Hin

27th feb 2024 soul sustenance telugu

February 27, 2024

భగవంతుని జ్ఞానాన్ని ప్రతిరోజూ ఎలా అధ్యయనం చేయాలి?

భగవంతుడు జ్ఞానసాగరుడు.అత్యున్నతమైన, శక్తివంతమైన, అత్యంత జ్ఞాన సంపన్నలు. వారు శాశ్వతంగా శరీరరహితుడు మరియు జనన-మరణ చక్రంలోకి రారు కాబట్టి, వారికి సృష్టి నాటకం గురించి చాలా స్పష్టంగా తెలుసు. భగవంతుడు కలియుగం లేదా ఇనుప యుగం చివరిలో భూమిపై తన జ్ఞానాన్ని ఇస్తారు. దాని సహాయంతో విశ్వా త్మలందరూ స్వచ్ఛంగా అవుతారు మరియు ప్రపంచం సత్య యుగం లేదా స్వర్ణయుగంలా మారుతుంది. భగవంతుని జ్ఞానాన్ని ప్రతిరోజూ అధ్యయనం చేయడానికి 5 చిట్కాలను చూద్దాం –

 

  1. ఆధ్యాత్మిక అధ్యయనానికి ముందు కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేయండి – ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడానికి లేదా చదవడానికి ముందు మనం కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేసినప్పుడు, మన ఆలోచనలు నెమ్మదిస్తాయి మరియు మన ఏకాగ్రత పెరుగుతుంది. ఇది భగవంతుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడంలో మరియు గ్రహించడంలో మనకు సహాయపడుతుంది.

 

  1. జ్ఞానాన్ని అధ్యయనం చేయడంలో మీ ఉద్దేశ్యాన్ని రివైజ్ చేసుకోండి – మెడిటేషన్ చేసిన తర్వాత, ఈ రోజు నాకు స్వయం భగవంతుడే నేర్పించబోతున్నాడని మీకు మీరే చెప్పుకోండి. ఈ అధ్యయనం నన్ను స్వచ్ఛంగా, పరిపూర్ణంగా మరియు అన్ని గుణాలు, శక్తులతో నింపుతుంది. కావున పూర్తి మానసిక మరియు శారీరక అప్రమత్తతతో నేను అధ్యయనం చేయాలి అని గుర్తుంచుకోండి.

 

  1. చదువుతున్నప్పుడు భగవంతునితో ఒక అందమైన సాన్నిహిత్యాన్ని అనుభవం చేసుకోండి – భగవంతుని జ్ఞానం లోతుగా, అందంగా ఉంటుంది. వారి జ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు భగవంతుడిని ప్రేమగల తల్లిదండ్రులు మరియు గురువుగా గుర్తుంచుకొని అనుభవం చేసుకోండి.

ప్రతి పదం వెనుక భగవంతుని వైబ్రేషన్స్ ని, భావాలను గ్రహించండి. వినడం లేదా చదవడం మాత్రమే చేయవద్దు.

 

  1. జ్ఞానం యొక్క ముఖ్యమైన అంశాలను రాసుకోండి – మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, మీరు రోజులో రివైజ్ చేసుకోవాలనుకున్న జ్ఞానంలోని కొన్ని అంశాలను రాసుకోవటం ముఖ్యం. వాటి గురించి లోతుగా ఆలోచించండి మరియు వాటిని మీ పనులలో, పరస్పర చర్యలలో ధారణ చేయండి.

 

  1. భగవంతునికి కృతజ్ఞతలు చెప్పడంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ముగించండి – మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేసిన తర్వాత, భగవంతుని మధురమైన ప్రేమపూర్వక ఆశీర్వాదాలను తీసుకోండి. మనసులో వారికి కృతజ్ఞతలు చెప్పండి. మీరు ఈ రోజు బోధించిన ప్రతిదానిని అనుసరిస్తారని మరియు రోజంతటిలో ఎప్పుడూ వారి చేతిని వదలనని వాగ్దానం చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »