Hin

8th jan 2025 soul sustenance telugu

January 8, 2025

భగవంతుని ప్రేమ మరియు సహాయంతో సానుకూలతను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 1)

మన మనస్సు యొక్క దృక్పథం సానుకూలంగా ఉందా?


మన చుట్టూ చూస్తే, కొందరు తమ జీవితంలో లోపాల మధ్య ఆనందాన్ని కనుగొంటారు, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండటానికి ఏదో ఒకదాన్ని కనుగొంటారు. మరోవైపు, పరిపూర్ణంగా ఉన్న పరిస్థితులలో కూడా కొద్దిమంది లోపాలను మాత్రమే కనుగొంటారు. ఏ సందర్భంలోనైనా ఒక వ్యక్తి యొక్క ప్రతిస్పందన అనేది ఒక దృక్కోణానికి సంబంధించిన విషయం మాత్రమే. ఒక దృక్పథం అంటే జీవితాన్ని మనస్సు యొక్క ఒక నిర్దిష్ట స్థానం నుండి చూడటం. ఇది మైదానం అంతటా వివిధ స్థానాల నుండి క్రికెట్ మ్యాచ్ చూడటం లాంటిది. ఆట గురించి అంపైర్ పొందే దృక్పధం, వికెట్ కీపర్ పొందేది వేరుగా, అలాగే ఫీల్డర్ భిన్నమైన దృక్పథాన్ని పొందుతాడు, ఎందుకంటే వారందరూ మైదానంలో వేర్వేరు స్థానాల్లో నిలబడతారు. జీవితంలోని రోజువారీ దృశ్యాలలో కూడా, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పరిస్థితిని రెండు వేర్వేరు స్థానాల నుండి చూస్తారు. వారు దానిని భిన్నంగా చూస్తారు మరియు భిన్నంగా స్పందిస్తారు. మన దృక్పథం జీవితాన్ని సాఫీగా జరిగే ఆహ్లాదకరమైన ప్రయాణంగానైనా మార్చగలదు  లేదా హెచ్చుతగ్గులతో నిండి ఉన్న రోలర్ కోస్టర్ ప్రయాణంగా మార్చగలదు. 


జీవిత దృశ్యాలను చూడటానికి మనస్సు యొక్క అత్యంత సానుకూల స్థానాన్ని ఎంచుకుందాం. ఆ స్థానం నుండి సన్నివేశానికి శాంతి, ప్రేమ మరియు ఆనందం వంటి మన సానుకూల సుగుణాలు వెలుపలకు ప్రవహిస్తాయి. ఆ స్థానం నుండి మన మనస్సు స్వేచ్ఛగా వ్యక్తమవుతూ బాహ్య పరిస్థితిని అనుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తమ మానసిక స్థితిని గుర్తించడం మరియు ఎంచుకోవడం మన వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. మనస్సు ఆత్మ యొక్క అసలైన గుణాలతో నిండి ఉంటే అంతరంగం సానుకూలంగా ఉంటుంది. మనస్సు అస్తవ్యస్తంగా ఉంటే, ఆ సానుకూల దృక్పథం అరుదు అయిపోతుంది. ఆత్మజ్ఞానం మరియు ఆత్మపరిశీలనను ప్రోత్సహించే ధ్యానం వంటి కార్యకలాపాలలో మనం క్రమం తప్పకుండా నిమగ్నమైనప్పుడు, మనస్సు సానుకూల స్థితిలోకి ప్రవేశిస్తుంది. శాంతి, ప్రేమ మరియు ఆనందం వైపు దృష్టి పెట్టడం నేర్చుకుంటుంది. చివరికి ఇది ప్రతి వ్యక్తి, పరిస్థితి… మరియు జీవితం గురించి మనకున్న దృక్పథానికి సానుకూలత రంగులు వేస్తుంది.


(సశేషం…)

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »