Hin

25th Jan 2024 Soul Sustenance Telugu

January 25, 2024

భగవంతుని కార్యంలో ఏకమవుదాము

భగవంతుడు పరమాత్మ మరియు విశ్వాత్మలందిరికీ పరమ తండ్రి. వారు శాంతి, ప్రేమ, ఆనందా  ల సాగరుడు. నేడు విశ్వంలో శాంతి, ప్రేమ మరియు ఆనందాలు  లోపించాయి.  ప్రపంచంలోని అందరూ కలిసి ఉండటానికి, అందరి జీవితాలను శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నింపాలని భగవంతుని వైపు అందరూ చూస్తున్నారు. అనేక రకాల ప్రతికూల పరిస్థితులు అందరినీ కలవరపెడుతున్నాయి. ఎంతగా మనం శాస్త్రీయ అభివృద్ధి చేస్తున్నామో, అంతగా మన జీవితాలు మరింత క్లిష్టంగా, సాంకేతికతతో నడపబడుతున్నాయి. దానితో మన సంస్కారాలు, శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు మన సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మనకు దీని నుండి బయటపడే మార్గం ఎందుకు లేదు? దీనిని పరిష్కరించగలవారు భగవంతుడు  తప్ప మరొకరు లేరని ఎందుకు భావిస్తారు? భగవంతుడు ప్రపంచాన్ని పర్యవేక్షించే వారు. కాలక్రమేణా  ప్రపంచంలోని పరిస్థితులను చక్కబెట్టే అవసరం వచ్చినప్పుడు, వారు జోక్యం చేసుకుని అవసరమైన వాటిని ఉత్తమంగా చేస్తారు.

ఈ సమయంలో, భగవంతుడు కొత్త ప్రపంచాన్ని సృష్టించే తన పాత్రను పోషిస్తున్నారు. వారికి మానవుల సహాయం – మనస్సు, శరీరం మరియు సంపదతో పాటు వారి ఆలోచనలు, మాటలు, చర్యలు అవసరం. ఎందుకంటే భగవంతుడు నిరాకారుడు అనగా శరీరం లేనివాడు, ఆత్మల ప్రపంచంలో ఉంటాడు మరియు ప్రపంచ నాటకంలో మానవ ఆత్మలు భూమిపై తమ పాత్రలను పోషిస్తాయి. భౌతిక ప్రపంచంలో మానవులు తమ స్వలాభం కోసం, ఇతరుల ప్రయోజనం కోసం చర్యలు చేస్తారు. కావున, భగవంతుడు మానవులను సాధనాలుగా చేసుకొని తమ కార్యాన్ని చేస్తారు. అలాగే, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు మెడిటేషన్ ద్వారా మనం ఎంత స్వచ్ఛంగా ఉంటామో, అంత ఎక్కువగా మనం  భగవంతుని కార్యంలో సహాయం చేస్తాము. ఆ కార్యం మనకు అందించే సఫలత ద్వారా మన జీవితాల్లో ఆనందాన్ని నింపడమే కాకుండా ప్రపంచంలోని  అనేకుల  జీవితాలలో మంచితనం, సానుకూలత మరియు విజయాన్ని నింపి వారి జీవితాలను అందంగా మారుస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

14th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఉదయం మనం రోజును ప్రారంభించినప్పుడు, వివిధ చర్యలను చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా లేదా మన ఆఫీసులో ఉన్నా

Read More »
13th May 2025 Soul Sustenance Telugu

తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మనది వినాలని లేదా మనమంటే ఆసక్తికరంగా అనిపించాలని అందరితో మాట్లాడుతూ ఉండాలి అని భావిస్తాము. ఈ ఆత్రుత

Read More »
12th May 2025 Soul Sustenance Telugu

సంఘర్షణల సమయంలో వ్యక్తులతో మాట్లాడండి … వారి గురించి మాట్లాడకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధంలో విభేదాలు ఏర్పడినప్పుడు, మనలోని నెగటివ్ భావోద్వేగాలు తరచుగా అవతలి వ్యక్తితో మన సంభాషణలో అవరోధంగా మారతాయి. అవతలి వ్యక్తి గురించి

Read More »