Hin

13th november 2024 soul sustenance telugu

November 13, 2024

భగవంతుని ప్రేమ అనే రెక్కలతో ఎగరటం

మన జీవితంలో ప్రతిరోజూ భగవంతుడిని అనుభవం చేసుకుంటాము. అడ్డంకుల ప్రభావం నుండి దూరంగా ఉంటూ మన జీవితాలను అందంగా ఎలా గడపాలో చూపించినందుకు ప్రతి దశలో మనం వారిని గుర్తుచేసుకుంటాము,  వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. భగవంతుని మధురమైన ప్రేమ మనకు రెక్కలవంటిది, దానితో మనం నిత్య జీవితంలోని సమస్యలను అధిగమించగలము. మన ఆరోగ్యం, సంబంధాలు, పాత్రలు మరియు మన స్వంత సంస్కారాల ద్వారా అయినా మనం ఊహించని సవాళ్లను జీవితం మన ముందుకు తీసుకువస్తుంది. అప్పుడు భగవంతుడి ప్రేమ అనే రెక్కలతో ఎగిరినట్లయితే తేలికగా అయ్యి మన మనస్సులో తలెత్తే ఏమిటి, ఎందుకు, ఎలా మరియు ఎప్పుడు నుండి విముక్తి పొందుతామని వారు అంటారు. మన జీవితంలో ఈ రెక్కలతో ఎలా ఎగరవచ్చో కొన్ని విధానాలను  చూద్దాం:

  1. ఉదయాన్నే భగవంతుడిని సన్నిహితంగా అనుభవం చేసుకోండి – భగవంతుడు ప్రేమ సాగరుడు. వారు రోజంతా మనపై తమ ప్రేమను కురిపిస్తారు. కానీ వైబ్రేషన్లు స్వచ్ఛంగా, నిశ్శబ్దంగా ఉన్న తెల్లవారుజామున చాలా విశేషమైనది. ఈ సమయంలో, మనం ధ్యానం మరియు ఆధ్యాత్మిక అధ్యయనం ద్వారా వారితో కనెక్ట్ అయ్యి వారి ప్రేమను మనస్ఫూర్తిగా పొందవచ్చు.
  2. ప్రతి చర్యలో భగవంతుడిని మీ అతి మధురమైన సహచరుడిగా చేసుకోండి – ఆఫీసులో పని చేస్తున్నా , మీ పిల్లలను చూసుకుంటున్నా లేదా మార్కెట్ కు వెళ్తున్నా, భగవంతుని చేతిని పట్టుకొని ఎల్లప్పుడూ వారి మధురమైన సహవాసంలో ఉండండి. ఈ విధంగా వారి పట్ల మీ ప్రేమ మరియు మీ పట్ల వారి ప్రేమ పెరుగుతుంది. మీరు ప్రతి అడుగులోనూ వారి ప్రేమతో సుసంపన్నం అవుతారు.
  3. మీ వ్యక్తిత్వాన్ని స్వచ్ఛంగా, మధురంగా, వినయంగా మార్చుకోండి – ఏ పిల్లలైతే తమలాంటి స్వభావం అంటే స్వచ్ఛంగా, మధురంగా, వినయంగా ఉంటారో వారు ఎల్లప్పుడూ తమ ప్రేమను పొందుతారని భగవంతుడు అంటారు. అటువంటి పిల్లల జీవితంలో అడ్డంకులు తలెత్తినప్పుడు, భగవంతుడు వారి జీవితంలోకి వచ్చి, ఆ అడ్డంకులను తానే నాశనం చేసి, ఏ రకమైన దుఃఖం నుండైనా వారిని విముక్తి చేస్తారు.
  4. ప్రతి చర్యలో మరియు పరస్పర చర్యలో ఆత్మిక స్మృతితో ఉండండి – ఎవరైతే సదా ఆత్మిక స్మృతిలో ఉంటారో వారే పరమాత్మ యొక్క మంచి పిల్లలు. అలాంటి పిల్లలు తమ జీవితంలో భగవంతుని ప్రేమను పొంది శక్తివంతులు అవుతారు. అటువంటి పిల్లలకు, ఒత్తిడి గత మారుతుంది. వారు జీవితంలోని ఒడిదుడుకులను తేలికగా అధిగమిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »