Hin

13th october 2024 soul sustenance telugu

October 13, 2024

భగవంతుని 5 గొప్ప విశేషతలు

  1. అందరూ భగవంతుడిగా ఒప్పుకునేవారు – భారతదేశంలో అనేకులు దేవి దేవతలను పూజిస్తారు. భారతదేశం వెలుపల, వివిధ మత పెద్దలను చాలా గౌరవంతో పూజిస్తారు. కానీ భగవంతుడు నిరాకారుడైన పరమ జ్యోతి. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే సర్వ గుణాల సాగరుడు. వారిని వివిధ మతాలలో గాడ్, ఈశ్వర్, భగవంతుడు, అల్లా మొదలైన పేర్లతో పిలుస్తారు.
  2. సర్వోన్నతమైనవారు – భగవంతుడు పరమపిత, పరమ శిక్షకుడు, ప్రపంచంలోని సర్వోన్నతమైన గురువు. వారు ఏ ఇతర ఆత్మ నుండి పాలన తీసుకోరు. నిజానికి, అందరూ ఆ మహోన్నతుడి పాలన కొరకే ఎదురుచూస్తూ ఉంటారు. వారు ప్రపంచంలోని ఆత్మలందరినీ తన జ్ఞానం, సుగుణాలు, శక్తులతో నింపుతారు. ప్రకృతి యొక్క 5 తత్వాలను కూడా శుద్ధి చేస్తారు.
  3. ప్రపంచంలోని ద్వంద్వత్వాలకు అతీతమైన వారు – భగవంతుడు జనన-మరణాలకు, సుఖ-దుఃఖాలకు, కర్మ, కర్మఫలాలకు అతీతమైన వారు. సదా పరంధామంలోనే ఉంటూ, సదా స్వచ్ఛంగా, ఆనందంగా, వివేకవంతంగా, శక్తివంతంగా, సదా ఆత్మిక స్మృతిలో, మధురంగా ఉండే వారు పరమాత్మ. ప్రపంచంలోని ఆత్మలందరికీ అత్యంత వినయపూర్వకమైన పరమ పిత.
  4. అన్నీ తెలిసిన జ్ఞానసాగరుడు – ఆత్మ జ్ఞానం, స్వయం గురించి, ప్రపంచ నాటకం యొక్క పూర్తి వివరాలు అనగా అది ఎలా చక్రీయంగా ఉంటుందో భగవంతుడికి తెలుసు. జీవితంలోని ప్రతి పరిస్థితి యొక్క రహస్యాలు మరియు దానిని ఎలా పరిష్కరించాలో కూడా వారికి తెలుసు. ప్రతి ఒక్కరూ దైవిక సహాయం కోసం దుఃఖ సమయాల్లో వారి వైపు చూస్తారు. వారు అత్యంత స్వచ్ఛమైన, దివ్యబుద్ధి కలవారు.
  5. మంచితనాన్ని ఇచ్చేవారే కానీ తీసుకునే ఏమీ వారు కాదు – భగవంతుడు ఎవరి నుండి ఏమీ తీసుకోరు లేదా తీసుకోవాలనుకోరు. భౌతికమైనది, భౌతికేతరమైనది అయినా ఇచ్చేటువంటి నిరంతర దాత వారు. అంతా మంచినే ఇస్తూ ఉండేవారు. వారిని స్మరించుకోవడంతో మనం ఆంతరికంగా మనల్ని మనం నింపుకోవడమే కాకుండా, ప్రపంచంలో విజయాన్ని సాధించి, భౌతిక స్థాయిలో ప్రతిదీ మంచిగా పొందుతాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »