్రతికూలతలు ఉన్నాయి మరియు మనం నిరంతరం రెండింటికీ వివిధ రకాలుగా ప్రభావితమవుతున్నాము. ఈ ప్రభావాన్ని దాటి మరింత శక్తివంతంగా ఎలా మారాలి?

అన్నింటిలో మొదటిది, మనం ఈ ప్రభావాలన్నింటినీ దాటి వెళ్ళాల్సిన అవసరం ఉందని లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్రతీదానికి ప్రభావితం కావడం సహజం మరియు సాధారణం అని భావిస్తాము. కానీ ఇది ఆత్మ యొక్క అసలు దశ కాదని, దాని అసలు సంస్కారం కాదని భగవంతుడు చెపుతారు. అప్పుడు, మనం అంతర్గతంగా మరింత నిర్లిప్తంగా మరియు బలంగా మారడానికి ఒక మార్గం అవసరం. అలాగే, ఈ భౌతిక సాధనాలు, పరిస్థితులు లేదా మనుషుల ద్వారా అంతర్గత సంతృప్తి పొందాలని ఆశించే బదులు, మనం భగవంతుడిని మనతో పాటు ఉంచుకొని, వారి పాజిటివ్ శక్తిని మరియు ఆధ్యాత్మిక శక్తిని నిరంతరం గ్రహించాలి. ఈ విధంగా మనం వాటిని ప్రభావితం చేసి మనకు మరియు ఇతరులకు సానుకూలంగా, ప్రయోజనకరంగా చేస్తాము. అలాగే, మనము వాటి ప్రభావానికి లోబడి ఉండకూడదు, ఇది మనల్ని భావోద్వేగపరంగా మరియు బలహీనంగా చేస్తుంది. మనం ఆత్మిక స్మృతిలో ఉండి, ధ్యానంలో పరమ ఆత్మ అయిన భగవంతునితో అనుసంధానమై, మన సానుకూల ఆధ్యాత్మిక శక్తిని మరియు భగవంతుని ఆధ్యాత్మిక శక్తిని పరిస్థితులు, వ్యక్తులు, భౌతిక ప్రపంచం లేదా ప్రకృతి మరియు ఈ రోజు ప్రపంచంలో మనం చూసే అనేక విభిన్న భౌతిక విషయాలకు ప్రసరింపజేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. 

(సశేషం…)

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »